Visakhapatnam

News January 31, 2026

విశాఖ: మహిళకి ప్లాస్టిక్ సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్లు

image

KGH వైద్యులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన R.సాయమ్మ (46) అనే మహిళకు సంక్లిష్టమైన ప్లాస్టిక్ సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు. బొబ్బలి సమీపంలో జరిగిన ప్రమాదంలో సాయమ్మ గాయపడి KGHలో చేరారు. ఆమె దవడ, కంటి చుట్టూ ఎముకలు విరగగా, ప్లాస్టిక్ సర్జరీ, కంటి వైద్య నిపుణులు సమన్వయంతో శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లను సూపరింటెండెంట్ డా.ఐ. వాణి అభినందించారు.

News January 31, 2026

‘మరికొన్ని గంటల్లో ముగుస్తున్న విశాఖ ఉత్సవాలు’

image

విశాఖలో జనవరి 24 నుంచి నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. శనివారం సాయంత్రం ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద పలు క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయనున్నారు. ఈ మేరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. ఈరోజు ప్రధాన వేదిక వద్ద సందడి చేసేందుకు ఆర్‌పి పట్నాయక్ బృందంతో విశాఖ చేరుకున్నారు.

News January 31, 2026

ప్రభుత్వ భూములు కట్టబెట్టడం చట్ట విరుద్ధం: CPM

image

గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములు కట్టబెట్టే GVMC తీర్మానం చట్ట విరుద్ధమని, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951కు వ్యతిరేకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఈ వ్యవహారంలో అధికార దుర్వినియోగం చేశారంటూ MP శ్రీభరత్‌ను పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హునిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్‌లో చర్చ, ఓటింగ్ లేకుండా, మీడియా లేకుండా 54.79 ఎకరాల భూముల బదలాయింపు ఆమోదించడం అప్రజాస్వామ్యం అన్నారు.

News January 31, 2026

విశాఖ: ఆర్.పి పట్నాయక్ లైవ్ కాన్సర్ట్ నేడు

image

విశాఖ ఉత్సవ్-2026 వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆర్కే బీచ్ వేదికగా ప్రముఖ గాయకుడు ఆర్.పి పట్నాయక్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. సంగీత ప్రేమికులను అలరించేందుకు అతను తన బృందంతో ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఈ కచేరీకి హాజరుకావాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పాసులు బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

News January 31, 2026

బ్లూ ఎకానమీ అభివృద్ధికి విశాఖ కీలకం: జీతేంద్ర సింగ్

image

దేశ బ్లూ ఎకానమీ అభివృద్ధిలో విశాఖ తీర ప్రాంతం కీలకమని కేంద్ర సహాయ మంత్రి డా. జీతేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఏపీలో వెయ్యి కి.మీ.లకు పైగా తీరం ఉందన్నారు. విశాఖ తీరం దేశ శక్తి భద్రతకు దోహదపడుతుందన్నారు. విశాఖలో తాజాగా ప్రారంభమైన CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కేంద్రం, ONGC, ఆయిల్ ఇండియా సంస్థలతో కలిసి పనిచేస్తూ మత్స్య, పోర్టు, పారిశ్రామిక రంగాలకు శాస్త్రీయ మద్దతు అందిస్తుందని వెల్లడించారు.

News January 30, 2026

విశాఖ: డిప్యూటీ సీఎంను కలిసిన మత్స్యకారులు

image

బంగ్లాదేశ్ సముద్రజలాల్లో పొరపాటున ప్రవేశించిన విశాఖ మత్స్యకారులను అరెస్టు చేసి నిర్బంధించిన విషయం తెలిసిందే. వారిని విడిపించడంలో AP ప్రభుత్వం చూపించిన చొరవగాను మత్స్యకార మహిళలు, పెద్దలు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్‌ని ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో మత్స్యకార మహిళలు కలిశారు. అనంతరం స్థానికంగా సమస్యలు వివరించారు. గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

News January 30, 2026

క్రిప్టో కరెన్సీ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: విశాఖ సీపీ

image

నగరంలో వెలుగుచూస్తున్న క్రిప్టో మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ సూచించారు. నకిలీ యాప్‌లు, వాట్సాప్ లింకులతో మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అధిక లాభాల ఆశచూపే ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ నమ్మవద్దని, వెబ్‌సైట్లలో స్పెల్లింగ్ తప్పులుంటే అవి ఫేక్ అని గుర్తించాలని కోరారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, మోసపోతే వెంటనే నం.1930 ఫిర్యాదు చేయాలని సూచించారు.

News January 30, 2026

విశాఖ: మీడియాపై ఆంక్షలు.. జీవీఎంసీ తీరుపై విపక్షాల ధ్వజం

image

జీవీఎంసీ సర్వసభ్య సమావేశానికి మీడియాను అనుమతించకపోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది. గీతం విద్యా సంస్థలకు చెందిన రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దొడ్డిదారిలో క్రమబద్ధీకరించేందుకే అధికార పక్షం ఈ కుట్ర పన్నిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీడియాను అడ్డుకుని, విపక్షాల గొంతు నొక్కి అక్రమ తీర్మానాలు చేయాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైకాపా నేతలు మండిపడుతున్నారు.

News January 29, 2026

విశాఖ నగర వ్యాప్తంగా భూముల విలువల సవరణ

image

రిజిస్ట్రేషన్ల శాఖ విశాఖ నగర వ్యాప్తంగా భూముల విలువలను సవరించింది. అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్ ప్లాట్లకు ప్రతి చదరపు అడుగుకు రూ.100 పెంపు ప్రతిపాదించింది. ప్రస్తుతం చదరపు అడుగు రూ.4,200గా ఉండగా, కొత్తగా రూ.4,300గా నిర్ణయించారు. అయితే కమర్షియల్ ఆస్తుల విషయంలో చదరపు అడుగుకు రూ.100 తగ్గించారు. నిర్మాణాల కాంపోజిట్ రేట్లను కూడా పెంచనున్నారు. ఈ సవరించిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

News January 29, 2026

విశాఖలో ముగిసిన జాతీయ జైళ్ల అధికారుల సదస్సు

image

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన 9వ జాతీయ కారాగార నిర్వాహకుల సదస్సు గురువారం ముగిసింది. ముగింపు వేడుకలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలు మాత్రమే కాదని, సంస్కరణ నిలయాలుగా మారాలని ఆమె ఆకాంక్షించారు. టెక్నాలజీ వినియోగం, లేబర్ కోడ్ మార్పులు, ఖైదీల పునరావాసంపై సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.