India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ ఉత్సవాలు ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలు సజావుగా, ప్రజలకు ఆకర్షణీయంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఉత్సవాల నిర్వహణ, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, పారిశుద్ధ్యం, విద్యుత్, అగ్నిమాపక, వైద్య సేవలపై సమీక్షించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను నిర్వహించాలన్నారు.

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా భద్రత, గంజాయి రవాణా అడ్డుకట్ట, సైబర్ నేరాల నియంత్రణలో సాంకేతికత వాడకంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నగర DCPలు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 29న విడుదల చేసి భారత్‌కు పంపనున్నట్లు Bangladesh Coast Guard ప్రకటించిందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారు. అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు.

ఖరగ్‌పూర్ ఐఐటీలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను ఏయూకి వీసీగా ప్రభుత్వం నియమించింది. అయితే వీసీ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులను కలుపుకొని ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఈడీ విద్యార్థి మృతి, వీసీని నేరుగా కలవొద్దంటూ సర్క్యులర్లు, తాజాగా ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు మెస్‌లో భోజనం నిలిపివేయడంతో వైఫల్యాలు కనిపిస్తున్నాయి.

గాజువాక జీవీఎంసీ హాల్లో సమీక్ష జరుగుతుండగా కుప్పకూలిపోయిన సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవిందరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం అధికారులు, ప్రజాప్రతినిధులు, జోనల్ కమిషనర్ సమక్షంలో సమావేశం జరుగుతుండగా గోవిందరాజు లేచి మాట్లాడే ప్రయత్నంలో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందు మృతి చెందారు.

ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు ఖల్లీకోట్ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మక హాల్ట్‌ను కల్పిస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి సికింద్రాబాద్-భువనేశ్వర్ (17016), సికింద్రాబాద్-హౌరా (12704) రైళ్లు, అలాగే 27 నుంచి భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015), హౌరా-సికింద్రాబాద్ (12703) రైళ్లు ఖల్లీకోట్ స్టేషన్‌లో ఆగనున్నాయని తెలిపారు.

జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ ఉండగా ఇంజినీరింగ్ విభాగం సెక్షన్ ఇంజినీర్ గోవింద్ రాజు కుప్ప కూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తోటి ఉద్యోగులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విశాఖ నగరపాలక సంస్థకు ఈ నెల 30న సాధారణ కౌన్సిల్ సమావేశం, ఫిబ్రవరి 4న 2026–27 వార్షిక బడ్జెట్‌కు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్‌కు ప్రతిపాదనలు పంపారు. రూ.50 లక్షల పనుల అనుమతులపై ఈ నెల 27న స్థాయి సంఘం సమావేశం జరగనుంది. పాలకవర్గ పదవీకాలం మార్చి 18తో ముగియనుండగా, మార్చి 7 తర్వాత కౌన్సిల్ సమావేశాలకు నిబంధనల ప్రకారం అవకాశం లేదు.

విశాఖపట్నంలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఇమ్మిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కానుంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు విశాఖలోనే అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. హోం మంత్రిత్వ శాఖ విశాఖ నగరంలోని మారిక వల్ల సమీపంలోని ఓజోన్ వ్యాలీ లేఔట్‌లో ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది.

కాంబోడియాకు యువతను విశాఖ నుంచి తరలిస్తున్న ప్రధాన ఏజెంటు బొంగు మురళిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానికంగా భావన ఫ్యాబ్రికేటర్స్ వర్క్ ఏర్పాటు చేసి ఉపాధి పేరుతో యువకులను కాంబోడియా తరలిస్తుండగా గతంలో అరెస్టు చేశారు. మరోసారి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయనపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.