Visakhapatnam

News January 21, 2026

జీవీఎంసీ సేవలకు సహకరించండి: కమిషనర్

image

​విశాఖ నగర అభివృద్ధి, స్వచ్ఛ సర్వేక్షన్‌-2025లో ఉత్తమ ర్యాంకు సాధనకు నివాసిత సంక్షేమ సంఘాలు (RWAs) సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. బుధవారం జరిగిన సమావేశంలో సంఘాల ప్రతినిధులు రోడ్లు, డ్రైనేజీ, పార్కుల సమస్యలను ప్రస్తావించారు. సమస్యల తక్షణ పరిష్కారానికి ‘పురమిత్ర’ యాప్ టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలన్నారు. కాలనీల్లోని పార్కుల నిర్వహణ బాధ్యతను సంఘాలే తీసుకోవాలని సూచించారు.

News January 21, 2026

గోపాలపట్నం రైల్వే ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య

image

గోపాలపట్నం రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కొత్తపాలెం-గోపాలపట్నం రైల్వే క్యాబిన్ వద్ద బాడీ పట్టాలపై ఉండడానికి గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గోపాలపట్నం పోలీసులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడు గోపాలపట్నం లోని మెడికల్ షాప్ నిర్వహిస్తున్న సాయి కృష్ణ‌గా స్థానికులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2026

మాతృ మరణాల నివారణకు పకడ్బందీ చర్యలు: DMHO

image

విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు ఆధ్వర్యంలో మాతృ మరణాలపై సమావేశం జరిగింది. మూడు నెలల్లో నమోదైన మాతృ మరణాలపై ఆయన చర్చించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి, మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్, వీజీహెచ్‌కు పంపాలని, సురక్షిత ప్రసవాలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

News January 21, 2026

విశాఖలో DSPCA సమావేశం

image

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి అధ్యక్షతన జిల్లా జంతు క్రూరత్వ నివారణ కమిటీ (DSPCA) సమావేశం జరిగింది. వీధి కుక్కల నియంత్రణకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు (ABC), సింహాచలం దేవస్థాన కోడెల సంరక్షణపై సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను జేసీ ఆదేశించారు.

News January 21, 2026

విశాఖ: ‘రోజుకు 300 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి’

image

పేదల గృహ నిర్మాణాల పరిస్థితిపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హౌసింగ్ అధికారులు, జోనల్ కమిషనర్లతో సమీక్ష చేసి ఏఏ ప్రాంతాల్లో నిర్మాణాలు ఏ మేరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకున్నారు. రోజుకు 300 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.

News January 21, 2026

విశాఖ: 15 ఏళ్లు దాటాయా.. లాస్ట్ ఛాన్స్

image

పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా జనన రిజిస్టర్‌లో నమోదు చేసుకోలేదా. రిజిస్ట్రేషన్‌కు నేటితో సమయం ముగియనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీవీఎంసీ పరిధిలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల పేరు జనన రిజిస్టర్‌లో చేసుకునేందుకు జనవరి 21వరకు మాత్రమే అవకాశం ఇచ్చింది. దీని కోసం అన్ని జోనల్ కార్యాలయాల్లోని జనన రిజిస్టర్ అధికారుల వద్ద అవకాశం కల్పించారు. ఒకవేళ చేయించుకోకపొతే వేంటనే చేయించుకోండి.

News January 21, 2026

24 నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌కు 3 ఏసీ బోగీలు

image

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే దురంతో ఎక్సప్రెస్ రైలుకు 3AC మూడేసి అదనంగా జత చేస్తున్నట్లు ప్రకటించారు. (22203/22204) నంబర్లు గల ఈ రైలు 24, 25వ తేదీల నుంచి ప్రయాణికులకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ అదనపు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

News January 21, 2026

స్టీల్ ప్లాంట్‌లో VRSకి గడువు పెంపు

image

స్టీల్ ప్లాంట్లో VRSకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. VRS దరఖాస్తుల గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ప్లాంట్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది DEC 24న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం VRSకి ఈ నెల 20వ తేదీలోగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఉద్యోగుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో గడువును పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 500 దరఖాస్తులు అందినట్లు సమాచారం.

News January 21, 2026

జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ 3.0 ప్రారంభం

image

జీవీఎంసీ మరో ముందడుగు వేసింది. ఆపరేషన్ లంగ్స్-3.0 పేరిట సెల్లార్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా ఝులిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్డ్ మంగళవారం తెలిపారు. చాలా భవనాల్లో సెల్లార్లు వ్యాపార నిలయాలుగా మారడంతో రహదారులపై పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, వెంటనే వీటిని ఆయా యజమానులు తొలగించాలన్నారు. లేదంటే జీవీఎంసీ తొలగిస్తుందని హెచ్చరించారు.

News January 20, 2026

జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ 3.0 ప్రారంభం

image

జీవీఎంసీ మరో ముందడుగు వేసింది. ఆపరేషన్ లంగ్స్-3.0 పేరిట సెల్లార్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా ఝులిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్డ్ మంగళవారం తెలిపారు. చాలా భవనాల్లో సెల్లార్లు వ్యాపార నిలయాలుగా మారడంతో రహదారులపై పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, వెంటనే వీటిని ఆయా యజమానులు తొలగించాలన్నారు. లేదంటే జీవీఎంసీ తొలగిస్తుందని హెచ్చరించారు.