Visakhapatnam

News January 29, 2026

విశాఖ: 481 మంది అక్రిడిటేష‌న్ల జారీకి క‌మిటీ ఆమోదం

image

విశాఖలో అర్హులైన జ‌ర్న‌లిస్టులు 481మందికి తొలి విడ‌త‌లో అక్రిడిటేష‌న్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేష‌న్ క‌మిటీ ఆమోదం తెలిపింది. క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధ్య‌క్ష‌త‌న‌ క‌లెక్ట‌రేట్లో గురువారం స‌మావేశం జ‌రిగింది. జ‌ర్న‌లిస్టుల అర్హ‌త‌లు, అంశాల‌పై చ‌ర్చించారు. 512 మందికి ప్ర‌తిపాదించ‌గా 481కి కమిటీ ఆమోదం ల‌భించింది. ప్రింట్ 287, ఎల‌క్ట్రానిక్ మీడియా 194 ద‌ర‌ఖాస్తులు అర్హ‌త పొందాయి

News January 29, 2026

గీతం భూముల క్రమబద్ధీకరణపై YSRCP నిరసన

image

గీతం విద్యాసంస్థల పరిధిలోని రూ.5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని YSRCP భారీ నిరసన చేపట్టింది. బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నేతలు గీతం వద్ద స్థలాన్ని పరిశీలించారు. ఈ కుట్రను అడ్డుకుంటామని పేడాడ రమణికుమారి, కే.కే.రాజు, గుడివాడ అమర్నాథ్, వరుదు కళ్యాణి తదితర ముఖ్యనేతలు స్పష్టం చేశారు.

News January 29, 2026

GVMC స్థాయీ సంఘంలో 160 అంశాలకు ఆమోదం

image

విశాఖ మేయర్, స్థాయీ సంఘం ఛైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో 159 ప్రధాన, 13 టేబుల్ అజెండాలతో మొత్తం 172 అంశాలు చర్చించారు. అవినీతికి ఆస్కారం ఉన్న 12 అంశాలను వాయిదా వేసి 160 అంశాలకు ఆమోదం తెలిపారు. విశాఖ భాగస్వామ్యం సదస్సు పనులకు ఆమోదం లభించగా, జీవీఎంసీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు.

News January 29, 2026

ఏయూలో భారీ సంగీత సమ్మేళనం.. ఎప్పుడంటే?

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 31న భారీ సంగీత సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ బుధవారం ఆవిష్కరించారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏయూ ఓపెన్ ఎయిర్ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల కళా నైపుణ్యాన్ని చాటేలా ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు వీసీ పేర్కొన్నారు.

News January 29, 2026

విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

image

విశాఖ విమానశ్రయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా అరకులో నిర్వహించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం హాజరయ్యేందుకు ముందుగానే విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు స్వాగతం పలికారు. బీచ్ తీరంలో ఉన్న హోటల్‌కు ఆయన చేరుకున్నారు.

News January 28, 2026

విశాఖ: 31న పిల్లలకు ఆటల పోటీలు

image

విశాఖ ఉత్సవాల్లో భాగంగా 31న మద్దిలపాలెం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో 6 నెలల నుంచి 10 ఏళ్లలోపు పిల్లలకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. 6-13 నెలల చిన్నారులకు పాకడం, 13 నెలల నుంచి 10 ఏళ్ల పిల్లలకు రన్నింగ్, 2-7 ఏళ్ల వారికి జంపింగ్ పోటీలు ఉంటాయి. అలాగే 4-10 ఏళ్ల వారికి స్కేటింగ్, 3-10 ఏళ్ల పిల్లలకు రింగ్ హోల్డింగ్ పోటీలు నిర్వహిస్తారు. Futureolympians.com వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి.

News January 28, 2026

విశాఖ: స్టేడియంలో ప్రముఖుల సందడి

image

విశాఖ పీఎంపాలెం స్టేడియంలో బుధవారం జరిగిన భారత్-న్యూజిలాండ్ నాలుగో టీ-ట్వంటీ మ్యాచ్‌కు ప్రముఖులు తరలివచ్చారు. సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్ర, కలెక్టర్ విజయ కృష్ణన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మ్యాచ్‌ను వీక్షించారు. వీరికి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీశ్ బాబు ఘనంగా స్వాగతం పలికారు.

News January 28, 2026

దువ్వాడ చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్

image

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూర్మన్నపాలెం శాతవాహన నగర్‌లో గత ఆగస్టులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన వాల్మీకి బండాగర్, సంగయ్య స్వామి, రాధా కిషన్‌లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్. శ్రీనివాసరావు ఇంట్లో ఆగస్టు 2న తలుపులు పగలగొట్టి చొరబడిన దుండగులు, సుమారు 7 తులాల బంగారం, రూ. 2.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు సొత్తును రికవరీ చేశారు.

News January 28, 2026

పెట్టుబడులపై కలెక్టర్ కీలక సమీక్ష

image

విశాఖలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు అనుమతులు వేగవంతం చేయాలని, ఎంఎస్ఎంఈ నానో పార్కుల ఏర్పాటును ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్‌ ద్వారా ఒప్పందాల ప్రగతిని పర్యవేక్షించాలని, ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని సూచించారు.

News January 28, 2026

విశాఖ: ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు

image

విశాఖ-విజయవాడ సెక్షన్‌లో భద్రతా పనుల కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మంగళవారం నుంచి జనవరి 31 వరకు విజయవాడ, తిరుపతి, గుంటూరు మార్గాల్లో నడిచే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులు రైల్వే వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా ముందస్తు సమాచారం తెలుసుకోవాలని అధికారులు సూచించారు. పనులు ముగిసిన తర్వాత సర్వీసులు పునరుద్ధరించనున్నారు.