Visakhapatnam

News January 26, 2026

విశాఖ: ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

image

విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి, జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, నేవీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

News January 25, 2026

విశాఖ: గ‌ణతంత్ర‌ దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి

image

పోలీస్ ప‌రేడ్ మైదానంలో సోమ‌వారం నిర్వహించ‌నున్న 77వ గ‌ణతంత్ర‌ దినోత్స‌వ వేడుకుల‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. జెండా వంద‌నం జ‌రిగే మైదానంలో ఆదివారం పైల‌ట్ వాహ‌నానికి ట్ర‌యిల్ ర‌న్ నిర్వ‌హించి సిద్ధం చేశారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల వివ‌రాల‌ను తెలియజేస్తూ స్టాళ్లను, శ‌క‌టాల‌ను సిద్ధం చేశారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాల కింద 13,113 మందికి రూ.809.15 కోట్ల న‌గ‌దు ప్రోత్సాహ‌కాలను అందజేయనున్నారు.

News January 25, 2026

​లడ్డా – జిమిడిపేట మధ్య మూడో రైల్వే లైన్ ప్రారంభం

image

వాల్తేరు డివిజన్‌లోని లడ్డా-జిమిడిపేట స్టేషన్ల మధ్య నూతనంగా నిర్మించిన 7.181 కి.మీ.ల మూడో రైల్వే లైన్‌ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) బ్రిజేశ్ కుమార్ మిశ్రా శనివారం తనిఖీ చేశారు. తిత్లాగఢ్ – విజయనగరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ మార్గంలో స్పీడ్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. భద్రతా ప్రమాణాల పరిశీలన అనంతరం రైళ్ల రాకపోకలకు అనుమతి లభించింది. ఈ కార్యక్రమంలో DRM లలిత్ బోహ్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News January 25, 2026

విశాఖ ఉత్సవ్‌లో నేడు కామాక్షి లైవ్ వయోలిన్ షో

image

సాగరతీరానా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆర్కేబీచ్ రోడ్డులో ప్రముఖ సంగీత వయోలిన్ విద్వాంసురాలు కామాక్షి లైవ్ వయోలిన్ షో నిర్వహించనున్నారు. కామాక్షి ఇండియన్ ఐడల్, పలు మెగా ఈవెంట్స్‌లో ప్రదర్శనలు ఇచ్చారు.

News January 25, 2026

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం PGRS రద్దు

image

విశాఖ సీపీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS జనవరి 26న సోమవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా రద్దు చేసినట్టు సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం తెలిపారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ప్రజలు సమస్యలు ఉంటే 112కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. వచ్చే సోమవారం అనగా ఫిబ్రవరి 2వ తేదీ PGRS యధావిధిగా నిర్వహించనున్నారు.

News January 24, 2026

విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్

image

విశాఖ-టాటానగర్-విశాఖ (20816/15) వీక్లీ ఎక్స్‌ప్రెస్ టెర్మినల్ స్టేషన్‌ను టాటానగర్ నుంచి ఆదిత్యపూర్‌కు మారుస్తూ వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మార్పు మార్చి 29 నుంచి అమలులోకి వస్తుంది. రైలు సమయాల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఆదిత్యపూర్ నుంచి ఉదయం 7.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. ప్రయాణికులు పూర్తి వివరాల కోసం 139 నంబర్‌ను సంప్రదించవచ్చు.

News January 24, 2026

విశాఖలో 392 మందికి నియామక పత్రాల అందజేత

image

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్‌గార్‌ మేళా ప్రవేశపెట్టిందని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ మేళా దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించిందన్నారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం జరిగిన రోజ్‌గార్‌ మేళాలో మంత్రి పాల్గొని 392 మందికి నియామక పత్రాలు అందజేశారు.

News January 24, 2026

​ఈస్ట్ కోస్ట్ రైల్వే సరికొత్త రికార్డు.. రూ.23 వేల కోట్ల ఆదాయం

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23,000 కోట్ల సరుకు రవాణా ఆదాయాన్ని కేవలం 294 రోజుల్లోనే సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 27 రోజులు ముందే కావడం విశేషం. మొత్తం ఆదాయంలో 11.21%, సరుకు రవాణాలో 11.31% వృద్ధిని నమోదు చేస్తూ, భారతీయ రైల్వేలోనే నంబర్ వన్ జోన్‌గా నిలిచింది. ఈ వివరాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారికంగా వెల్లడించింది.

News January 24, 2026

విశాఖ సీపీ కార్యాలయంలో రికవరీ మేళా

image

విశాఖ సీపీ కార్యాలయంలో శనివారం రికవరీ మేళా నిర్వహించారు. డిసెంబర్ నెలలో మొత్తం 77 కేసులలో 44 కేసులు చేధించి 42 మంది దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం రూ.1,07,17,800 స్వాధీనం చేసుకొని వాటి యజమానులకు అందించారు. ఇందులో 294.155 గ్రాముల బంగారం, 301.58 గ్రాముల వెండి, రూ.1,72,500, 15 మోటార్ సైకిల్లు, ఒక ఆటో, 340 మొబైల్ ఫోన్స్, 12 ఆటో బ్యాటరీలు, ఒక బస్సు, 2 మెట్రిక్ టన్నుల కోల్ ఉన్నాయి.

News January 24, 2026

విశాఖ ఉత్సవ్-2026.. నేడు ఆర్కే బీచ్‌లో గాయని సునీత సందడి

image

భారతదేశపు అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్-2026‌లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఆర్కే బీచ్ వేదికగా ప్రముఖ గాయని సునీతతో ‘మ్యూజికల్ నైట్’ జరగనుంది. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘సీ టు స్కై’ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాగర తీరంలో సాగే ఈ సంగీత వేడుకను తిలకించేందుకు నగరవాసులు, పర్యాటకులు తరలిరావాలని నిర్వాహకులు కోరారు.