Visakhapatnam

News July 10, 2025

మత్యకారులకు రాయితీపై బోట్లు, ఇంజిన్‌ల సరఫరా

image

‘జాతీయ ఫిష్ ఫార్మర్స్ డే’ని పురష్కరించుకొని గురువారం పెదజాలరిపేటలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్యకారులకు 55 ఇంజిన్లు సరఫరా చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు చేతుల మీదుగా వాటిని అందించారు. రూ.45.81 లక్షలు విలువ కలిగిన ఇంజిన్లకు ప్రభుత్వం రూ.18.32 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. నియోజకవర్గంలో బోట్లు, ఇంజిన్లు, వలలు కావలసిన జాలరులకు 40% రాయితీపై సరఫరా చేస్తామన్నారు.

News July 10, 2025

పిల్ల‌ల ల‌క్ష్య సాధ‌న‌లో త‌ల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవ‌స‌రం: కలెక్టర్

image

పిల్లల ల‌క్ష్య సాధ‌న‌లో త‌ల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవ‌స‌ర‌మ‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. మెగా పేరెంట్స్&టీచ‌ర్స్ మీటింగుల్లో భాగంగా చిన‌గ‌ద‌లి జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్లో గురువారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి పాల్గొన్నారు. చిన్నారుల‌కు వారి తల్లిదండ్రులు రోజూ ప్ర‌త్యేక స‌మ‌యం కేటాయించాల‌ని, పాఠ‌శాల నుంచి వ‌చ్చాక ఉత్తేజ‌ప‌రచాల‌ని సూచించారు.

News July 10, 2025

విశాఖ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కంచరపాలెం సమీపంలోని NCC రైల్వే యార్డ్ వద్ద జరిగింది. స్థానికుల సమాచారంతో GRP ఎస్‌ఐ అబ్దుల్ మారూఫ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయసు సమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. అతని ఐడెంటిటికీ సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని, మృతదేహాన్ని KGHకి తరలించామన్నారు. పై ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పేర్కొన్నారు.

News July 10, 2025

రేపు విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

image

రెండు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం విశాఖ రానున్నారు. రేపు ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్‌కు వెళ్తారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి విశాఖలో బస చేస్తారు. శనివారం పార్వతీపురంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని శనివారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.

News July 10, 2025

సత్యసాయి భక్తులు గ్రేట్…!

image

విశాఖలో జరిగిన గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భక్తులకు ఉపశమనం కల్పించేందుకు విశాఖ జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థ సేవలు అందించింది. ప్రదక్షిణ జరిగిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వనమూలికలతో తయారు చేసిన నూనెతో భక్తుల కాళ్లకు మర్దన చేశారు. టీ, మిర్యాల పాలు, ప్రసాదం, అల్పాహారం అందించారు. ఎమ్మెల్యే గణబాబు వీరి సేవలను వీక్షించి అభినందించారు.

News July 9, 2025

గిరి ప్రదక్షణలో తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకి చేర్చిన పోలీసులు

image

సింహాచలం “గిరి ప్రదక్షణ”లో పైనాపిల్ కాలనీ సమీపంలో రెండు సంవత్సరాల బాలుడు దిక్కుతోచని స్థితిలో తిరగడం పోలీసులు గమనించి వివరాలు అడుగగా చెప్పలేకపోయాడు. వెంటనే పోలీసులు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా బాలుడు గుర్తులు తెలియజేస్తూ ప్రకటన చేశారు. బాలుడు తల్లి అది విని సమీపంలో పోలీసులు ద్వారా అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆమెకు క్షేమంగా అప్పగించారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

News July 9, 2025

అర్ధరాత్రి అప్పన్నకు చందనం సమర్పణ

image

సింహాచలం అప్పన్న స్వామికి అర్ధరాత్రి పౌర్ణమి సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. దీంతో స్వామివారు పరిపూర్ణంగా నిత్య రూపంలోకి మారుతారు. 2 గంటల సమయంలో సుప్రభాత సేవ అనంతరం చందనం సమర్పిస్తారు. అనంతరం 3గంటలకు ఆరాధన, బాల భోగం, రాజ భోగం నిర్వహిస్తారు. గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు తెల్లవారుజామున 5:30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి.

News July 9, 2025

‘ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

image

VMRDAకి చెందిన అన్ని కళ్యాణ మండపాల బుకింగ్‌లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. బుధవారం VMRDA బాలల థియేటర్లో ఆయన ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ప్రజలకు VMRDA సేవలు పారదర్శకంగా కల్పించేందుకు ఆన్లైన్ సేవలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్‌లోనే కళ్యాణమండపం రుసుము, తదితర వివరాలు ఉంటాయని పేర్కొన్నారు.

News July 9, 2025

ద్వారకానగర్: పిల్లలకు సెలవు.. పేరెంట్స్‌ వెళితే గేట్లకు సీల్

image

ద్వారకానగర్‌లోని రవీంద్ర భారతీ స్కూల్ 3 రోజులుగా తెరవలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా అసలు నిజం బయటపడింది. సిబ్బందికి ESI కల్పించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటికి స్పందన లేకపోవడంతో స్కూల్‌కు సీల్ వేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే మేనేజ్‌మెంట్ పిల్లలకు సెలవు ప్రకటించిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న DEO ప్రేమ్ కుమార్ ESI అధికారులతో మాట్లాడారు.

News July 9, 2025

సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

image

ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి, శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.