Visakhapatnam

News August 21, 2024

అచ్యుతాపురం: ఉలిక్కిపడిన సమీప గ్రామాలు

image

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియాక్టర్ పేలిన సమయంలో భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సెజ్ లోని అగ్నిమాపక యంత్రంతో పాటు 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. రియాక్టర్ పేలుడు ధాటికి మొదటి అంతస్తు శ్లాబు కూలిపోగా, శిథిలాల కింద ఉన్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 16మంది కార్మికులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.

News August 21, 2024

అయ్యో పాపం.. శిథిలాల కింద కార్మికుల మృతదేహాలు

image

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో కార్మికులు శిథిలాల్లో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. ప్రాథమిక సమాచారం మేరకు రియాక్టర్ పేలడంతో గ్యాస్ ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఊపిరాడక కొంతమంది శిథిలాల మధ్యలో మరి కొంతమంది చిక్కుకొని మృత్యువాత పడ్డారు. సుమారు 14 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అధికారులు వివరాలు పూర్తిగా వెల్లడించాల్సి ఉంది.

News August 21, 2024

అనకాపల్లి: బాలికపై వృద్ధుడి అత్యాచారం

image

అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కోటవురట్ల మండలంలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల బాలికపై స్థానికంగా ఉంటున్న పాములు అనే వ్యక్తి అత్యాచారం చేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 21, 2024

అందరూ విశాఖ ఉక్కును వాడండి: మంత్రి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి బుధవారం సందర్శించారు. ప్లాంట్ పరిస్థితిపై ఆరా తీశారు. ప్లాంట్ నిర్వహణకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. వేతనాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రజలు విశాఖ ఉక్కును వాడాలని మంత్రి కోరారు.

News August 21, 2024

జగన్‌ను కలిసిన బొత్స

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యానారాయణ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బొత్సకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. బొత్స వెంట విశాఖ, విజయనగరం జడ్పీ ఛైర్మన్లు జల్లి సుభద్ర, మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్‌.మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, ఉత్తరాంధ్ర కీలక నేతలు ఉన్నారు.

News August 21, 2024

విద్యార్థుల మరణాలపై ఎస్టీ కమిషన్ కేసు

image

అనకాపల్లి(D) కైలాసపురం ఆశ్రమంలో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ST కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. విద్యార్థుల మరణాలు, అస్వస్థతపై నివేదిక ఇవ్వాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డీవీవీ శంకరరావు ఆదేశించారు. మరోవైపు ఆశ్రమ నిర్వాహకుడు పాస్టర్ కిరణ్ కుమార్‌‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌ నిమిత్తం జైలుకు తరలించారు. పాసా ట్రస్ట్‌ను సీజ్ చేశారు.

News August 21, 2024

23న కంచరపాలెంలో జాబ్ మేళా

image

విశాఖ నగరం కంచరపాలెం జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈనెల 23న నిరుద్యోగ యువతకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి సీహెచ్ సుబ్బిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల్లో 750 ఖాళీలను భర్తీ చేసేందుకు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 10, ఇంటర్, డిగ్రీ, డిప్లోమా ఎలక్ట్రికల్, ఫార్మసీ, పీజీ చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

News August 21, 2024

సింహాచలం: మరో అవకాశం ఇవ్వండి

image

విశాఖ నగరం సింహాచలం దేవస్థానం భూ సమస్యను పరిష్కరించాలని తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన అమరావతిలో చంద్రబాబును కలిశారు. గతంలో 296 జీవోకు సంబంధించి చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు తెలిపారు. మళ్లీ అదే జీవోను కొనసాగించి మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

News August 21, 2024

మరికాసేపట్లో విశాఖ MLCగా బొత్స ప్రమాణం

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలోని శాసనమండలిలో ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. బొత్స చేత శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌తో బొత్స భేటి అవుతారు.

News August 21, 2024

దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి దువ్వాడ మీదుగా హైదరాబాద్-కటక్-హైదరాబాద్ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిందని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు హైదరాబాద్-కటక్ ప్రత్యేక రైలు(07165), ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు కటక్-హైదరాబాద్ రైలు(07166) నడుస్తుందన్నారు.