Visakhapatnam

News August 14, 2024

విశాఖ జిల్లాలో రూ.5 భోజనం ఇప్పట్లో లేనట్లే

image

ఆగస్టు 15న పలు ప్రాంతాలలో అన్న క్యాంటీన్లు తెరచుకోనున్నాయి. కానీ విశాఖ జిల్లాలో మాత్రం పేదలకు రూ.5 కు భోజనం ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. దీనికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలే కారణం. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో విశాఖ జిల్లాలో అన్న క్యాంటీన్ల పున:ప్రారంభం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

News August 14, 2024

విశాఖ: శ్రీకాకుళం వరకే బ్రహ్మపుర రైలు

image

వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో పూండి-నౌపడా సెక్షన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా విశాఖ బ్రహ్మపుర రైలు గమ్యాన్ని కుదించినట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. విశాఖ బ్రహ్మపుర రైలు ఈనెల 18వ తేదీన శ్రీకాకుళం రోడ్డు వరకే నడుస్తుందని పేర్కొన్నారు. ఈనెల 19న తిరుగు ప్రయాణంలో బ్రహ్మపుర విశాఖ రైలు బ్రహ్మపురకు బదులు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరుతుందన్నారు.

News August 14, 2024

వైసీపీ పూర్వవైభవానికి బొత్స విజయం బీజం: అంబటి

image

విశాఖ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికలలో బొత్సను వైసీపీ అధిష్ఠానం బరిలో దింపింది. అయితే కూటమి నుంచి ఎవరూ పోటీలోలేరని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స విజయం ఖాయం కానుంది. దీనికి స్పందిస్తూ మాజీ మంత్రి అంబటి ” YSRCP పూర్వ వైభవానికి బీజం వేసిన బొత్స విజయం ” అంటూ తన X లో పేర్కొన్నారు. ఇది నిరుత్సాహంలో ఉన్న వైసీపీకి ఊరటనిచ్చే విషయమేనని పలువురు చర్చించుకుంటున్నారు.

News August 14, 2024

విశాఖ బీచ్‌ రోడ్డులో ప్రమాదానికి కారణం అదే..!

image

విశాఖ బీచ్ రోడ్డులోని డైనో పార్క్‌లో నిన్న ఉదయం భారీ <<13841865>>అగ్నిప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. జంతువుల నమూనాలు, వివిధ క్రీడా సామగ్రి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో దాదాపు రూ.60 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఉదయం కావడంతో పార్కులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

News August 14, 2024

సింహాద్రి అప్పన్న నిత్యన్నదానానికి నేటితో 35 ఏళ్లు

image

సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రారంభించిన నిత్య అన్నదాన సత్రానికి నేటితో 35 సంవత్సరాలు పూర్తికానుంది. 1989 ఆగస్టు 14వ తేదీన అప్పటి దేవస్థానం ఉద్యోగులు మొదటి విరాళంగా రూ.50 వేలుతో ఈ అన్నదానాన్ని ప్రారంభించారు. 2024 ఆగస్టు 14తో 36వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 35 కోట్ల 50 లక్షల రూపాయలు డిపాజిట్‌తో ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు.

News August 14, 2024

విద్యాశాఖ మంత్రితో విశాఖ నార్త్ ఎమ్మెల్యే భేటీ

image

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అమరావతిలో మంగళవారం భేటీ అయ్యారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు.

News August 13, 2024

విశాఖ తహశీల్దార్ హత్య కేసులో బెయిల్ రద్దు

image

విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడు గంగరాం బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోర్టులో పీఎంపాలెం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సాక్ష్యాలు తారుమారు చేస్తున్నాడని కోర్టుకు పోలీసులు తెలిపారు. పోలీసుల వాదనలు విన్న భీమిలీ కోర్టు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ నిందితుని బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.

News August 13, 2024

ట్రైన్‌లో బ్యాగు చోరీ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రత్యక్షం

image

చెన్నైకి చెందిన కార్తికేయన్‌కు హైదరాబాదులో జాబ్ రావడంతో ఈనెల 8న శబరి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరగా బ్యాగు చోరీకి గురైంది. నగదుతో పాటు ల్యాప్‌టాప్, సర్టిఫికెట్లు, పలు కార్డులు ఉన్నాయి. దొంగ రూ.3వేలు తీసుకుని బ్యాగును గుడ్స్ ట్రైన్‌లోకి విసిరేశాడు. ఆ ట్రైన్ నేడు స్టీల్ ప్లాంట్‌కు రావడంతో ఓ కార్మికుడు బ్యాగును చూసి యూనియన్ నేత అయోధ్య రామ్‌కు అప్పగించాడు. దానిని బాధితుడికి అప్పగిస్తామని వారు తెలిపారు.

News August 13, 2024

విశాఖలో హీరో విక్రమ్ సందడి

image

తంగళాన్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో విక్రమ్, హీరోయిన్ మాళవికళ మంగళవారం విశాఖలో సందడి చేశారు. వారిని సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి సింహాద్రి నాధుడు జ్ఞాపిక బహుకరించారు.

News August 13, 2024

విలువలకు కట్టుబడి పోటీ చేయలేదు: హోం మంత్రి

image

విలువలకు కట్టుబడి ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. గెలవాలనుకుంటే తాము ఈజీగా గెలుస్తామన్నారు. వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు పలువురు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్ జగన్‌కు 58 మందితో భద్రత ఇస్తున్నామన్నారు. అలాగే జగన్ భార్యకు తల్లికి తగిన సెక్యూరిటీ కల్పించామన్నారు.