Vizianagaram

News March 26, 2026

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదు: VZM JC

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ బుధవారం స్పష్టం చేశారు. గ్యాస్ కొరత ఉన్నట్లు పత్రికల్లో వస్తున్న వార్తలను గమనించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లకు సరఫరా చేసే గ్యాస్ సిలిండర్లు, పాఠశాలలు, సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్ వసతి గృహాలకు ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని సూచించారు.

News March 26, 2026

VZM: ‘మ్యుటేషన్ల తిరస్కరణలు తగ్గాలి’

image

జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి ఆదేశించారు. రీసర్వే, 22-ఏ భూములు, త‌దిత‌ర రెవెన్యూ అంశాల‌పై దిశానిర్ధేశం చేశారు. వీటిపై జేసీ సేధు మాధవన్‌తో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. మ్యుటేషన్లను త్వరితగతిన పూర్తి చేసి తిరస్కరణలు తగ్గించాలని పేర్కొన్నారు. రీసర్వే, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు.

VZM: ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే రద్దు..

image

జిల్లాలో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ పథకాల పురోగతిపై బుధవారం విజయనగరం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, లబ్ధిదారులను చైతన్య పరిచి పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించాలని సూచించారు. అవసరమైతే మంజూరైన ఇళ్లను రద్దు చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.

News March 25, 2026

VZM: 27న పాఠశాలలకు సెలవు

image

విజయనగరం జిల్లాలో శ్రీరామనవమి పండగ సందర్భంగా ఈనెల 27న అన్ని యాజమాన్యాల పాఠశాలలకు DEO మాణిక్యంనాయుడు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేపు 26న పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

News March 25, 2026

VZM: ‘మాతృ, శిశు మరణాలపై అలసత్వం వద్దు’

image

జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మాతృ, శిశు మరణాలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రతీ మరణంపై జవాబుదారీతనం ఉండాలని, ప్రజల ప్రాణరక్షణకు వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఇటీవల జరిగిన మరణాల కారణాలను పరిశీలించి, అంబులెన్స్ ఆలస్యం, చికిత్సలో ఆలస్యం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు.

News March 25, 2026

పొగిరిలో డయేరియా కేసులు లేవు: కలెక్టర్

image

రాజాం మండలం పొగిరిలో డయేరియా కేసులు లేవని కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. గ్రామంలో జరిగిన ఒక వేడుకలో కలుషిత ఆహారం తీసుకోవడంతో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. ఈనెల 21 నుంచి 25 వరకు ఐదుగురు ఆసుపత్రిలో చేరగా, ఇద్దరిని డిశ్చార్జ్ అయ్యారని.. మిగిలిన ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.