Visakhapatnam

News August 11, 2024

థాయిలాండ్ వేదికపై మెరిసిన గాజువాక చిన్నారి

image

థాయిలాండ్‌లో ప్రపంచ దేశాల పిల్లల మధ్య జరిగిన మోడలింగ్ పోటీల్లో గాజువాకకు చెందిన చిన్నారి చిహ్నిక తన విశేష ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచింది. వివిధ దేశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతల మధ్య జరిగిన హోరాహోరీగా జరిగిన పోటీల్లో సీనియర్ టోడ్లర్ విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. దీంతో పాటు ఎక్ట్రమ్ టాలెంట్, బెస్ట్ ఇంట్రడక్షన్ సబ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుని శభాశ్ అనిపించుకుంది.

News August 11, 2024

విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

image

విశాఖ-బెంగళూరు-విశాఖ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. విశాఖ-ఎస్ఎంవీ బెంగళూరు (08543) ప్రత్యేక రైలు ఈనెల 18 నుంచి నవంబరు 24వరకు ప్రతి ఆదివారం మ.3.55 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు-విశాఖ (08544) ఈ నెల 19 నుంచి నవంబరు 25 వరకు ప్రతి సోమవారం మ.3.55 గంటలకు బెంగళూరులో బయలుదేరి తరువాత రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

News August 11, 2024

రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు

image

రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్‌ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ మీటర్లను తొలుత ప్రభుత్వం కార్యాలయాల్లో ఏర్పాటు చేసి ఆ తర్వాత గృహలకు ఏర్పాటు చేస్తారు. విద్యుత్ ఎంత వినియోగించింది వీటి ద్వారా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు ఆన్‌లైన్‌లో రీడింగ్ తీసుకునే అవకాశం వీటి ద్వారా ఉంటుంది.

News August 11, 2024

గ్రీన్ ఫీల్డ్ హైవే.. 90 శాతం పనులు పూర్తి

image

రాయపూర్-విశాఖ ఎకనామిక్ కారిడార్-15లో భాగంగా నిర్మిస్తున్న ఆరు లైన్ల రహదారి పనులు 90 శాతం పూర్తికావచ్చాయి. సుమారు 464 కిలోమీటర్ల పొడవైన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే మన రాష్ట్రంతో పాటు చత్తీస్‌ఘడ్, ఒడిశా గుండా వెళుతుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. ఈ హైవే కోల్‌కత్తా నుంచి విజయనగరం వద్ద కన్యాకుమారి వరకు నడిచే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌ను కలుపుతుంది.

News August 11, 2024

పెందుర్తిలో వ్యభిచార గృహంపై దాడి

image

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. నిర్వాహకురాలు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని ఇద్దరు యువతులను రక్షించారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును పెందుర్తి పోలీసులకు అప్పగించారు.

News August 11, 2024

శ్రీకాకుళం రోడ్డు వరకే పలాస మెము

image

పలాస-పూండి-నౌపడ-విజయనగరం సెక్టరులో ఆధునీకరణ పనుల కారణంగా ఈనెల 15,17 తేదీల్లో విశాఖ-పలాస (07470) మెము ట్రైన్ శ్రీకాకుళం వరకు నడుస్తుందని అధికారులు వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో పలాస-విశాఖ (07471) మెము ఈనెల 15,17 తేదీల్లో శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఆయా తేదీల్లో శ్రీకాకుళం, పలాస మధ్య రైలు ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు.

News August 11, 2024

విశాఖలో ఓటు హక్కుకు ఎమ్మెల్సీలు దరఖాస్తు

image

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేర్లు చేర్చాలని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభా రవిబాబు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు ఉన్నారు. జీవీఎంసీ అధికారులు వీరి దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వీరి ముగ్గురికి ఓటు హక్కు కల్పిస్తే ఎమ్మెల్సీ ఓటర్ల సంఖ్య 841కి చేరుతుంది.

News August 11, 2024

విశాఖలో చెడ్డీ గ్యాంగ్ దోపిడి

image

ఎండాడ పనోరమహిల్స్‌లో ఈ నెల ఎనిమిదవ తేదీ రాత్రి భారీ దోపిడీకి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్‌గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 38 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 10 లక్షలు నగదు అపహరణకు గురైనట్లు కేసు నమోదు చేశారు. చెడ్డీ గ్యాంగే ఈ దోపిడీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజీలు వేలిముద్రల ఆధారంగా గుర్తించారు. గుజరాత్‌కు చెందిన ఆరుగురు ముఠా సభ్యులు ఈ దోపిడీలో పాల్గొన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.

News August 11, 2024

పాడేరు: జాతీయ జెండాను ఆవిష్కరించనున్న జిల్లా కలెక్టర్

image

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు, కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మిగిలిన జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కానీ అల్లూరి జిల్లాలో ఆ అవకాశం కలెక్టర్‌కు లభించింది.

News August 10, 2024

భీమిలి: పాఠశాల బస్సు ఢీకొని చిన్నారి మృతి

image

పాఠశాల బస్సు ఢీకొని బాలిక మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బంటుపల్లి ఆద్య(3) తండ్రి సురేష్ మజ్జిపేటలో నివాసం ఉంటున్నారు. రెడ్డిపల్లి జంక్షన్ వద్ద ఉన్న జ్ఞానజ్యోతి పాఠశాలలో బాలిక చదువుతోంది. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చే క్రమంలో బస్సు దిగి వేగంగా రోడ్డు క్రాస్ చేస్తుండగా పాఠశాల బస్సు కిందే పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.