India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?

ద్వారకానగర్‌లో ఎస్టీ, ఎస్సి విద్యార్థుల ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్‌లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి డీఎస్సీ అభ్యర్థులు పాలాభిషేకం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ పర్యవేక్షణలో బెట్టింగ్ ముఠాను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గాజువాక పరిధిలో బీహెచ్‌పీవీ వద్ద బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం రావడంతో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 సెల్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతుందో ఆరా తీస్తున్నారు. కమిషనర్ ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ఈ దాడులు చేసింది.

ఒంటరితనం భరించలేక ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో ఆదివారం చోటు చేసుకుంది. పీఎం పాలెం సెకండ్ బస్టాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో మృతుడు నివస్తున్నాడు. తల్లిదండ్రులు, అన్నయ్య మృతి చెందడంతో ఒంటరిగా ఉన్న ఆయన మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం KGHకి తరలించారు.

విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖ నగర ప్రజలు లా అండ్ ఆర్డర్,క్రైమ్, దొంగతనాలు, ట్రాఫిక్ సమస్యలు,పలు పోలీస్ సంబంధిత సమస్యలపై రేపు ఉదయం 10 గంటల నుంచి వినతులు సమర్పించవచ్చన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అయితే అంబేడ్కర్ జయంతి కారణంగా గత సోమవారం పీజిఆర్ఎస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఏప్రిల్ 30న సింహాచలంలో జరగనున్న చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుబ్బారావు ఆదివారం తెలిపారు. ఈనెల 24న మొదటి విడత చందనం అరగదీతను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని కోసం కావాల్సిన 500 కేజీల చందనపు చెక్కలను ఆదివారం సిద్ధం చేశారు. ఈనెల 24 ఉదయం 6:30కు చందనం అరగదీత మొదలవుతుందని, 7:30 తర్వాత దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.

G.V.M.C.ఎన్నికల్లో కార్పొరేటర్లను ప్రలోభపెట్టినట్టు ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు దాన్ని నిరూపించాలని V.M.R.D.A ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ సవాల్ చేశారు. అవిశ్వాసంలో ధర్మబద్ధంగా నెగ్గామన్నారు. గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు చేయని అరాచకం లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఇకపై జీవీఎంసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామన్నారు.

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 26, ➱HINDI: 28, ➱ENG: 55, ➱MATHS: 59, ➱PS: 39, ➱BS: 58, ➱SOCIAL: 91, ➱PE:139, ➱SGT: 239, ➱TOTAL: 734 ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱TEL: 07, ➱HINDI: 11, ➱MATHS:07, ➱PS: 35, ➱SOCIAL:05, ➱SGT: 335, ➱TOTAL:400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన మొదటి మేయర్‌గా హరివెంకట కుమారి నిలిచారు. విశాఖ మున్సిపాలిటీ 1979లో కార్పొరేషన్‌గా మారింది. 1981లో జరిగిన ఎన్నికల్లో మొదటి మేయర్‌గా N.S.N.రెడ్డి(1981-1986) గెలిచారు. అనంతరం 1987లో D.V సుబ్బారావు, 1995లో సబ్బం హరి, 2005లో రాజాన రమణి మేయర్లుగా పనిచేశారు. 2005లో G.V.M.C ఆవిర్భవించినాక 2007లో మేయర్‌గా జనార్దనరావు ఎన్నికయ్యారు. 2021లో హరివెంకట కుమారి పదవి చేపట్టారు.

రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీని 40,132 మంది లబ్దిదారులకు విడుదల చేశామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. వారిలో 26,651 లబ్దిదారులకు రూ.2,11,06,884 బ్యాంకు అకౌంట్లలో జమైందన్నారు. మిగతావారికి త్వరలో సబ్సిడీ మొత్తం జమవుతుందని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.