India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఆదివారం ప్రకటించింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన కావలి గ్రీష్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతీ కుమార్తె గ్రీష్మ. ప్రస్తుతం ఈమె ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు.
సోమవారం నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PVGR) కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో గత కొన్ని వారాలుగా పిజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో సోమవారం నుంచి యథావిధిగా గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని అర్జీదారులు వినియోగించుకోవాలన్నారు.
విజయనగరం నగర పాలక సంస్థలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను డబ్బులు సకాలంలో నగర పాలక సంస్థకు జమ చేయని ముగ్గురు కార్యదర్శులను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ పి.నల్లనయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్ను వసూలు చేసి సకాలంలో జమ చేయడం లేదని గుర్తించి పన్ను డబ్బులు జమ చేపించి సస్పెండ్ చేశామన్నారు. పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడిన, నిర్లక్ష్యంగా ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏడాది వయసున్న బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటూ సైకిల్ ట్యూబ్ వాల్ పిన్ మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. బాలుడు ఏడుస్తూ అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఓ హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్ ఎండోస్కోపి ద్వారా బాలుడు అన్నవాహికలో ఇరుక్కున్న వాల్ పిన్ జాగ్రత్తగా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. స్థానిక కోర్టులో శనివారం ఆయన మాట్లాడుతూ.. రాజీయే రాజమార్గం నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా చేసామన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్‌కు సంబంధించి రూ. 70 లక్షల చెక్కును పంపిణీ చేశామన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజీవ్ క్రీడా ప్రాంగణంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత హాజరుకానున్నారని వెల్లడించారు. 3వేల మంది మహిళలతో ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం తెలిపారు. రెండు జిల్లాల్లో మొత్తం 21 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ ప్రమాద బీమా, బ్యాంకు చెక్ బౌన్స్, ప్రాంసరీ, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్, ల్యాండ్, తదితర కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్యానికి వాడితే కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విజయనగరం, గజపతినగరం, డెంకాడ, చీపురుపల్లి, గరివిడి, రాజాం ప్రాంతాల్లో రెండు బృందాలుగా అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీ చేసి 57 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి 6ఏ కేసు నమోదు చేశారు. వ్యాపారానికి డొమెస్టిక్ సిలిండర్లు వాడడం నేరమన్నారు.
జన ఔషధి కేంద్రలంలో తక్కువ ధరలకే నాణ్యమైన ఔషధాలు లభిస్తాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. పోస్టాఫీసు ఎదురుగా ఉన్న జన ఔషధి కేంద్రంలో జన ఔషధి దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బయట మెడికల్ షాపుల్లో బ్రాండెడ్ ఔషధ ధరలు ఆకాశాన్ని అంటున్నాయని.. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ధరలకే జన ఔషధి కేంద్రల ద్వారా విక్రయిస్తున్నాయన్నారు. ఈ ఔషధాలన్నీ బ్రాండెడ్ ఔషధాల మాదిరిగానే పనిచేస్తాయన్నారు.
బాడంగి సమీపంలోని ఎయిరో డ్రమ్ భూమితో పాటు చుట్టూ పక్కల ఉన్న భూములలో ఆయుధ భాండాగారాన్ని ఏర్పాటు చేసేందుకు భూములను నావికా దళ జూనియర్ మేనేజర్ చైతన్య, ఆర్డీవో రామ్మోహనరావు శుక్రవారం పరిశీలించారు. బాడంగి మండలం ముగడ, పాల్తేరు, రామచంద్రపురం, మల్లంపేట, పూడివలస, కోడూరు గ్రామాలలో 1,585 ఎకరాల భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. వారితో ఎమ్మార్వో సుధాకర్, సిబ్బంది ఉన్నారు.
Sorry, no posts matched your criteria.