Vizianagaram

News March 28, 2026

VZM: నేర నియంత్రణకు కట్టుదిట్టమైన వాహన తనిఖీలు

image

జిల్లాలో నేరాలను అరికట్టేందుకు విజిబుల్ పోలీసింగ్‌తో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని ఎస్పీ దామోదర్ శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 10 ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, మద్యం, నాటుసారా, పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని ఆయన చెప్పారు. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మోటారు వాహన చట్టం ఉల్లంఘించిన వారిపై ఈ-చలానాలు విధిస్తున్నామన్నారు.

News March 28, 2026

VZM: టెన్త్ పరీక్షకు 99.72 శాతం హాజరు

image

జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పదో తరగతి జీవ శాస్త్రం పరీక్షకు 99.72 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా మొత్తం 22969 మంది హాజరు కావల్సి ఉండగా వారిలో 22,905 మంది హాజరయ్యారన్నారు. కేవలం 64 మంది విద్యార్ధులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు.

News March 28, 2026

జిల్లా యువత వీటికి దూరంగా ఉండండి: ఎస్పీ

image

ఐపీఎల్ సీజన్ నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్‌రావు సూచించారు. బెట్టింగ్ యాప్‌లు అప్పులపాలు చేసి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తాయని, వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తే 100కు ఫోన్ చేయాలని కోరారు. బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 27, 2026

VZM: అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

image

తెలుగుదేశం సీనియర్ నాయకుడు తిక్కాన చినదేముడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఎస్.కోట నియోజకవర్గంలో వెన్నెముకగా ఉండి సర్పంచిగా, వైస్ ఎంపీపీగా, విశాఖ పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు, ఉత్తమ రైతుగా పనిచేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. చినదేవుడు మృతి టీడీపీకి తీరనిలోటని ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు.

VZM: ఆర్కే బీచ్‌లో అలలకు కొట్టుకెళ్లారు..ఆ తర్వాత?

image

ఆర్కే బీచ్‌లోని కాళీమాత టెంపుల్ ఎదురుగా సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు అలల తాకిడికి కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ పోలిరాజు, దేవుడు, సురేష్ కాపాడారని మెరైన్ సీఐ రమేష్ తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయిన వారు విజయనగరానికి చెందిన జగదీష్, ఒడిశాకు చెందిన సుమత్ అమత్‌లుగా గుర్తించారు. వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

రామతీర్థం సీతారాముల కల్యాణానికి హాజరైన ఎస్పీ

image

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామతీర్థంలో నేడు నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఎస్పీ దామోదర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించి ఆలయానికి చేరుకున్నారు. వీరికి అర్చకులు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించారు.