India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏయూలో బీటెక్ విద్యార్థి తమ్మినేని కౌశిక్(22) రామాటాకీస్ సమీపంలోని లాడ్జిలో విగతజీవిగా కనిపించాడు. కాకినాడకు చెందిన కౌశిక్ ఈనెల 10న లాడ్జిలో దిగాడు. ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో అమెరికాలో ఉన్న అతని అన్నయ్య కౌశిక్ ఫ్రెండ్స్‌కి కాల్ చేశాడు. వాళ్లు లాడ్జికి వెళ్లి చూడగా మరణించి ఉన్నాడు. ఘటనా స్థలంలో పాయిజన్ తాగి మృతి చెందిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వినాయక చవితి భద్రతా మార్గదర్శకాలపై కోఆర్డినేషన్ మీటింగ్‌ను పోలీసు కమిషనర్ శంఖబ్రాత బాగ్చి మంగళవారం నిర్వహించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్, అగ్నిప్రమాద నివారణ చర్యలు, సీసీ కెమెరాలు, వాలంటీర్ల నియామకం, నిమజ్జనానికి గుర్తించిన ప్రదేశాల వినియోగం తప్పనిసరి. డ్రోన్లతో నిఘా, డొనేషన్ల బలవంతం, DJ, మత్తుపదార్థాలపై నిషేధం తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇటీవల ఎన్నికైన జీవీఎంసీ స్థాయి సంఘం సభ్యులు మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కమిషనర్ సభ్యులను అభినందిస్తూ, నగరంలోని ప్రతి అభివృద్ధి పనిపై స్థాయి సంఘంలో సమగ్రంగా చర్చించి ఆమోదం తెలుపడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని అన్నారు. నగర అభివృద్ధిలో సంఘం కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈనెల 30న విశాఖలోని మున్సిపల్ స్టేడియం వేదికగా జనసేన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం విశాఖలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యకర్తల సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని, ఈ సభనుంచి కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.
విశాఖలోని న్యాయ స్థానాల్లో సిబ్బంది నియామకానికి ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులంతా ఈ పరీక్షలకు 15 నిమిషాల ముందుగానే హాజరు కావాలన్నారు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించి పరీక్షకు హాజరుకావాలని సూచించారు.
గవరకంచరపాలెంలో గేదెల రేఖ ఆమె ఇద్దరు ఆడపిల్లలు ప్రీతి(10), శృతి(9)తో నివాసం ఉంటున్నారు. సోమవారం మ.2గంటలకు ఆమె డ్యూటీకి వెళ్లి రాత్రి 11కు వచ్చేసరికి ఇంట్లో ఇద్దరు పిల్లలు కనిపించలేదు. చుట్టుపక్కల వారిని అడగగా బయటకు వెళ్లి రాలేదన్నారు. ఆమె కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పిల్లలు నలుపు, తెలుపు రంగు గౌనులు వేసుకున్నారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలన్నారు.
విశాఖ సిటీలో నలుగురు ఎస్సైలను బదిలీచేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. భీమిలి ట్రాఫిక్ ఎస్ఐగా ఉన్న చిరంజీవిని ఎంవీపీ ట్రాఫిక్ ఎస్ఐగా, ఎంవీపీలో ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్న కనకరావును ఆరిలోవ ట్రాఫిక్ ఎస్ఐగా, సిటీ ఆర్మడ్ విభాగంలో ఎస్ఐగా ఉన్న తిరుపతిరావును భీమిలి ట్రాఫిక్ ఎస్ఐగా, వీఆర్‌లో ఉన్న మురళీకృష్ణను సీసీఆర్‌బీలో నియమిస్తూ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జీవీఎంసీలో ఎనిమిది జోన్లు ఉండగా రెండు జోన్లకు సంబంధించి ఏసీపీలను ఆకస్మికంగా బదిలీ చేశారు. జోన్-2లో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న తిరుపతిరావును జ్ఞానాపురంలో జోన్-5 ఎసీపీగా నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న శాస్త్రి సబాన్ మధురవాడ జోనల్-2 టౌన్ ప్లానింగ్ అధికారిగా నియమించారు. గతంలో వివాదాస్పదంగా వ్యవహరించిన శాస్త్రి రాకతో మధురవాడలో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
విశాఖలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. నిన్న రాత్రి చిలకపేట వద్ద జరిగిన కాల్పులు ఘటన కారణంగా ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్ హోల్డర్స్, అనుమానితుల ఇళ్లల్లో ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలపై పూర్తి సమాచారం మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది.
విశాఖ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 173వినతులు అందాయి. ఉదయం 10 గంటల నుంచి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన 66, పోలీస్ శాఖకు 10, జీవీఎంసీకి 50, ఇతర శాఖలకు 47 వినతులు అందినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.