India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భీమిలి బీచ్‌లో నిర్మించిన ప్రహరీ రెండో సారి కూలగొట్టడంపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘మంత్రి నారా లోకేశ్, ఎంపీ శ్రీ భరత్ కుమ్మక్కై రాజకీయ కక్షతో మా ప్రైవేట్ స్థలంలో ప్రహరీ పగలగొట్టారు’అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇది పిల్ల చేష్టల పనిగా భావిస్తున్నానని అన్నారు. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు అక్రమ కొంపను ఆ నిబంధనల ప్రకారమే కూల్చమని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఊరట లభించింది. ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న దీనికి మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ.500 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రేడ్-2 వీఆర్వోలకు విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. బదిలీల కోసం మొత్తం 234 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 51 మందికి బదిలీలు నిర్వహించినట్లు డీఆర్ఓ తెలిపారు.
మహాకవి గురజాడ వేంకట అప్పారావు జయంతి నిర్వహించేందుకు ఆయన జన్మస్థలమైన ఎస్.రాయవరం గ్రామంలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న గురజాడ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దారు. ఈ సందర్భంగా గ్రామంలో శుక్రవారం, శనివారం గురజాడ జయంతి వేడుకలు జరుపుతామని గురజాడ ఫౌండేషన్ సభ్యుడు బొలిశెట్టి గోవిందరావు తెలిపారు.
విశాఖలో బాలికపై అత్యాచారం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ముద్దాయి జీ.వెంకట రమణకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. ప్రభుత్వం నుంచి బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆనందీ తీర్పు వెలువరించారు.
విశాఖ జిల్లాలో మంజూరైన ప్రతి ఇంటిని అధికారులు దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజాబాబు ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గృహ నిర్మాణాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులకు కాంట్రాక్టర్లకు అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసి మయూర్ అశోక్ పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదని, వైసీపీని రద్దు చేస్తే దేశానికి మంచిదని ఎలక్షన్ కమిషన్‌ను కోరనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.ఆనందపురంలో శుక్రవారం జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదమైన లడ్డూలో జంతువు కొవ్వు అవశేషాలున్నట్టు తేలడంతో హిందూ సమాజం నివ్వెర పోయిందన్నారు.
తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఈ సంఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. విశాఖకు చెందిన విజయ్ కుమార్ చిరుధాన్యాలతో చిత్రాలను, బొమ్మలను తయారుచేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల మిల్లెట్స్‌తో తయారు చేసిన సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని అమరావతిలో అయనకు బహూకరించారు. వివిధ చోట్ల జరిగిన జీ- 20 సదస్సులో ఆయన తయారుచేసిన మిల్లెట్ చిత్రాలు ప్రదర్శించారు.
మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికలలో సహాయ సహకారాలను అందించాలంటూ పిలుపు వచ్చింది. అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న అమెరికా తొలి మహిళా స్పీకర్ నాన్సీ పెలోసీ కోరారు. ఈ మేరకు వారిద్దరూ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు ఈమెయిల్ సందేశాలు వంపినట్లు లక్ష్మీ ప్రసాద్ కార్యదర్శి ఎస్.బాబయ్య తెలిపారు.
Sorry, no posts matched your criteria.