Visakhapatnam

News May 7, 2025

విశాఖలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ

image

విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం డీఆర్సి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ‌భ‌ర‌త్ మంత్రి డోలా బాల వీరాంజనేయులు దృష్టికి పలు సమస్యలు తీసుకువెళ్లారు. ప‌రిపాల‌నాప‌ర‌మైన అంశాల్లో అధికారులు త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని, కాల‌యాప‌న చేయ‌రాద‌ని పేర్కొన్నారు. న‌గ‌రంలో పలు ప్రాంతాల్లోని అవ‌స‌రాల‌కు స‌రిప‌డా సామ‌ర్థ్యం కలిగిన‌ వీధి దీపాలు వేయాల‌ని, దీని కోసం ముందుగా ఆడిట్ చేయాల‌ని సూచించారు.

News May 7, 2025

వీసాల రద్దుపై విశాఖ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు

image

భారత ప్రభుత్వం జారీ చేసిన పాకిస్థాన్ వీసాలను రద్దు ఉత్తర్వులు విశాఖ అధికారులకు అందాయి. ఈ నేపథ్యంలో జిల్లా రెవిన్యూ అధికారి పేరున ఒక ప్రకటన విడుదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య దీర్ఘకాలిక దౌత్య వీసాలు మినహా మిగతా అన్నిటిని భారత ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో ఎవరైనా పాకిస్థాన్‌కు చెందిన వారు ఉంటే వెంటనే విడిచి వెళ్లిపోవాలని సూచించారు.

News May 7, 2025

విశాఖలో క్యాబ్ బిల్డింగ్ ప్రారంభించనున్న సీఎం 

image

ఆంధ్ర మెడికల్ కళాశాలలో నిర్మించిన క్యాబ్ బిల్డింగ్‌ను సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళంలో పర్యటించనున్న నేపథ్యంలో శనివారం సా.6 గంటలకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పూర్వ విద్యార్థుల నిధులతో ఈ క్యాబ్ బిల్డింగ్ నిర్మించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారి యంత్రాంగం, ఏఎంసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News May 7, 2025

పాకిస్థాన్ పౌరులు వెళ్లిపోవాలి: విశాఖ CP 

image

పాకిస్థాన్ పౌరులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని వీసాలు ఏప్రిల్ 27తో, వైద్య వీసాలు ఏప్రిల్ 29తో రద్దు అవుతాయని విశాఖ CP శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖలో ఉన్న పాకిస్థాన్ పౌరులు వెంటనే వారి దేశానికి వెళ్ళిపోవాలన్నారు. అక్రమంగా ఎవరైనా నివసిస్తన్నట్లు గుర్తిస్తే వారితో పాటు వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

News May 7, 2025

విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు శనివారం విశాఖ రానున్నారు. ఉదయం 11.25కి విశాఖ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం వెళ్తారు. శ్రీకాకుళంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుంచి సాయంత్రం 5.45కి విశాఖ చేరుకుంటారు. సాయంత్రం ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరి 7:25 కు షాప్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.

News May 7, 2025

సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

image

ఈనెల 30న జరగనున్న సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై కలెక్టర్ ఛాంబర్‌లో మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్, ఆరోగ్య కేంద్ర శిబిరాలు, అన్న ప్రసాదం మంచినీరు వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ, దేవస్థానం ఈవో సుబ్బారావు ఉన్నారు.

News May 7, 2025

‘ఆర్థిక రాజ‌ధాని ప్ర‌మాణాల‌కు అనుగుణంగా విశాఖ‌ను తీర్చిదిద్దాలి’

image

ఆర్థిక రాజ‌ధాని ప్ర‌మాణాల‌కు అనుగుణంగా విశాఖ‌ను తీర్చిదిద్దాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బాల వీరాంజ‌నేయ స్వామి పేర్కొన్నారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో నాయకులు, అధికారులతో సమావేశమయ్యారు. దేశంలోనే అత్య‌ధికంగా ఆదాయ వ‌న‌రులున్న న‌గ‌రంగా విశాఖను పేర్కొన్నారు. అభివృద్ధికి విశాఖలో అన్ని ర‌కాల అవ‌కాశాలున్నాయ‌ని, దానికి అనుగుణంగా ముందుకు సాగుదామ‌న్నారు. అనంతరం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు.

News May 7, 2025

విశాఖ డిఫెన్స్‌లో ఎమర్జెన్సీ ఇంటరాక్షన్

image

విశాఖ డిఫెన్స్‌లో ఎమర్జెన్సీ ఇంటరాక్షన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాండింగ్ ఇన్‌చీఫ్ రాజేష్ పెంధార్కర్ పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడితో ఈ ఇంటరాక్షన్‌కు ప్రాముఖ్యత సంతరించుకుంది. భద్రతకు సంబంధించి, ఎటువంటి సమయంలోనైనా అందుబాటులో ఉండాలని ఆయన ప్రతి సైనికుడికి తెలియపర్చడం చర్చనీయాంశంగా మారింది. భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News April 25, 2025

విశాఖలో చంద్రమోలి అంతిమ యాత్ర

image

పహల్గాంలో ఉగ్రమూకల కాల్పుల్లో మరణించిన చంద్రమోలి అంతిమ యాత్ర విశాఖలో ప్రారంభమైంది. పాండురంగాపురంలో ఆయన పార్థివదేహానికి మంత్రులు అనిత, సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నివాళులు అర్పించి పాడె మోశారు. జ్ఞానాపురం శ్శశాన వాటికలో ఆయన దహన సంస్కణలు పూర్త చేయనున్నారు.

News April 25, 2025

విశాఖ జూలో వేసవి తాపానికి చెక్

image

వేసవికాలం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల వేసవితాపం జూక్యూరేటర్ మంగమ్మ, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రకాల జంతువుల వద్ద వాటర్ స్పింక్లర్లు ఏర్పాటు చేయడం, సాదు జంతువులకు వాటర్ స్ప్రే చేయడం, కొన్ని రకాల పక్షులకు, జంతువులకు ఎయిర్ కండిషన్స్ ఏర్పాటు చేయడం వంటి సదుపాయాలు కల్పించారు.అదేవిధంగా వాటర్ మిలన్, కర్బూజా వంటి చల్లని పదార్థాలు అందజేస్తారు.