India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ద్విచక్ర వాహనదారులు, వెనుక కూర్చున్న వ్యక్తులు హెల్మెట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేయడం జరిగిందని ఉప రవాణా కమిషనర్ ఆదినారాయణ తెలిపారు. అక్టోబర్ 12 నుంచి 19వ తేదీ వరకు విశాఖలో 5,728 మందిపై కేసులు నమోదు చేసి వాటిలో 5,300 మంది డ్రైవింగ్ లైసెన్సులు 3 నెలలు పాటు సస్పెండ్ చేశామన్నారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని కావున వాహనదారులు నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ కోర్సు పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. జులై నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం నవంబర్ ఒకటో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
వాతావరణ శాఖ భారీ వర్షాలకు సంబంధించి హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో MRO ఆఫీసుల్లో ఈనెల 19 నుంచి 24 వరకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నంబర్లను ఆయన తెలిపారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు (0891-2590100, 0891-2590102) కు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయవచ్చునన్నారు.
విశాఖ నగరంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు మరో ఇద్దరు ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ కేంద్రంగా వైసీపీ నాయకులు విచ్చలవిడిగా దోపిడీ, అవినీతి, భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై పూర్తి సమాచారం కేంద్రం వద్ద ఉందన్నారు. దోచుకున్న అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ జిల్లా కోఆర్డినేటర్‌గా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగిస్తూ పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలో విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డి సేవలందించిన విషయం తెలిసిందే.
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి జి.ఆనంద్‌ని శుక్రవారం తీర్పు ఇచ్చారు. నిందితుడు ఏ.పోచన్న కూర్మన్నపాలెం పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేవాడు. పాఠశాలలో చదువుతున్న బాలిక (9) 2023 ఏప్రిల్ 1న వాష్ రూమ్ వద్దకు రావడంతో నిందితుడు లైంగికదాడికి ప్రయత్నించాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసిన మహిళా అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను deovsp.netలో పొందుపరిచారు. మెరిట్ లిస్ట్‌లో ఉన్న మొదటి 5 అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీతో శనివారం ఉదయం 10 గంటలకు విశాఖ సమగ్ర శిక్షా కార్యాలయానికి హాజరు కావాలని DEO ఎల్.చంద్రకళ సూచించారు.
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖ బార్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. వారికి ఆరోగ్య భద్రతతో పాటు ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తామన్నారు. టీడీపీకి చెందిన నాయకులందరం చట్టాన్ని గౌరవిస్తామన్నారు.
ఆకాశంలో అందాలు అబ్బురపరిచాయి. శుక్రవారం బుచ్చియ్యపేట మండలంలోని వడ్డాదిలో చిరుజల్లులు పడ్డాయి. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశంలో వాతావరణం ఎర్ర తివాచీలా మారింది. పౌర్ణమి రాత్రులు కావడంతో ఆకాశంలో చందమామ నిండు చంద్రుడులా దర్శనమిచ్చాడు. ఈ అద్భుతమైన దృశ్యాలు ఆహ్లాద పరిచాయి. ఈ అందాలను పలువురు తమ సెల్ ఫోన్‌లో బంధించారు.
ఇప్పటికైనా సాక్షి దినపత్రిక తన వైఖరిని మార్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హితువు పలికారు. విశాఖ కోర్టులో హాజరైన అనంతరం మాట్లాడుతూ.. తప్పుడు రాతలు రాస్తూ దుష్ప్రచారం చేస్తే ప్రభుత్వం, టీడీపీ, పార్టీ నాయకులు వదిలిపెట్టరని హెచ్చరించారు. 2019-2024 వరకు ఆ పత్రిక రాసిన అనేక అవాస్తవాలు, తప్పుడు రాతలను రుజువు చేయలేకపోయిందని అన్నారు.అందుకనే వైసీపీని ప్రజలు తిరస్కరించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.