Visakhapatnam

News July 31, 2024

విశాఖ కార్పొరేటర్లకు జగన్ నుంచి పిలుపు

image

జీవీఎంసీలోని స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో విశాఖ కార్పొరేటర్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి పిలుపు అందింది. ఆగస్టు 7న స్థాయీ సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసేందుకే జగన్ పిలిచారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు నగరంలోని స్వర్ణభారతి స్టేడియం నుంచి రెండు బస్సుల్లో సుమారు 40 మంది కార్పొరేటర్లు తాడేపల్లిలోని జగన్ నివాసానికి బుధవారం సాయంత్రం బయల్దేరి వెళ్లారు.

News July 31, 2024

విశాఖ రైల్వే జోన్‌కు భూమిని కేటాయించాం: చంద్రబాబు

image

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన భూమిని కేంద్రానికి అప్పగించామని సీఎం చంద్రబాబు తెలియజేసినట్లు రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం అమరావతిలో చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో కలిశామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయాలని కోరామన్నారు. నిర్వాసితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని సూచించామన్నారు.

News July 31, 2024

అభివృద్ధి వైపు పయనిస్తున్న ఏపీ: అనకాపల్లి ఎంపీ

image

ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. రాష్ట్రంలో ఐదు గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు భారత్ మాల ప్రాజెక్టు కింద నిర్మిస్తున్నట్లు X ద్వారా పేర్కొన్నారు. నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లలో హైదరాబాద్-విశాఖ కారిడార్, బెంగళూరు చెన్నై ఎక్స్ ప్రెస్ వే, రాయపూర్-విశాఖపట్నం కారిడార్, చిత్తూరు- థాచూర్ కారిడార్, బెంగళూరు- కడప-విజయవాడ కారిడార్ ఉన్నాయన్నారు.

News July 31, 2024

స్థాయి సంఘం నామినేషన్లు అన్నీ సక్రమమే: కమిషనర్

image

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలకు దాఖలైన 20 మంది అభ్యర్థుల నామినేషన్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని జివిఎంసి కమిషనర్ పి.సంపత్ కుమార్ తెలియజేశారు. బుధవారం స్థాయి సంఘం ఎన్నికలకు దాఖలైన అభ్యర్థుల నామినేషన్లను అన్నిటినీ పరిశీలించగా అన్నీ సక్రమంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉందని అన్నారు. 10 పదవులకు 24 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.

News July 31, 2024

కవలలకు జన్మనిచ్చి బాలింత మృతి

image

అల్లూరి జిల్లాలో ఆరు రోజుల బాలింత మృతి చెందింది. ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. డుంబ్రిగుడ మండలం గంగుడుకి చెందిన సొయిత శుక్రవారం అరకులోయ ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురైంది. అరగంట తర్వాత సిబ్బంది వచ్చి సీపీఆర్ చేయగా, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి మృతి చెందింది. దీంతో ఆసుపత్రి బయట ఆమె బంధువులు ఆందోళన చేస్తున్నారు. కవలలు ఆరోగ్యంతో ఉన్నారు.

News July 31, 2024

విశాఖ నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సు సర్వీసు

image

విశాఖ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి ప్రత్యేక బస్సు సర్వీసును నడపడానికి ఏపీ పర్యాటక సంస్థ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. ఆగస్టు 10న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖలో ఈ బస్సు బయలుదేరుతుంది. 11 ఉదయాన్నే తిరుపతి చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్తారు. తిరుచానూరు, శ్రీకాళహస్తి దర్శనం అనంతరం విశాఖకు బయలుదేరుతుంది. పెద్దలకు రూ.6,300, పిల్లలకు రూ.6,000 చెల్లించాలి.

News July 31, 2024

విశాఖ: రైళ్లు రద్దు వివరాలకోసం కోసం హెల్ప్ లైన్

image

చక్రధర్ పూర్ డివిజన్‌లో ముంబయి (12810) ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. దీంతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు ప్రకటించారు. రైళ్లతో పాటు, ఇతర సమాచారం ప్రయాణికులకు చేరవేసేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమాచారం కోసం 0801-2746330, 0891-2744619 సంప్రదించాలన్నారు.

News July 31, 2024

విశాఖ: పదవీ విరమణ పొందిన నావికులకు ఘనంగా వీడ్కోలు

image

విశాఖ కేంద్రంగా గల తూర్పు నావికాదళం ఐఎన్‌ఎస్ డేగాలో పదవి విరమణ పొందిన 63 మంది నావికులు వారి కుటుంబాలకు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలుకుతూ అభినందన సభ ఏర్పాటు చేశారు. పదవి విరమణ పొందిన నావికులు సేవలను పలువురు ప్రసంశించారు. ధైర్యం, సాహసాలను ప్రదర్శిస్తూ విధులు నిర్వర్తించిన వీరిని ఆదర్శంగా తీసుకోవాలని అధికారులు సూచించారు.

News July 31, 2024

సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లతా: పల్లా

image

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం విశాఖ అక్రిడేటెడ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు జనార్ధన్ అధ్యక్షుడు, అధ్యక్షుడు రవికాంత్ పాల్గొన్నారు.

News July 31, 2024

విశాఖ: ‘మొదటి తప్పుగా రూ.10వేలు జరిమానా’

image

స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తప్పవని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు హెచ్చరించారు. ప్రైవేట్ వైద్యులు, స్కానింగ్ సెంటర్ల యజమానులకు లింగ నిర్ధారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ జిల్లా సివిల్ జడ్జ్ వెంకట శేషమ్మ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ చేస్తే మొదటి తప్పుగా రూ.10వేలు జరిమానా విధించడం జరుగుతుందన్నారు.