India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ రైల్వే రిజర్వేషన్ కార్యాలయాన్ని ఈనెల 26 మధ్యాహ్నం నుండి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. దీనిని సాధారణ టికెట్ బుకింగ్ కార్యాలయం (General Booking) వద్దకు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ నుండి రిజర్వేషన్ సేవలు అక్కడే అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద రిజర్వేషన్ కౌంటర్‌ను మార్చుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జనవరి 26 నుంచి ప్రస్తుత రిజర్వేషన్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు చెప్పారు. జనవరి 27 నుంచి విశాఖ రైల్వే స్టేషన్ గేట్ నంబర్-2, నంబర్-3 మధ్యగల భవనంలో రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

రిపబ్లిక్ డే రద్దీ దృష్ట్యా విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. 08517 రైలు జనవరి 25న సాయంత్రం5.30కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15కి చర్లపల్లి చేరుతుంది. తిరుగుపయనంలో 08518 రైలు జనవరి 26న మధ్యాహ్నం 3.30కి చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ వస్తుంది. ఈ రైళ్లు దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ప్రయాణిస్తాయి.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని కలెక్షన్ కౌంటర్లు 24 నుంచి 27వ తేదీ వరకు అనగా.. శని, ఆది, సోమ, మంగళ వారాలలో కూడా పనిచేస్తాయని విద్యుత్ సంస్థ ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ శ్యాంబాబు తెలిపారు. వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలోనూ, ఈ-సేవ, మీసేవ కౌంటర్లలో చెల్లించుకోవచ్చని ప్రకటించారు.

మురికివాడల రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు GVMC ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మురికివాడలు ఎక్కడుంటే అక్కడే ఇళ్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఎన్ని ఇళ్లు నిర్మించాలన్నది సర్వే చేసి DPR తయారుచేయనున్నారు. ఇప్పటికే దీనిపై మంత్రి నారాయణ, కమిషనర్ కేతన్ గార్గ్ మురికివాడలను సందర్శించారు. నగరంలో దాదాపు వందకు పైగా మురికివాడలు ఉన్నాయి. దశల వారీగా వీటిని అభివృద్ధి చేయనున్నారు.

ఈనెల 30న జరిగే GVMC కౌన్సిల్ సమావేశంలో 15 అంశాలతో ఎజెండాను తయారు చేశారు. మేయర్ పిలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే సమావేశం ఉ.11 గంటలకు ప్రారంభం కానుంది. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం యూనివర్సిటీ బదలాయింపు, క్రమబద్దికరించే అంశాన్ని ఎజెండాలో పొందుపరిచారు. GVMC ఉద్యోగుల సర్వీస్ అంశం, సింహాచలం తొలిపంచ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద రూ1.25 కోట్ల అభివృద్ధి పనులు వీటిలో కలవు.

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయస్వామి ఈనెల 24, 25వ తేదీల్లో విశాఖలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.
శనివారం ఉదయం విశాఖ చేరుకుని దస్పల్లా హోటల్లో బస చేస్తారు. సాయంత్రం ఆర్‌కే బీచ్ వద్ద నిర్వహించే విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం నగర పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం విశాఖ నుంచి ప్రకాశం జిల్లాకు తిరుగుపయనమవుతారు.

ఈనెల 4వ శనివారం (జనవరి 24) జిల్లావ్యాప్తంగా ‘జీరో-గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర (SASA)లో భాగంగా ఉదయం 6 గంటల నుంచే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. 86 విభాగాలు సమన్వయంతో పాల్గొని వివరాలను సాసా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.

విశాఖ ఉత్సవ్-2026లో నిర్వహిస్తున్న సాంస్కృతి కార్యక్రమాల సమన్వయ బాధ్యతలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శైలజ పర్యవేక్షిస్తారని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. విద్యుత్, వైద్య శాఖల అధికారులతో విశ్వ ప్రియ ఫంక్షన్ హాల్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు బాధ్యతలను ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కేవీ.రామలక్ష్మికి అప్పగించారు.

రూర్కెలా-జగదల్‌పూర్ (ట్రైన్ నంబర్ 18107)కి అదనపు భోగిని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రద్దీని అదుపు చేసేందుకు గాను తాత్కాలికంగా ఒక స్లీపర్ క్లాస్ భోగిని అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.