Visakhapatnam

News February 4, 2026

14వ తేదీ నుంచి వేటను నిలిపివేయండి: జేడీ లక్ష్మణరావు

image

విశాఖలో జరగనున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్-2026 వేడుకల నేపథ్యంలో ఫిబ్రవరి 14 నుంచి 21వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. మూలపాలెంలో నిర్వహించిన సదస్సులో మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నేవీ సూచనలు పాటించాలని, బోట్లు సంచరించకుండా సహకరించాలని ఆయన కోరారు. తీర ప్రాంతాల పరిశుభ్రతపై కూడా మత్స్యకారులకు అవగాహన కల్పించారు.

News February 4, 2026

IFR-2026 ఏర్పాట్లపై విశాఖ కలెక్టర్ సమీక్ష

image

విశాఖలో IFR-2026, మిలాన్ వేడుకలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యే ఈవెంట్లకు రాష్ట్రపతి, సీఎం వంటి ప్రముఖులతో పాటు లక్షలాది మంది ప్రజలు రానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీసీ కెమరాలతో నిఘా, నో-డ్రోన్ జోన్ అమల్లో ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు.

News February 4, 2026

విశాఖలో ఊపిరి తీసుకునేదెలా?

image

మహా విశాఖలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఢిల్లీ తరహాలో గాలి నాణ్యత పడిపోవడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. నగరంలో సగటు AQI 234గా నమోదైంది. అయితే నిబంధనలు ఉల్లంఘించిన 7 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. దాదాపు రూ.10 కోట్ల భారీ జరిమానా విధించింది.

News February 4, 2026

విశాఖ: నో పొల్యూషన్ సర్టిఫికెట్.. నో ఫ్యూయల్

image

నగరంలో జగదంబ కూడలి వద్ద ఇవాళ నో పొల్యూషన్.. నో ఫ్యూయల్ అంటూ ప్లకార్డులను ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం నివారణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తాండవ కృష్ణ. సిబ్బంది పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు.

News February 4, 2026

విశాఖ: ఇకపై ఒక్క రోజులోనే..!

image

విశాఖ కేంద్రంగా ఏపీఈపీడీసీఎల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్‌‌ను ప్రారంభించింది. దక్షిణ భారతంలో ఇదే తొలి కేంద్రం. ఇప్పటివరకు నెలరోజులు పట్టే విద్యుత్ కనెక్షన్‌ను ఈ విధానంతో ఇప్పుడు ఒక్కరోజులోనే పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్‌టీ-5 (వ్యవసాయ, ఆక్వా) కనెక్షన్లకు అమలు చేస్తున్నామని ఛైర్మన్ పృధ్వీతేజ్ తెలిపారు. ఇప్పటికే 400కు పైగా కనెక్షన్లు మంజూరయ్యాయన్నారు.

News February 4, 2026

విశాఖ: ఇక ఒక్క రోజులోనే విద్యుత్ కనెక్షన్

విశాఖ: క్యాంపస్ AI షార్ట్ వీడియో పోటీ పోస్టర్ ఆవిష్కరణ

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘క్యాంపస్ AI షార్ట్ వీడియో కాంపిటీషన్’ పోస్టర్‌ను వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మంగళవారం ఆవిష్కరించారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో కృత్రిమ మేధపై అవగాహన, సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యమన్నారు. AI ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. IIC నిర్వహిస్తున్న ఈ పోటీలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొనవచ్చు. ఉత్తమ వీడియోకు ప్రశంసాపత్రం అందజేస్తారు.

News February 3, 2026

రూ.4180 కోట్లతో రేపు వార్షిక జీవీఎంసీ బడ్జెట్

image

జీవీఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం కౌన్సిల్ హాల్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు కాగా, మొత్తం ఆదాయం రూ.4180.37 కోట్లు అంచనా వేశారు. అభివృద్ధి, నిర్వహణకు రూ.4047.12 కోట్ల ఖర్చు ప్రతిపాదించి, ముగింపు నిల్వగా రూ.133.25 కోట్లను నిర్ణయించారు. బడ్జెట్‌లో దేశంలో విశాఖ 10వ స్థానంలో నిలవడం తెలిసిందే.

News February 3, 2026

గాజువాక: సచివాలయ ఉద్యోగిని పట్టుకున్న ఏసీబీ

image

గాజువాకలోని 74వ వార్డులో సచివాలయం అడ్మిన్ కార్యదర్శి రూ.16 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం సాయంత్రం నిఘా పెట్టి ఏసీబీ అధికారులు దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.