Visakhapatnam

News July 10, 2024

విశాఖ: పలు రైళ్లు రీ షెడ్యూల్

image

వాల్తేర్ రైల్వే డివిజన్ పుండి-నౌపడ సెక్షన్‌లో భద్రతపరమైన ఆధునీకరణ పనులు కారణంగా ఈనెల 11,13 తేదీలలో పలు రైళ్ల బయలుదేరే సమయాలు మార్చడంతోపాటు కొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేరు డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈనెల 11న, ట్రైన్ నెంబర్ 12830, 22879 గల రైలు 45 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరుతాయి. సంత్రగచ్చి-విశాఖ ఎక్స్‌ప్రెస్ 6 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. ఈ విషయాన్ని గమనించాలని ప్రయాణికులను కోరారు.

News July 10, 2024

నక్కపల్లి హాస్పిటల్‌లో వికటించిన ఇంజెక్షన్

image

నక్కపల్లి ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి టెన్షన్ నెలకొంది. ఆస్పత్రిలోని రోగులకు సిపిటాక్సిం ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్లు వికటించడంతో 23 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ వాంతులై వణుకు మొదలవడంతో రోగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది హడలిపోయారు. డా.జయలక్ష్మి సకాలంలో వైద్య సేవలు అందించడంతో 23 మంది రోగులు రికవరీ అయ్యారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

News July 10, 2024

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ రూట్ మ్యాప్ ఇదే

image

ఈనెల 20న జరిగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర జరిగే ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం, అడివివరం, బి.ఆర్.టీ.ఎస్ రహదారి మీదుగా, ముడసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్.ఎ.డి కూడలి నుంచి గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భక్తులు కాలి నడకన చేరుకుంటారు. > Share it

News July 10, 2024

అల్లూరి జిల్లాలో కూలిన చెట్టు.. నిలిచిన రాకపోకలు

image

పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి కోట్లగరువు వద్ద రోడ్డుకి అడ్డంగా భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్డుకి అడ్డంగా ఈ వృక్షం కూలిపోయింది. దీంతో పాడేరు విశాఖ వైపు మైదాన ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాహనాల్లో ఒక 108 వాహనం ఉంది. స్థానికుల సహాయంతో చెట్టు తొలగిస్తున్నారు.

News July 10, 2024

విశాఖ: రైల్వే అభివృద్ధి పనులపై ఎంపీల ఆరా

image

వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు ఆరా తీసారు. విశాఖ డిఆర్ఎం కార్యాలయంలో రైల్వే డివిజన్ అధికారులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు ప్రయాణికులకు అందుతున్న సేవలు సౌకర్యాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ పాల్గొన్నారు.

News July 10, 2024

నేడు కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ రాక

image

కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ఎ కుమారస్వామి బుధవారం విశాఖ వస్తున్నారు. సాయంత్రం 6.30గంటలకు ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ ఉక్కు అతిథి గృహానికి చేరుకొని రాత్రికి బస చేస్తారు. 11న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గం టల వరకు ఉక్కు కర్మాగారం సందర్శించి సమీక్షా సమావేశాల్లో మంత్రి పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళతారు.

News July 10, 2024

విశాఖలో డ్యూక్ బైక్ ఢీ.. ఒకరి మృతి

image

విశాఖలో డ్యూక్ బైక్‌తో మంగళవారం రాత్రి ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. మాధవధార నుంచి వెళుతూ జ్యోతినగర్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరిని కంచరపాలెం నుంచి వస్తున్న క్రాంతి బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో త్రినాథరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. సన్యాసిరావు అనే వ్యక్తి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరూ రోజువారి కూలీలే. ఈ ఘటనలో బైకర్‌కు స్వల్పగాయాలయ్యాయి. 

News July 10, 2024

అల్లూరి జిల్లాలో గంజాయి తోటల ధ్వంసం: ఎస్పీ

image

ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో 7,500 ఎకరాలలో గంజాయి తోటలను పోలీసుశాఖ ధ్వంసం చేసిందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. గంజాయి సాగుచేసే గిరిజనుల్లో మార్పు తీసుకువచ్చామన్నారు. గంజాయి సాగు చేసే రైతులపై కేసులు నమోదు చేయడంతో పాటు, వారిని ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించి ఉచితంగా విత్తనాలు, పండ్ల జాతుల మొక్కలు అందజేశామన్నారు. వారికి ఉపాధి రంగాల్లోను శిక్షణ ఇచ్చామని తెలిపారు.

News July 10, 2024

విజయం సాధించిన కోస్టల్ రైడర్స్

image

విశాఖ వైఎస్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3లో భాగంగా మంగళవారం కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి కోస్టల్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన గోదావరి టైటాన్స్ 17.1 ఓవర్లలో 138 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్ రైడర్స్ 141 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

News July 10, 2024

యుటిలైజేషన్ పత్రాలు సమర్పించాలి: కలెక్టర్ దినేశ్

image

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయిన ఖర్చుకు సంబంధించిన బిల్లులను వెంటనే సమర్పించాలని, ఎన్నికల రిటర్నింగ్ అధికారులను, నియోజకవర్గ ప్రధాన కేంద్రం తహశీల్దార్‌లను కలెక్టర్ ఏఎస్.దినేశ్ కుమార్ ఆదేశించారు. అదేవిధంగా గత 2022, 2023లలో జరిగిన వరదలకు సంబంధించి ముంపు మండలాల్లో డీసీ బిల్లులు డ్రా చేసిన తహశీల్దార్లు వెంటనే ఏసీ బిల్లులు పెట్టాలని, యుటిలైజేషన్ పత్రాలు సమర్పించాలని ఆదేశించారు.