India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో సోమవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయసంక్షేమ శాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ హరీంద్రప్రసాద్ పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు, సంస్కరణలు, చేపట్టబోయే ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్త వీధిలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. కొత్తవీధి శివారు జంక్షన్లో ఓ వ్యక్తిని హత్య చేశారు. సర్వసిద్ధి నాగేశ్వరరావు అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు పాల్పడినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో డిఎస్పీ మోహన్, టౌన్ సీఐ గోవిందరావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
కొయ్యూరు మండలం రేవళ్లు పంచాయతీ కంఠారం శివారు బంధమామిళ్ల గ్రామానికి చెందిన వడగం సత్తిబాబు అనే రైతుకు చెందిన పొలంలో చిన్న సైజు శివలింగం బయట పడింది. ఆదివారం రైతు పొలంలో పనులు చేస్తున్న సమయంలో ఈ శివలింగం బయట పడిందని స్థానికులు చెబుతున్నారు. అసలే కార్తీక మాసం, శివలింగం ప్రత్యక్షం కావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
విశాఖలో ఇందిరా గాంధీ జూపార్క్ సందర్శకులతో ఆదివారం కిటకిటలాడింది. కార్తీక మాసం కావడంతో వనయాత్రలకు పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. ఆదివారం ఒక్కరోజే 10,006 మంది పర్యాటకులు పార్క్‌ను సందర్శించారు. ఈ ఒక్కరోజు రూ.7,75,530 ఆదాయం వచ్చినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు.
పరవాడ ఎస్ఐ ఎం. రామారావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు డీఐజీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల క్రితం నాతవరం నుంచి రామారావు బదిలీపై పరవాడ వచ్చారు. నాతవరం ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో ఓ సివిల్ తగాదాలలో తలదూర్చిన కారణంగా రామారావు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సివిల్ తగాదాకు సంబంధించి ఓ మహిళ డీఐజీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ నిర్వహించి సస్పెండ్ చేశారు.
సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట మోసం చేశారంటూ వైఎస్.జగన్ అన్నారు. ఈ వీడియోను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి తన ‘x’ అంకౌంట్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ పోస్టపై ‘@ncbn నీకు దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్. చేతకాకుంటే పదవి నుంచి తప్పుకో. అంతేకానీ ప్రశ్నించే వాళ్లను జైలులో పెట్టి హీరోనని ఫీల్ అయిపోతే ఎలా?’ అంటూ రాసుకొచ్చారు.
గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాంధ్రలో 8 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో విశాఖ పోలీస్ రేంజ్ కార్యాలయంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి సమావేశం నిర్వహించారు. గంజాయి సాగుకు ఆర్థికంగా మద్దతిస్తున్న వ్యాపారులపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
గిరిజన విద్యార్థులు ఐఏఎస్ అధికారులుగా ఎదగాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. శనివారం పాడేరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో లోచలపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, తలారిసింగి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులతో కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారని, వారికి సహాయకారిగా ఉండాలని సూచించారు.
సీతమ్మధార ప్రాంతంలో ఆక్రమణదారుల ఆధీనంలో ఉన్న రూ.65 కోట్ల విలువ గల 10 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానం అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ 10 ఎకరాల భూమితో పాటు మరో 4,460 చదరపు గజాల భూమికి సంబంధించి ఆక్రమణదారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఈఓ త్రినాథరావు, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి దేవస్థానానికి చెందిన భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ RRR, విశాఖ MLAకి మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతుండగా టైం అయిపోందని RRR బెల్ కొట్టారు. ‘మీరు అప్పుడే బెల్ కొడితే ఎలా అధ్యక్షా. గంట పర్మిషన్ తీసుకున్నా’ అని MLA చెప్పగా.. ‘అందరికీ కలిపి ఒక గంట సమయం ఇచ్చారు. మీకు ఒక్కరికే కాదు. ఇంకా 25 మంది మాట్లాడాలి. త్వరగా ముగించండి’ అంటూ మరికాస్త సమయం ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.