Visakhapatnam

News August 3, 2024

విశాఖ: ముడిచమురు హ్యాండ్లింగ్‌లో రికార్డు సాధించిన పోర్టు

image

ముడిచమురు హ్యాండ్లింగ్‌లో విశాఖ పోర్టు రికార్డు సాధించింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ముడిచమురు నిర్వహణలో అద్భుతమైన ఫలితాలు రాబట్టింది. పోర్టు చరిత్రలో అత్యధికంగా ముడిచమురు నిర్వహించినట్లు ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. మలేషియాకు చెందిన ఎంటీ ఈగల్ వ్యాలరీ క్రూడ్ ఆయిల్ షిప్ నుంచి 1,60,000 టన్నుల ఆయిల్‌ను హ్యాండ్లింగ్ చేసి తన రికార్డ్‌ను తనే అధిగమించినట్లు ఛైర్మన్ తెలిపారు.

News August 2, 2024

విశాఖ: నెలకు నాలుగు సెలవులు ఇవ్వాలి విజ్ఞప్తి

image

ఆరోగ్య భద్రత కల్పించాలని హోంగార్డులు విజ్ఞప్తి చేశారు. విశాఖ నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో హోం కార్డుల సమస్యలపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ దర్బార్ నిర్వహించారు. హోమ్ గార్డ్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేయమని వారు విజ్ఞప్తి చేశారు. నెలకు ఉన్న రెండు సెలవులను నాలుగుకు పెంచాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. హోంగార్ల పిల్లలకు ఫీజు రాయితీ సౌకర్యం కల్పించాలని కోరారు.

News August 2, 2024

మాజీ సీఎంతో ఉమ్మడి విశాఖ నేతలు భేటి

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పాడేరు మాజీ ఎమ్మెల్యే కే.భాగ్యలక్ష్మిలతో కలిసి జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు.విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు.

News August 2, 2024

భూకబ్జాలపై 4న మదనపల్లెలో సదస్సు: సీపీఐ

image

వైసీపీ నాయకుల భూకబ్జాలపై 4న మదనపల్లెలో సదస్సు నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ తెలిపారు. విశాఖలో గురువారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో ఆయన తాజారాజకీయ పరిస్థితులను వివరించారు. మదనపల్లిలో ఏకంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే రెవెన్యూ రికార్డులను తగలబెట్టారని, దీనికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని సాకులు చెప్తున్నారని అన్నారు.

News August 2, 2024

హైగ్రీవా భూముల వ్యవహారంలో ఎంవీవీకి షాక్

image

హైగ్రీవా భూ వ్యవహారంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ నేత గంజి వెంకటేశ్వరావుకు షాక్ తగిలింది. ఈ భూ వ్యవహారంలో అక్రమ మైనింగ్‌పై జిల్లా భూగర్భ గనుల శాఖ చర్యలు తీసుకుంది. ఎండాడలోని భూమిని భూగర్భగనుల శాఖ అనుమతి లేకుండా వినియోగించారని నిర్ధారించింది. హైగ్రీవాకు రూ.5,43,39,437 జరిమానా విధించింది. నోటీసు అందుకున్న 15 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

News August 2, 2024

ఏపీకి ప్రత్యేక డైరెక్టర్‌ను నియమించాలి: విశాఖ ఎంపీ

image

ఏపీకి ఎంఎస్ఎంఈ ప్రత్యేక డైరెక్టర్‌ను నియమించాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి జితన్ రామ్ మాంఝీను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీ కార్యకలాపాలను ఒక్క డైరెక్టర్‌ మాత్రమే పర్యవేక్షిస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. గాజువాకలో ఉన్న ఎంఎస్ఎంఈ భవనాన్ని త్వరగా ప్రారంభించాలని కోరారు.

News August 2, 2024

విశాఖ: ఇన్‌స్టాలో రీల్‌తో బంధువుల చెంతకు

image

మతిస్థిమితం కోల్పోయిన రమేశ్ అనే వ్యక్తికి GVMC షెల్టర్ మేనేజర్ మమత మానసిక చికిత్స అందించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 4 నెలల కిందట గాజువాక వద్ద మతిస్థిమితం కోల్పోయి ఫుట్‌పాత్‌పై తిరుగుతున్న యువకుడిని మమత బుచ్చిరాజుపాలెం GVMC షెల్టర్ లో చేర్పించి మానసిక చికిత్స అందించారు. రమేశ్ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన బంధువులు రమేశ్‌ను గుర్తించి తీసుకెళ్లారు.

News August 2, 2024

విశాఖ నేతలను కాదని..!

image

విశాఖ స్థానిక సంస్థల MLC వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను జగన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడితో పాటు సీనియర్ నేత కోలా గురువులు తదితరుల పేర్లు మొదటి నుంచి బలంగా వినిపించాయి. అనూహ్యంగా విశాఖ నేతలను కాదని విజయనగరం నేతకు ఆ అవకాశం దక్కడంతో అందరూ ఖంగు తిన్నారు. అప్పట్లో బొత్స సతీమణి ఝాన్సీకి సైతం విశాఖ ఎంపీగా జగన్ అవకాశం ఇవ్వడం గమనార్హం.

News August 2, 2024

భారీ వర్షాల కారణంగా దంతేవాడ వరకే కిరండూల్ రైలు

image

భారీ వర్షాల కారణంగా విశాఖ-కిరండూల్ మధ్య నడిచే పలురైళ్లు గమ్యాలు కుదిస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈనెల 1 నుంచి 7 వరకు విశాఖ-కిరండూల్(08551) పాసింజర్ స్పెషల్, విశాఖ-కిరండూల్ (18514) ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఈనెల 2 నుంచి 8 వరకు కిరండూల్-విశాఖ (08552) పాసింజర్ స్పెషల్, కిరండూల్-విశాఖ (18513) ఎక్స్‌ప్రెస్ దంతెవాడ వరకు నడవనున్నట్లు తెలిపారు.

News August 2, 2024

విశాఖ: కానిస్టేబుల్ మీద దాడి చేసిన వ్యక్తిపై రౌడీషీట్

image

ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 29వ తేదీ రాత్రి పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసిన కె.వినయ్ పై రౌడీషీట్ తెరిచినట్లు సీఐ సంజీవరావు తెలిపారు. ఇప్పటివరకు వినయ్ పై 9 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. దాడి చేసిన తర్వాత పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. అతడిని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.