India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. వాయవ్య దిశగా పయనిస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫానుగా మారనుందని పేర్కొన్నారు. ఈ తుఫానుకు ‘దానా’ అని నామకరణం చేశారు. ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో శివాజీ పాలెంలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులకు ముందుగా సమాచారం అందింది. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఇద్దరు మహిళలు, ఇద్దరు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ఎంవిపి పోలీస్ స్టేషన్‌కు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం విశాఖ రానున్నారు. ఉదయం 9.30గంటలకు విమానాశ్రయానికి చేరుకుని, ఇక్కడి నుంచి 9.35 గంటలకు రోడ్డు మార్గంలో విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి బయలుదేరి వెళతారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి సాయంత్రం 4.10గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి 4.15గంటల విమానంలో విజయవాడ బయలుదేరి వెళతారు.
విశాఖ-రాయ్‌పూర్ (08528) పాసింజర్ సమయాల్లో మార్పు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైలు తెల్లవారుజామున 4.25 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి, రాత్రి 7.45 గంటలకు రాయ్ పూర్ చేరుకుంటుందన్నారు. గతంలో ఈ రైలు ఉదయం 6.30 గంటలకు బయల్దేరేదని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు.
దివంగత తులసిరావు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఉద్యోగుల పిల్లల పేరిట డిపాజిట్ చేసిన రూ.25 కోట్ల సొమ్మును ప్రస్తుత ఛైర్మన్ ఆడారి ఆనంద్ కాజేసినట్లు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ద్వారక నగర్ పౌర గ్రంథాలయంలో ఆదివారం మాట్లాడుతూ డెయిరీ యాజమాన్యం ఉద్యోగులపై వివక్ష చూపుతున్నట్లు విమర్శించారు. ఛైర్మన్ బంధువైన ఉద్యోగినికి రూ. లక్ష వేతనం చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం ఈనెల 23న జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖకు అధికారులు పంపారు. వీసీ నియామకానికి సంబంధించి ఏయు నామిని పేరును ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. దీంతో పాటు తాత్కాలికంగా ఆచార్యుల నియామకం, ప్రయోగశాల ఏర్పాటు, రెండు డిగ్రీల విధానం, పలు విభాగాలకు అవసరమైన కంప్యూటర్లు కొనుగోలు చేయడం, కంప్యూటరీకరణ దీనిలో చర్చించే అవకాశం ఉంది.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం నేషనల్ మజ్దార్ యూనిటీ అసోసియేషన్ జిల్లా కమిటీతో విశాఖ జిల్లా నూతన డీపిటిఓ ఎ.అప్పలనాయుడుతో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఎన్ఎంయూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చర్చల అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పీవీ. రమణారెడ్డి నిమ్మరసం ఇచ్చి గత 45 రోజులుగా జరుగుతున్న నిరాహారదీక్షలను నేటితో విరమింపజేశారు.
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గుర్లలో సోమవారం పర్యటించనున్నారు. విశాఖ విమానాశ్రయానికి రేపు ఉ.9:30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11 గంటలకు ఎస్ఎస్ఆర్ పేట వాటర్ సోర్స్ వద్దకు చేరుకొని తనిఖీ చేయనున్నారు. 11:30 గంటలకు గుర్ల పీహెచ్సీని సందర్శిస్తారు. 12:00 గంటలకు గుర్ల నుంచి బయలుదేరి విజయనగరం చేరుకుని కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తారు. తిరిగి సా.4గంటలకు విశాఖ చేరుకుంటారు.
ఆధునిక తెలుగు పాటలో గద్దర్ కు ఓ ప్రత్యేక స్థానం ఉందని ఆయన కుమార్తె వెన్నెల అన్నారు. ఆదివారం సాయంత్రం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన గద్దరన్న యాది కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గద్దర్ తన పాటలతో ప్రభుత్వాలనే గడగడ లాడించారని అన్నారు. సామాన్య మధ్యతరగతి వర్గాల వారి కోసం ఆయన అనేక పాటలను రచించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాటలతో సందడి చేశారు.
ఆకాశంలో అందాలు అబ్బురపరిచాయి. ఆదివారం రోజంతా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజానీకానికి సాయంత్రం ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సాయంత్రం సూర్యాస్తమయం వేళ ఆకాశంలో మేఘాలు అబ్బురపరిచాయి. విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో సాయంత్రం ఆకాశంలో ఏర్పడిన అద్భుతమైన దృశ్యాలు ఆహ్లాదపరిచాయి. ఈ అందాలను పలువురు తమ సెల్ ఫోన్‌లో బంధించారు.
Sorry, no posts matched your criteria.