Visakhapatnam

News November 24, 2024

IPL వేలంలో మన విశాఖ కుర్రాడు

image

ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో విశాఖకు చెందిన కేఎస్ భరత్ రూ.75 లక్షల బేస్ ప్రైస్‌‌తో రిజిస్టర్ చేసుకున్నారు. మరి మన విశాఖ జిల్లా కుర్రాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు? ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందని భావిస్తున్నారో? కామెంట్ చేయండి.

News November 24, 2024

భీమిలి: యువతి సూసైడ్.. వేధింపులే కారణం!

image

భీమిలి మం. మజ్జివలసకు చెందిన రాశి(22) అదే ప్రాంతానికి చెందిన రాజు (26) వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాశి విద్యా వాలంటీర్‌గా పనిచేస్తోంది. ప్రేమ పేరుతో రాజు ఆమెను వేధింపులకు గురిచేయగా ఈ నెల 16న ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఫోన్‌డేటా ఆధారంగా రాజును ఈనెల 22న అరెస్ట్ చేశారు.

News November 24, 2024

క్రీడాభివృద్ధికి సమన్వయంతో పని చేయాలి: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలో క్రీడల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా సంఘాలు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవోతో పాటు ఒలింపిక్ సంఘం పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

News November 23, 2024

విశాఖ: 25, 26 తేదీల్లో పలు రైళ్లు రద్దు

image

ఈనెల 25న విజయవాడ-విశాఖ- విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-విశాఖ-కాకినాడ మెము ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రాజమండ్రి-విశాఖ-రాజమండ్రి పాసింజర్ రైలు రద్దు చేశామన్నారు. 26న విశాఖ గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News November 23, 2024

పచ్చ మంద దుష్ప్రచారం: గుడివాడ అమర్నాథ్

image

చంద్రబాబు ఏం చేసినా ఒప్పు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు అన్నట్లుగా పచ్చ మంద దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ రూ.6.99 లకు కొంటే తప్పులేదు కానీ జగన్ కేవలం యూనిట్ రూ.2.49లకు కొంటే మాత్రం తప్పు అన్నట్లుగా ప్రచారం చేస్తుందని శనివారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.

News November 23, 2024

నాపై కేసు కొట్టేయండి: హోం మంత్రి అనిత

image

హోం మంత్రి అనిత చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి రాజీ కుదుర్చుకున్నానని తనపై కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2015లో శ్రీనివాసరావు వద్ద రూ.70 లక్షలు అప్పుతీసుకున్నారు. 2018లో అప్పుకు అతనికి చెక్కును ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవ్వగా అప్పట్లో విశాఖ కోర్టులో సూట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా.. ఇటీవల ఆమె హోం మంత్రి అయ్యాక రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం.

News November 23, 2024

విశాఖ: ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం

image

విశాఖలోని కొబ్బరి తోట వద్ద ఓ బాలిక మిస్సింగ్ కేసులో రౌడీ షీటర్‌ను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14వ తేదీన తన కుమార్తె కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేయగా చివరకు ప్రేమ పేరుతో రౌడీ షీటర్ దేశరాజ్ కుమార్ మాయ మాటలు చెప్పి బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును మార్పు చేసి పోక్సో చట్టం కింద రౌడీ షీటర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.

News November 23, 2024

మహిళా ఎమ్మెల్యేలతో హోంమంత్రి సెల్ఫీ

image

అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మహిళా ఎమ్మెల్యేలతో సరదాగా గడిపారు. వారితో కలిసి సెల్ఫీ దిగారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొన్నారని హోంమంత్రి పేర్కొన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జన్మదినం కావడంతో కేక్ కట్ చేశారు.

News November 22, 2024

విశాఖ, అరకులో యాంకర్ హబ్‌లు: మంత్రి దుర్గేశ్

image

విశాఖ, అరకులో యాంకర్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని టూరిజం మంత్రి కందుల దుర్గేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. తొట్లకొండతో పాటు పలు బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ నుంచి క్రూయిజ్ సేవలు విస్తరిస్తామన్నారు. బీచ్ టూరిజం సర్క్యూట్‌లో భాగంగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో బీచ్‌ల అభివృద్ధితో పాటు ఎకో టూరిజాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బొర్రా గుహలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

News November 22, 2024

మంచు తెరల్లో పొద్దుతిరుగుడు అందాలు

image

ఇదేదో గ్రాఫిక్స్ ఫొటో..లేదా వాల్ పేపర్ ఫొటో అనుకుంటే మీ పొరపాటే.! డుంబ్రిగూడ మండలంలోని జంగిడివలస రైల్వే గేటు సమీపంలో స్థానిక గిరిజనులు వేసిన పొద్దుతిరుగుడు పువ్వుల పంట ఇది. ఒకపక్క ఆహ్లాదకరమైన మంచు తెరలు.. మరోపక్క ఆకర్షించే ఈ పొద్దుతిరుగుడు పువ్వుల అందాలు ప్రకృతి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మైదాన ప్రాంతానికి చెందిన పర్యాటకులు ఈ అద్భుతమైన దృశ్యాలను చూసి ఫిదా అవుతున్నారు.