India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. జామి మండలం అట్టాడ గ్రామంలో పిడుగు పడి సత్యనారాయణ (60) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ సమీపంలోని పార పని చేస్తుండగా పిడుగుపాటుకు గురయ్యాడని చెప్పారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
జిల్లాలో ఉన్న నాటుతుపాకీల ఏరివేతకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. గంజాయి, నాటుసారా నియంత్రణ, నాటుతుపాకీల స్వాధీనమే లక్ష్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. లైసెన్స్ లేకుండా నాటు తుపాకీలను వినియోగించడం నేరమని, స్వచ్ఛందగా అప్పగించాలని కోరారు.
జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ (NCSC) కిశోర్ మాక్వాను, NHRC సభ్యులను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కలిసి జిందాల్ భూ సమస్యలపై రైతులకు న్యాయం జరగాలని వినతిపత్రం అందించినట్లు బుధవారం తెలిపారు. NHRC సభ్యులు విద్యా భారతి, జస్టిస్ సారంగి, ఎస్టీ కమిషన్ సభ్యులు నిరుపమ్ చక్మా, హుస్సేన్, బీజేపీ నాయకులను కలిసి వినతి పత్రాలు అందించామన్నారు. విచారణ చేసి నివేదిక పంపాలని కలెక్టర్‌కు ఆదేశాలు అందాయన్నారు.
విజయనగరం రైల్వే స్టేషన్‌లోని 5వ నంబర్ ప్లాట్‌ఫారంపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైందని GRP ఎస్‌ఐ బాలాజీ రావు తెలిపారు. మృతుడికి సుమారు 50-55 సంవత్సరాలు ఉంటాయన్నారు. సిమెంట్ కలర్ షర్టు, ముదురు నీలిరంగు ప్యాంటు ధరించినట్లు వివరించారు. మృతుడిని గుర్తిస్తే తమను సంప్రదించాలని కోరారు. GRP హెడ్ కానిస్టేబుల్ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీఎం చంద్రబాబుతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రావు వెంకట సుజయ కృష్ణ రంగారావు మంగళవారం భేటీ అయ్యారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ క్రికెట్ స్టేడియం వేదికగా ఈనెల 8న ప్రారంభం కానున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సంబరాలకు ఆహ్వానించారు. మంత్రి నారా లోకేశ్‌కు కూడా ఆహ్వానం పలికినట్లు ఆయన తెలిపారు.
P-4 పథకంలో భాగంగా జిల్లాలో 67 వేల బంగారు కుటుంబాల అవసరాలను 2 రోజుల్లో గుర్తించాలని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. మంగళవారం తన ఛాంబర్‌లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లతో వెబెక్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 67 వేల బంగారు కుటుంబాలకు గాను 29 వేల కుటుంబాలను మాత్రమే దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. మిగిలినవి వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రతి రోజు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మంగళవారం సూచించారు. ఖరీఫ్ 2025 సీజన్‌కు కావలసిన ఎరువుల సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని కోరారు. తక్షణ అవసరంగా యూరియా 2,500 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయని తెలిపారు.
గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకొని విదేశాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడే ముఠాలు, ప్రైవేటు సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం సూచించారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లుగా కొన్ని సంఘటనలు ఇటీవల కాలంలో కొన్ని జిల్లాల్లో వెలుగు చూశాయన్నారు. నిరుద్యోగులు ఆకర్షితులు కావొద్దని సూచించారు.
ఆగష్టు 15వ తేదీన నిర్వహించే 79వ భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఏర్పాట్లపై కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరణ గావిస్తారన్నారు. వేదిక ఏర్పాట్లు, పెరేడ్ నిర్వహణ, స్టాల్స్ ఏర్పాటు, శకటాల ప్రదర్శన తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫోస్టర్ కేర్ అడాప్షన్ కార్యక్రమం పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం ఆవిష్కరించారు. తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు సురక్షితమైన కుటుంబాన్ని అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ పథకం ద్వారా 6 నెలల పైబడిన 18ఏళ్ల లోపు పిల్లలను 2 సంవత్సరాల పాటు పెంచి, తత్ఫలితంగా శాశ్వతంగా దత్తత పొందే అవకాశం ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.