Visakhapatnam

News March 10, 2026

విశాఖలో నేడు అంతర్జాతీయ నీటి భద్రతా సదస్సు

image

విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ (VER) నీటి భద్రత ప్రణాళికపై మంగళవారం నోవాటెల్ హోటల్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో సింగపూర్, ఆస్ట్రేలియా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. పెరుగుతున్న నీటి అవసరాలు, వనరుల సమర్థ వినియోగం, అంతర్జాతీయ నిర్వహణ పద్ధతులపై నిపుణులు చర్చించనున్నారని అధికారులు పేర్కొన్నారు.

News March 9, 2026

విశాఖలో బ్యాడ్మింటన్ ఆడేవారికి గుడ్ న్యూస్

image

విశాఖపట్నం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ మెంబర్‌షిప్ కోసం జీవీఎంసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 6 అంతర్జాతీయ స్థాయి కోర్టులతో కూడిన ఈ స్టేడియంలో 12 ఏళ్ల లోపు పిల్లలకు ఏడాదికి ₹2,600, పెద్దలకు ₹15,000 ఫీజుగా నిర్ణయించారు. ఉదయం 5 నుండి 10 వరకు, సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు ఆడేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

News March 9, 2026

విశాఖ: హిందుజా పవర్ ప్లాంట్‌కు భారీ జరిమాన

image

విశాఖలో హిందుజా పవర్ ప్లాంట్‌పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకుంది. ప్లాంట్ నుంచి వచ్చే యాష్పాండ్ ధూళి వలన స్థానిక ప్రజలు చర్మవ్యాధులు బారిన పడుతున్నారని టీడీపీ కార్పొరేటర్ రౌత్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హిందుజా పవర్ ప్లాంట్‌కు రూ.6 కోట్ల 78 లక్షలు జరిమానా విధించింది.

News March 9, 2026

విశాఖ భీమిలి బీచ్ రోడ్‌లో విరాగో రిసార్ట్ సీజ్..!

image

భీమిలి బీచ్ రోడ్డులో విరాగో రిసార్ట్‌ను సోమవారం అధికారులు సీజ్ చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులతో అధికారులు రిసార్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

News March 9, 2026

విశాఖ నుంచి మళ్లీ క్రూయిజ్ సేవలు

image

విశాఖ క్రూయిజ్ టెర్మినల్ నుంచి మళ్లీ క్రూయిజ్ సేవలు ప్రారంభం కానున్నాయి. కార్డిలియా క్రూయిజ్ షిప్ జూన్ 24న విశాఖకు చేరుకొని పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు ఐదు రోజుల సముద్ర విహార యాత్ర నిర్వహించనుంది. జులై 1, 8, 15 తేదీల్లో కూడా సేవలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నౌకలో ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, థియేటర్, స్విమ్మింగ్ పూల్స్, వినోద కార్యక్రమాలు వంటి సౌకర్యాలు ఉంటాయి.

News March 9, 2026

విశాఖ: విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News March 8, 2026

విశాఖ ఏయూ అంబేడ్కర్ చైర్ ‘AgriAI’ పరికరం

image

విశాఖ ఏయూ అంబేద్కర్ చైర్ రూపొందించిన ‘AgriAI’ అనే వినూత్న పరికరాన్ని డైరెక్టర్ మనోజ్ తివారీ ప్రారంభించారు. ఇది IoT, AI సాంకేతికతతో పంటలను ఆశించే పురుగులను గుర్తించి, పంట స్థితిగతులను ఫొటోలతో సహా రైతులకు విశ్లేషిస్తుంది. LLM ఇంటిగ్రేషన్‌తో పనిచేసే ఈ పరికరం వ్యవసాయ క్షేత్రాల్లో విజయవంతంగా పరీక్షించబడింది, ఇది రైతులకు చీడపీడల నివారణలో ఎంతగానో తోడ్పడనుంది.

News March 8, 2026

BREAKING: విశాఖలో ఐటీ దాడుల కలకలం

image

విశాఖలోని మధురవాడ, అక్కయ్యపాలెం సహా నాలుగు ప్రాంతాల్లోని ‘సెలబ్రేషన్స్ హోటల్’ శాఖలపై ఆదివారం ఐటీ అధికారులు దాడులు చేశారు. జీఎస్టీ రిటర్న్స్‌లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో కంప్యూటర్ డేటా, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన ఇతర హోటల్ యజమానులు తమ రికార్డులను సరిచూసుకుంటున్నారు.

News March 8, 2026

‘రేపు కలెక్టరేట్‌లో PGRS, రెవెన్యూ క్లినిక్’

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై పూర్తి వివరాలతో కూడిన అర్జీలను సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. మధ్యాహ్నం వరకు సాగే ఈ వేదికను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News March 8, 2026

రేపు సీపీ ఆధ్వర్యంలో ‘PGRS’

image

విశాఖ నగర ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు పోలీస్ కమిషనరేట్‌లో PGRS కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.