India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వేసవి రద్దీ దృష్ట్యా విశాఖ మీదుగా కర్నూలు, బెంగళూరు, తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. విశాఖ -కర్నూలు (08545/46) ఏప్రిల్ 15 నుంచి మే 27 వరకు, విశాఖ -బెంగళూర్ (08581/82) ఏప్రిల్ 13 నుంచి మే 25 వరకు, విశాఖ -తిరుపతి (08547/48) ఏప్రిల్ 16 నుంచి మే 28 వరకు ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

విశాఖ రైల్వే స్టేషన్ గుండా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా పూర్తిగా నిర్వీర్యం చేయడంపై రైల్వే పోలీసులతో విశాఖ సీపీ శంఖబ్రతా బాగ్చి శుక్రవారం సీపీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రైళ్ల ద్వారా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే ఆస్తుల వద్ద భద్రతా, స్టేషన్ వద్ద స్కానింగ్ మిషన్ల ఏర్పాటు, స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పొదలు తొలగింపు, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

విశాఖలో దారి దోపిడీ చేసిన 17 ఏళ్ల మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు క్రైమ్ డీసీపీ లతా మాధురి శుక్రవారం తెలిపారు. ఈనెల 10న స్టీల్‌ప్లాంట్ పరిధిలో ఓ మైనర్ ర్యాపిడో రైడ్ బుక్ చేశాడు. తుమ్మగంటి కిషోర్ ఆ రైడ్ పిక్ చేసుకొని మైనర్‌ను తీసుకెళ్తుండగా నిర్మానుష ప్రదేశంలో వాహనం ఆపి డ్రైవర్‌ను కొట్టి రూ.48,100 లాక్కున్నాడు. కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీపీ ఆదేశాల మేరకు ఆ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

విశాఖలో రెండో శనివారం ఎటువంటి సెలవు ఉండదని జిల్లా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాలయం శుక్రవారం తెలిపింది. విశాఖలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతాయని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ప్రతి నెలలో రెండో శనివారం సెలవు కాగా ఈ వారం మాత్రం ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయలు పనిచేస్తాయని తెలిపారు.

విశాఖ రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారి లడ్డూల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్య శుక్రవారం తెలిపారు. ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంకు శ్రీవారి లడ్డూల పంపిన నేపథ్యంలో ఇక్కడి విక్రయాలు నిలిపివేశామన్నారు. కావున భక్తులు గమనించాలని కోరారు.

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. గ్రీన్‌పార్క్ జంక్షన్ వద్ద గల శుక్రవారం ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలబాలికల పాఠశాలల ఏర్పాటు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై ఆయన చేసిన కృషి వర్ణణాతీతమని ప్రశంసించారు. అనంతరం బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి సబ్సిడీ చెక్కు అందించారు.

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విశాఖ జిల్లాలో ఫస్టియర్ 42,257 మంది, సెకండియర్ 40,744 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 83,001 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

బడుగు, బలహీనవర్గాలకు అశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఫూలే జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అంటరానితనంపై పోరాటం చేసి, వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సామాజిక సంస్కర్త పూలే అని కొనియాడారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం నుంచి విశాఖ నగరంలో వాతావరణ మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 10న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గురువారం తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినయోగించుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.