India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మిలాన్, ఐఎఫ్ఆర్ వంటి ప్రతిష్టాత్మక సదస్సుల నేపథ్యంలో సీపీ శంఖబ్రత బాగ్చి హోటల్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. హోటళ్లలో DFMD, HHMD తనిఖీలు, CCTV నిఘా పెంచాలని ఆదేశించారు. అతిథుల ఐడీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సిబ్బంది వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. VVIPల భద్రతలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు

ఏపీలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. విశాఖ జిల్లాలో 475 స్కూల్స్ నుంచి 29,238 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని DEO ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. 133 సెంటర్లను ఏర్పాటు చేయగా.. ఒకసారి ఫెయిల్ అయిన 1305 విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. టెన్త్ మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం కావడంతో అందులో తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చని, FEB-12 లోగా HMలను సంప్రదించాలన్నారు.

చెత్తాచెదారం బహిరంగ ప్రదేశాల్లో 12వ తేదీన వెయ్యవద్దని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఓ ప్రకటనలో కోరారు. దేశవ్యాప్త కార్మికుల సమ్మె 12వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు గురువారం తగ్గే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు చెత్తచెదారం బహిరంగ ప్రదర్శనలో వేయడం మానేసి 13వ తేదీన మీ ఇంటికి వచ్చే క్లాప్ వాహనాలకు పారిశుధ్య సిబ్బందికి అందించాలని విడుదల చేసిన ప్రకటనలో కమిషనర్ పేర్కొన్నారు.

విశాఖ దేశ ఇంధన భద్రతకు కీలక వ్యూహాత్మక కేంద్రంగా ఎదిగింది. భారత్ పెట్రోలియం నిల్వలను విశాఖ, మంగళూరు, పడూర్ ప్రాంతాల్లో భూగర్భ గుహల్లో ఏర్పాటు చేసింది. ఈ నిల్వలు రిఫైనరీల స్టాక్‌తో కలిపి దేశ అవసరాలను 74 రోజులు తీర్చగలవని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంట్‌లో చెప్పారు. తూర్పు తీరంలో విశాఖ నిల్వ సదుపాయం ఇంధన సరఫరా స్థిరత్వానికి బలోపేతం చేస్తూ జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది.

మిలాన్, ఐ.ఎఫ్.ఆర్ వేడుకల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అన్ని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అంతర్జాతీయ ప్రతినిధుల రాక దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరాన్ని హై అలర్ట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ డీసీపీలకు జోన్లు వారిగా విధులు కేటాయిస్తూ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు.
➣టి.జి.రామ్మోహన్‌కు పెందుర్తి, వెస్ట్ జోన్
➣కె.హరిదాస్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్
➣సిహెచ్.మధుసూదన్ రావు గాజువాక, అగనంపూడి, అనకాపల్లి జోన్
➣కే.వెంకటేశ్వరరావుకు భీమిలి, మధురవాడ జోన్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ డీసీపీలకు జోన్లు వారిగా విధులు కేటాయిస్తూ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు.
➣టి.జి.రామ్మోహన్‌కు పెందుర్తి, వెస్ట్ జోన్
➣కె.హరిదాస్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్
➣సిహెచ్.మధుసూదన్ రావు గాజువాక, అగనంపూడి, అనకాపల్లి జోన్
➣కే.వెంకటేశ్వరరావుకు భీమిలి, మధురవాడ జోన్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

విదేశాల్లో భారీ జీతంతో ఉద్యోగం అంటూ చైనా స్కామ్ కంపెనీలకు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన ఒక వ్యక్తికి టెలిగ్రామ్ ద్వారా మయాన్మార్‌లో జాబ్ అని సైబర్ స్కాం కంపనీలో పనిచేయిస్తున్నారు. విశాఖ నుంచి యువకులు వెళ్లి మోసపోయి తిరిగి ఇండియన్ ఎంబసీ ద్వారా విశాఖ వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ చేసి కృష్ణ జిల్లాకు చెందిన పిల్లి అవినాష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం సాయం, కార్మికుల శ్రమ వల్లే ఇది సాధ్యమైందని, ప్రస్తుతం ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడుస్తోందని ఆయన వివరించారు. భవిష్యత్తులోనూ ఆర్ఐఎన్ఎల్ (RINL)కు ఇదే విధమైన మద్దతును అందించాలని కేంద్రాన్ని సీఎం కోరారు.

GVMCలో 64 పంచాయతీల విలీన ప్రతిపాదనపై పంచాయతీరాజ్ శాఖ దగ్గర ప్రక్రియ ముందుకు సాగడం లేదు. విలీనానికి ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల పరిశీలన, వార్డుల విభజన, ఓటర్ల జాబితా వంటి దశలు పూర్తికావాలి. మార్చి 17తో పాలక మండలి గడువు ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌పై అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరి 1 అర్హత ఆధారంగా వార్డుల వారిగా ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయాలని ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.