India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారణకు 64 సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. తన ఛాంబర్లో బుధవారం హిట్ అండ్ రన్ జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 34కి.మీ. రోడ్డుపై 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులు లేకుండా చేసేందుకు సీసీ కెమెరాల అమర్చే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులు లేకుండా చూడాలన్నారు.
APSSDC ఆధ్వర్యంలో ఈనెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. స్థానిక మహారాజ అటానమస్ కాలేజీలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. మిరాకిల్ సాప్ట్‌వేర్ సిస్టంలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీకాం, BBA, MBA, MCA, MSC, BCA చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. >Share It
ఢిల్లీలోని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రామభద్రపురం నుంచి రాయగడ వరకు నాలుగు లైన్ల రోడ్లుగా మార్చాలని, అలాగే నెల్లిమర్ల జంక్షన్ నుంచి రామతీర్థం మీదగా రణస్థలం రోడ్డును విస్తరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలపై గతంలోనే కేంద్రమంత్రికి విన్నవించామని మరోసారి గుర్తు చేయడం జరిగిందని ఎంపీ తెలిపారు.
విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. 2024- 25 విద్యా సంవత్సరంలో మార్చి- 17వ తేదీ నుంచి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం హాజరుకానున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు.
జిల్లాలో పర్యాటకాభివృద్ధికి పీపీ మోడల్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే వారికి అవసరమైన భూమి, ఇతర అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, బీచ్ టూరిజం , టెంపుల్ టూరిజం, క్రింద ఎవరైనా ముందుకు వస్తే మంచి లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.
ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1,124 మంది చొప్పున రెండు విడతలకు 2248 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నట్లు చెప్పారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్, అర్బన్, పీఎం జన్‌మన్ పథకాల కింద గతంలో మంజూరై నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిందని కలెక్టర్ అంబేడ్కర్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిన మొత్తానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందిస్తుందన్నారు.
సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నాటుసారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరు 14405 కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.
విజయనగరం ఉడా కాలనీకి చెందిన క్రీడాకారిణి కిల్లకి లలిత వరల్డ్ పారా అథెటిక్స్‌లో మెరిసింది. న్యూఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీల్లో తొలిరోజు టీ-11 విభాగం 1,500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. లలిత జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ ప్రతినిధులు, తోటి క్రీడాకారులు అభినందించారు.
విజయనగరం జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదైన నిరక్షరాస్యులైన వయోజనులకు 3 గంటల పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ పరీక్ష 23న ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుందని, ఈ మధ్యలో ఏ 3 గంటలైనా అభ్యర్థులు పరీక్షను రాయవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సుమారు 48 వేల మంది ఈ పరీక్ష రాయనున్నారని, 875 పాఠశాలలను గుర్తించి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.