India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈరోజు ఉ.10 గంటలకు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు మొదలవ్వనున్నాయి. మొత్తం 97మంది <<17313160>>కార్పొరేటర్లు<<>> ఉండగా.. కూటమి తరుఫున 10 మంది, వైసీపీ తరఫున 10మంది పోటీలో ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది. జనసేనలో ఒకరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఎన్నికకు తాను దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రకటించారు. మరో కార్పొరేటర్ బి.గంగారావు కూడా ఓటింగ్‌లో పాల్గొనరని సమాచారం.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్వాంటం కంప్యూటింగ్‌పై వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను AU వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 తేదీ వరకు క్వాంటం కంప్యూటింగ్ ఇన్సైట్స్ ఫర్ అకడమీషన్స్-కాన్సెప్ట్, అప్లికేషన్స్ అండ్ టూల్స్ అనే అంశంపై ఎఫ్.డి.పి నిర్వహించనున్నారు.
విశాఖ సీపీ డా.శంఖబ్రత బాగ్చి చొరవతో కేజీహెచ్, ఏఎంసీ సహకారంతో సిటీ పోలీసులకు యాన్యువల్ హెల్త్ చెకప్ మంగళవారం ప్రారంభమైంది. సుమారు 2700 మంది సిబ్బందికి ఈ నెలాఖరులోగా పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి రోజున 150 మంది సిబ్బంది పాల్గొన్నారు. 2024లో ప్రారంభించిన కార్యక్రమం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే గుర్తించగలిగామని, ఈసారి మరిన్ని పరీక్షలు చేస్తామని సీపీ పేర్కొన్నారు.
విశాఖ వేదికగా పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్‌లో ఆగష్టు 9న రాష్ట్ర స్థాయి 6వ జూనియర్, సబ్-జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పోటీల గోడ పత్రికను కలెక్టర్ హరీంద్రప్రసాద్ ఆవిష్కరించారు. విశాఖ వేదికగా జరిగే ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి పారా క్రీడాకారులు రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు.
జీవీఎంసీలో బుధవారం జరుగనున్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఓటింగ్ విధానంపై కార్పొరేటర్లకు GVMC అదనపు కమిషనర్ రమణమూర్తి మంగళవారం అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు ఓటర్ ఐడెంటిఫికేషన్ ఐడి కార్డును చూపించి లోపలకి వెళ్లాలన్నారు. ఒక ఓటరు 10ఓట్లు మాత్రమే వేయాలని, అంతకన్నా ఎక్కువ వేస్తే బ్యాలెట్ చెల్లదన్నారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రౌండ్ సర్కిల్ వద్ద రోడ్డుపై నడుస్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం పిల్లల దత్తత ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దత్తత తీసుకోవాలనుకునే వారు పాన్ కార్డు, ఆదాయ, వయస్సు, నివాస, వివాహ, ఆరోగ్య ధృవీకరణ పత్రాలను సమర్పించాలన్నారు. దత్తత తీసుకోవాలనుకునే వారు ICDS అధికారులను గానీ wws.cara.wcd.gov.in వెబ్ సైట్‌ను సంప్రదించచాలన్నారు.
దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో బ్రిడ్జి వద్ద గత నెల 31న బిచ్చగాడు మనోజ్‌ను దారుణంగా హత్య చేసిన ఘటనలో దేవరాజ్ అనే వ్యక్తిని దువ్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. 31న రాత్రి బిచ్చగాడు మనోజ్, దేవరాజ్ కలిసి మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో మనోజ్‌ను చంపేసి దేవరాజ్ పరారయ్యాడు. దువ్వాడ పోలీసులు గాలించి నిందితుడ్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో ఉక్కుశాఖా మంత్రి కుమారస్వామిని సోమవారం ఎంపీ శ్రీభరత్ కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగులను మళ్లీ నియమించాలని, పూర్తిస్థాయి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. కేంద్రీయ విద్యాలయం బదిలీ, విమల విద్యాలయ సిబ్బందికి VRS అమలు వంటి అంశాలను ప్రస్తావించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు అనుగుణంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. పీ-4 మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమమని, ఎవరిపైనా ఒత్తిడి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బంగారు కుటుంబాలకు సాయం అందించే విధంగా మార్గదర్శులను మ్యాపింగ్ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.