Visakhapatnam

News March 25, 2026

విశాఖ: 28న జడ్పీ సర్వసభ్య సమావేశం

image

ఈనెల 28న స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఛైర్‌పర్సన్ అధ్యక్షతన ఉదయం10:30 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుందని జడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

News March 25, 2026

జీవీఎంసీలో పెరగనున్న కార్పొరేషన్ వార్డుల సంఖ్య

image

ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా వార్డుల సంఖ్య సవరణకు నిర్ణయం తీసుకుంది. 15 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో గరిష్ఠంగా 120 వార్డులు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుతం జీవీఎంసీలో 98 వార్డులు ఉండగా, జనాభా దాదాపు 24 లక్షలకుపైగా చేరింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, జీవీఎంసీలో విలీనం చేయాల్సిన గ్రామాల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

News March 24, 2026

విశాఖ విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్

image

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మంగళవారం విశాఖ విచ్చేశారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంక బ్రత బాగ్చి స్వాగతం పలికారు. అనంతరం నగరంలోకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాత్రి హోటల్లో బస చేసి, రేపు ఉదయం10 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్‌లో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ పయనమవుతారు.

News March 24, 2026

సింహాచలం: రూ.15.55 కోట్లకు తలనీలాల షీల్డ్ టెండర్

image

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ ఆధ్వర్యంలో తలనీలాల షీల్డ్ టెండర్‌కు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.15.55 కోట్లకు తమిళనాడుకు చెందిన దురై ఎంటర్‌ప్రైజెస్ దక్కించుకుంది. ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు ఈ టెండర్ అమలులో ఉండనుంది. గత వేలం పాటలతో పోలిస్తే ఈసారి దేవస్థానానికి గణనీయమైన ఆదాయం లభించిందన్నారు.

News March 24, 2026

సాధార‌ణ భ‌క్తులకు పెద్దపీట వేస్తూ చంద‌నోత్స‌వం: మంత్రి డోలా

image

సాధార‌ణ భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ సింహాచ‌లం చంద‌నోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ‌బాల వీరాంజ‌నేయ స్వామి పేర్కొన్నారు. మంగళవారం విశాఖలో అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్ 17వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేయాలన్నారు. భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులూ త‌లెత్త‌కుండా ఉచిత‌, రూ.300, రూ.1,000, రూ.1,500 టిక్కెట్లకు క్యూ‌లైన్ల‌ను ఏర్పాటు చేస్తునట్టు కలెక్టర్ తెలిపారు.

News March 24, 2026

విశాఖ: ట్రాన్స్‌జెండర్‌లకు CNG ఆటోలు పంపిణీ చేసిన మంత్రి

image

విశాఖ పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కలెక్టరేట్‌లో అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ముగ్గురు ట్రాన్స్‌జెండర్‌లకు CNG ఆటోలు పంపిణీ చేశారు. అదేవిధంగా ముగ్గురు దివ్యాంగులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణు కుమార్ రాజు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు.

News March 24, 2026

సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

image

సింహాచలం వార్షిక చందనోత్సవం ఏప్రిల్ 20న జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిని ఆయన ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.

News March 24, 2026

మార్చి ఆఖ‌రు నాటికి ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

image

మార్చి నెల ఆఖ‌రు నాటికి జిల్లాలోని ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ఏప్రిల్ నెల నుంచి జ‌న గ‌ణ‌న-2027 ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌ని, ఈ లోగా ఓట‌ర్ల జాబితాల‌కు సంబంధించిన పనుల‌ను పూర్తి చేసుకోవాల‌న్నారు.సంబంధిత శాఖ‌ల అధికారులు కింది స్థాయి అధికారుల‌తో,స‌చివాల‌య సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకొని ప్ర‌క్ర‌య‌ను వేగ‌వంతం చేయాలని ఆదేశించారు.