India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 28 రోజులకు గాను ఆలయ అధికారులు ఈవో సుబ్బారావు పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. మొత్తం రూ.1,81,41,219 ఆదాయం వచ్చింది. బంగారం 145.100 గ్రాములు, వెండి 11.250 కిలోలు, 8 దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

పెందుర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన అబ్దుల్ సమీరా భాను బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలల్లో సత్తా చాటింది. 600 మార్కులకు గాను 598 మార్కులు వచ్చాయి. పెందుర్తి మండలంలో 598 మార్కులు రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థిని పలువురు అభినందించారు.

సీఎం చంద్రబాబు నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం గన్నవరం నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖకు చెందిన చంద్రమౌలికి నివాళులు అర్పిస్తారు. భౌతికకాయం రాత్రి 10గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు విమానాశ్రయంలో మృతదేహాన్ని స్వయంగా స్వీకరించి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చుతారు.

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విశాఖ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 28,435 మంది పరీక్ష రాయగా 25,346 మంది పాసయ్యారు. 15,045 మంది బాలురులో 13,288(88.32%) మంది, 13,390 మంది బాలికలు పరీక్ష రాయగా 12,058(90.05%) మంది పాసయ్యారు. 89.14 పాస్ పర్సంటైల్‌తో విశాఖ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. గతేడాది 8వ స్థానంలో నిలవగా ఈసారి ఐదు స్థానాలు మెరుగుపడింది.

జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో విశాఖ వాసి చంద్రమౌళి మృతి పట్ల విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో ఉన్న చంద్రమౌళి భార్య, కుటుంబ సభ్యులను ఫోన్ చేసి ఓదార్చారు. ఉగ్రదాడుల్లో చంద్రమౌళి మృతి బాధాకరమన్నారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా, ఇది హేయమైన చర్య అని పేర్కొన్నారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమోళి మృతదేహాన్ని ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ తీసుకురానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆ విమానం విశాఖ చేరుకోనుంది. వేసవి నేపథ్యంలో పాడురంగపురం ప్రాంతానికి చెందిన చంద్రమోళితో పాటు మరో రెండు కుటుంబాలు పహల్గాం టూర్‌కు వెళ్లారు. ఉగ్రమూకల దాడిలో చంద్రమోళి మృతి చెందడంతో పాడురంగపురంలో విషాదచాయలు అలముకున్నాయి.

చినవాల్తేరు పీహెచ్సీలో పనిచేస్తున్న డా.మానస సివిల్స్‌కు ఎంపికయ్యారు. సివిల్స్ ఫలితాల్లో రావాడ సాయి మోహన మానస 975వ ర్యాంకు కొట్టి ఆదర్శంగా నిలిచింది. మానస తండ్రి రావాడ ప్రకాశరావు శ్రీకాకుళం మొబైల్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మానస తల్లి కె.ఉషారాణి రాజాం ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సుగా పని చేస్తున్నారు. మూడో ప్రయత్నంలో ఆమె సివిల్స్ ర్యాంక్ సాధించారు.

విశాఖలోని 13 రైతు బజార్‌లలో కొనుగోలు చేసే కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు బుధవారం ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లి రూ.18, వంకాయలు రూ.15, బంగాళాదుంపలు రూ.18,కాకరకాయ రూ.30,బీరకాయలు రూ.32,బెండకాయలు రూ.22,క్యాబేజీ రూ.16,గుమ్మడి కాయ రూ.16,గోరు చిక్కుడు రూ.28,పొటల్స్ రూ.30,టమాటా రూ.16, క్యారట్ రూ.30/32,బీన్స్ రూ.52,కీర దోస రూ.22,బద్ద చిక్కుడు కాయ రూ.50,అల్లం రూ. 44,మిర్చి రూ.25గా ఉన్నాయి.

నేపాల్‌కు చెందిన ఓ మహిళ తప్పిపోయి విశాఖలో ఉన్నట్లు నేపాల్ పోలీసులు గమనించారు. ఈ మేరకు నేపాల్ పోలీసులు విశాఖ సీపీ చొరవతో గాజువాక పోలీసుల సహాయంతో ఆమె ఆచూకీని కనుగొన్నారు. అనంతరం ఆమెను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ విషయమై మంగళవారం నేపాల్ పోలీసులు విశాఖ సీపీ, పోలీసులను అభినందిస్తూ లేఖ రాశారు. మిస్సింగ్ కేసును ఛేదించిన గాజువాక పోలీసులను సీపీ అభినందించారు.

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే.రాజును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అయితే కేకే.రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండుసార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందరు.
Sorry, no posts matched your criteria.