Vizianagaram

News August 23, 2024

శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స

image

శాసనమండలిలో వైసీపీ తరఫున ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు శాసనమండలి సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ప్రకటన విడుదల చేశారు. కాగా బొత్స ఇటీవల విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోను, జగన్ ప్రభుత్వంలోను ఆయన కీలక పాత్ర పోషించారు.

News August 23, 2024

గుర్ల: బ్యాంక్ మేడ పైన మృతదేహం కలకలం..

image

విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో గల విశాఖ గ్రామీణ బ్యాంక్ మేడ మీద గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించారు. ప్యాంట్, చారలు షర్ట్ వేసుకున్న వ్యక్తి మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని, అది హత్యా, లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతుడు వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

News August 23, 2024

26న విజయనగరంలో గ్రీవెన్స్ రద్దు

image

శ్రీకృష్ణాష్ట‌మి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఈనెల 26వ తేదీన‌ నిర్వహించే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక(గ్రీవెన్స్ సెల్‌) ర‌ద్దు చేస్తున్న‌ట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రకటించారు. వివిధ సమస్యల కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు, అర్జీదారులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోరారు.

News August 23, 2024

బొబ్బిలి చరిత్రపై కథ..!

image

కృష్ణం వందే జగద్గురుం సినిమాతో మాటల రచయితగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయిమాధవ్ బొబ్బిలిలో పర్యటించారు. స్థానిక కోటలో ఎమ్మెల్యే బేబినాయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బొబ్బిలి చరిత్రపై కథ రాసే క్రమంలో ఎమ్మెల్యేను కలిసి చరిత్ర వివరాలు తెలుసుకున్నారు. బొబ్బిలి చరిత్ర విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

News August 23, 2024

VZM: పెళ్లి చేసుకోవాల్సిన యువకుడి మృతి

image

త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంలో కన్నుమూయడం అందరినీ కలచి వేస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చలమవలసకు చెందిన పార్థసారథి(27) అచ్యుతాపురంలో పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. అక్టోబర్ 5న పెళ్లి వివాహ తేదీని ఖరారు చేశారు. ఇంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబం సభ్యులు బోరున విలపించారు.

News August 23, 2024

పార్వతీపురం: హెల్త్ మినిస్టర్ షెడ్యూల్

image

హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ యాదవ్ పార్వతీపురం మన్యం జిల్లాలో రేపు పర్యటించనున్నారు. ఉదయం 9:40 గంటలకు సీతానగరం చేరుకుని అక్కడ పీహెచ్సీని పరిశీలిస్తారు. 10:45 గంటలకు మరిపి వలస PHCని సందర్శిస్తారు. 11:35 గంటలకు పార్వతీపురం జిల్లా ఆసుపత్రి సందర్శించి అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.

News August 23, 2024

పార్వతీపురం: హెల్త్ మినిస్టర్ షెడ్యుల్

image

హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ యాదవ్ పార్వతీపురం మన్యం జిల్లాలో రేపు పర్యటించనున్నారు. ఉదయం 9:40 నిమిషాలకు సీతానగరం చేరుకుని అక్కడ పిహెచ్సీని పరిశీలిస్తారు. 10:45 నిమిషాలకు మరిపి వలస పిహెచ్సీని సందర్శిస్తారు. 11:35 నిమిషాలకు పార్వతీపురం జిల్లా ఆసుపత్రి సందర్శించి అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.

News August 23, 2024

‘సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పనులను వేగవంతం చేస్తాం’

image

మెంటాడ మండలం చిన్నమేడపల్లి, దత్తి రాజేరు మండలం మర్రివలస గ్రామాల వద్ద నిర్మించనున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన మౌలిక వసతులను వేగవంతం చేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సౌరవ్ గౌర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ట్రైబల్ యూనివర్సిటీ పనులను సమీక్షించారు. వచ్చే మార్చినాటికి అకడమిక్ బ్లాక్స్, హాస్టల్స్ ప్రారంభం కావాలన్నారు.

News August 22, 2024

బొబ్బిలి: మద్యం వద్దన్న భర్త.. భార్య సూసైడ్

image

బొబ్బిలి మండలంలోని విజయపురి గ్రామానికి చెందిన గౌరమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి మృతి చెందిందని సీఐ సతీశ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న భర్తతో కలిసి గౌరమ్మ మద్యం తాగింది. మద్యం చాలలేదని గొడవ పడటంతో భర్త మందలించగా పురుగు మందు తాగినట్లు తెలిపారు. గమనించిన భర్త జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

News August 22, 2024

ఐదు నెలల్లో మానాపురం ఫ్లై ఓవర్ పూర్తి కావాలి: కలెక్టర్ అంబేడ్కర్

image

విజయనగరంలో జిల్లాలోని ద‌త్తిరాజేరు మండ‌లం మానాపురం రైల్వే గేటు వద్ద రాయ్‌పూర్ జాతీయ ర‌హ‌దారిపై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం వ‌చ్చే జ‌న‌వ‌రి నెలాఖ‌రు నాటికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తికావాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ వంతెన నిర్మాణం ప‌నుల పురోగ‌తిపై ఇక‌పై ప్ర‌తి నెలా నిర్మాణ సంస్థ‌తో, జాతీయ ర‌హ‌దారుల సంస్థ ఇంజినీర్ల‌తోను స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌న్నారు.