India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగ్లాదేశ్ నుండి సురక్షితంగా స్వదేశం చేరుకున్న 9 మంది మత్స్యకారులు సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసి, తమను ప్రాణాపాయం నుండి కాపాడినందుకు వారు భావోద్వేగానికి లోనయ్యారు. మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, భవిష్యత్తులో సరిహద్దుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

విశాఖ నుంచి వేటకు వెళ్లిన 9 మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో చొరబడటంతో<<19027027>> 100 రోజులు బందీలుగా<<>> అక్కడ వేదన జీవితాన్ని గడిపారు. సోమవారం విశాఖ చేరుకున్న వీరికి సంఘం పెద్దలు, కుటుంబ సభ్యులు సన్మానించి కన్నీటి పర్యంతం అయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో సుధాసాగర్ వీరికి నిత్యవసర సరకులు అందించారు.

తూర్పు తీరంలో విశాఖ నగరం ప్రముఖ పరిశ్రమ Hubగా మారడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ దోహదపడుతుందని సీఐఐ విశాఖ ప్రతినిధులు జి.కృష్ణ మోహన్, డీవీఎస్ నారాయణ రాజు, సాంబశివరావు అభిప్రాయపడ్డారు. 2047 వరకు డేటా సెంటర్లకు టాక్స్ హాలిడే, బయోఫార్మాకు ప్రోత్సాహం, ఎంఎస్ఎంఈలకు రూ.10,000 కోట్లు కేటాయింపు, ఎకనామిక్-ఫ్లైట్ కారిడార్‌ల అభివృద్ధికి ఈ బడ్జెట్ తోడ్పాటును అందిస్తుందన్నారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గత వారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.

కేంద్ర బడ్జెట్ 2026–27 విశాఖ టూరిజం, హాస్పిటాలిటీ రంగాలకు బలమైన ప్రోత్సాహం ఇచ్చిందని AP హోటల్స్, రెస్టారెంట్స్ అధ్యక్షుడు పవన్ కార్తీక్ తెలిపారు. టూరిజాన్ని ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కోసం కీలక శక్తిగా గుర్తించడం సానుకూల అంశమన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ, టూరిస్ట్ గైడ్‌ల నైపుణ్యాభివృద్ధి, వారసత్వ కేంద్రాల అభివృద్ధి, కొత్త రవాణా ప్రాజెక్టులు భారత టూరిజం రంగాన్ని బలోపేతం చేస్తాయన్నారు.

విశాఖలో భూ విలువల పెంపునకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టు సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి కొత్త భూ విలువలు అమలు చేయాలన్న ప్రతిపాదనలపై రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. వీటిని కమిటీ పరిశీలించి జేసీకు నివేదిక పంపింది. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆ ఫైల్ జేసీ వద్దే నిలిచిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పెంపు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విశాఖ కేజీహెచ్‌లో రాష్ట్రంలోనే మొదటి ‘పెయిన్ క్లినిక్’ను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. AMCANA సంస్థ రూ. కోటి విరాళంతో దీనిని ఏర్పాటు చేసింది. దీర్ఘకాలిక, క్యాన్సర్ నొప్పులతో బాధపడే రోగులకు ఈ క్లినిక్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం నుంచి జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు రెండు విడతల్లో ఫిబ్రవరి 10 వరకు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 35,404 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరవుతున్నట్లు ఆర్జేడీ మురళీదర్ తెలిపారు. ఎంపీసీ విద్యార్థులు 30,433 కాగా, బైపీసీ వారు 4,971 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అధికారులు జిల్లాలో 159 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.