India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సచివాలయం ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అక్కయ్యపాలెంలోని జగ్గారావు బ్రిడ్జి వద్ద గల సచివాలయంలో పనిచేస్తున్న పైల రాజేశ్ రెవెన్యూ పనులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ సమీపంలో ఉండే ఒక కుటుంబానికి చెందిన తల్లి ఆస్తులు కొడుకు పేరు మీద బదలాయించేందుకు రూ.80,000 లంచం డిమాండ్ చేశాడు. సోమవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గత YCP పాలనలో బీసీలను వెంటాడి వేధించారని మంత్రి లోకేశ్ విమర్శించారు. సోమవారం విశాఖలో ఆయన మాట్లాడారు. శెట్టిబలిజల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బోడసకుర్రులో ఆరు నెలల్లో విగ్రహం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కల్లుగీత కార్మికులకు మద్దతుగా ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ సందర్భంగా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. 21 రోజులు గడువు దాటినా ఫిర్యాదు పరిష్కరించని ఆనందపురం సర్వేయర్‌కు నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. పద్మనాభం MRO పరిధిలోని అంశాలను త్వరితగతిన ముగించాలని, డీఎంహెచ్‌వో, అటవీ శాఖలు తమ పెండింగ్ ఫైళ్లను తక్షణమే క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు.

సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు సోమవారం విశాఖ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ వీసీ హాలులో ఆయన చిత్రపటానికి కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి దొమ్మేటి వెంకటరెడ్డి నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 23న విశాఖ రానున్నారు. 23న మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నగరంలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం వేకువజాము వరకు కైలాసగిరి, సత్యం కూడలిలో గల విప్రో కంపెనీ వద్ద ఆక్టోపస్ టీం విశాఖ నగర సిటీ పోలీస్ బాంబు స్క్వాడ్‌తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించింది. అకస్మాత్తుగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే దాని నుంచి వీఐపీలను ఎలా కాపాడాలి, ఎలా బయటపడాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు వారు తెలిపారు.

ఆరిలోవలోని గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో బంధువులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు వివరాల ప్రకారం.. శ్వేత అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా పాతగరువులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఆడపడుచు ఉంటున్న ఎస్సైజీనగర్ ఇంటికి శ్వేత వెళ్లగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్వేత వెంటనే అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకోగా తలుపులు పగలగొట్టి ఆసుపత్రికి తరలించారు.

వేసవి కాలంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నగర వాసులకు సూచించారు. ప్రస్తుతం విశాఖనగరానికి రోజుకు సుమారు 400 మిలియన్ లీటర్ల (MLD) నీటి అవసరం ఉండగా.. 2047 నాటికి ఇది సుమారు 726 MLDకి పెరుగుతుందని తెలిపారు. విశాఖపట్నం వేగంగా ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కావున నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నగర పరిపాలనకు సహకరించాలని ఆయన కోరారు.

వేసవి కాలంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నగర వాసులకు సూచించారు. ప్రస్తుతం విశాఖనగరానికి రోజుకు సుమారు 400 మిలియన్ లీటర్ల (MLD) నీటి అవసరం ఉండగా.. 2047 నాటికి ఇది సుమారు 726 MLDకి పెరుగుతుందని తెలిపారు. విశాఖపట్నం వేగంగా ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కావున నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నగర పరిపాలనకు సహకరించాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.