India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భోగాపురం మండలంలోని పోలిపల్లి, కౌలువాడ, లింగాలవలసలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ డ్వామా పీడీ శారదా కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారని ఏపీఓ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.
వేపాడ మండలం చామలాపల్లి నుంచి వెంకయ్యపాలెం వెళ్లే రహదారిలో అరిగివాని చెరువు కల్లాల వద్ద గిరినాగు శుక్రవారం రాత్రి కనిపించింది. స్థానిక రైతులు గుర్తించి వన్యప్రాణుల సంరక్షణ సమితి ప్రతినిధి వరపుల కృష్ణకు సమాచారం అందించారు. కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని 16 అడుగుల గిరినాగును గోనెసంచిలో బంధించాడు. ఉదయాన్నే అటవీ ప్రాంతంలో వదిలేస్తామని చెప్పటముతో స్థానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
వైసీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గుర్ల, గజపతినగరం, గంట్యాడ, గరివిడి జడ్పీటీసీలు శీర అప్పల నాయుడు, గార తవుడు, వి.నరసింహమూర్తి, వాకాడ శ్రీనివాసరావు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో గురువారం కలిశారు. వైసీపీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారని జడ్పీటీసీలు తెలిపారు. మాజీ సీఎంను కలిసిన వారిలో రాజాం నియోజకర్గ ఇన్ ఛార్జ్ తలే రాజేశ్ కూడా ఉన్నారు.
రామభద్రపురం మండలం కొట్టక్కికి చెందిన కర్రి దుర్గాప్రసాద్ (15) మంగళవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అవుతానని భయంతో ముందే ఉరివేసుకున్నారు. కుటుంబ సభ్యులు సాలూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కాగా నిన్న వెలువడిన ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.
జిల్లా ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన శ్రీకాకుళంలో RIOగా DOEOగా, మన్యం జిల్లా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఇంటర్ విద్యలో RIO, DOEO పోస్టులను కలిపి జిల్లా ఇంటర్ విద్యా శాఖాధికారి పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు.
విజయనగరం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లుగా డయల్ 112కు ఫిర్యాదు వచ్చింది. టూ టౌన్ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ సకాలంలో స్పందించి 17 ఏళ్ల అమ్మాయిని రక్షించారు. దీంతో ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్‌ని బుధవారం అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు.
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 22,777 మంది పరీక్ష రాయగా 19,824 మంది పాసయ్యారు. 11,413 మంది బాలురులో 9.748(85.41%) మంది, 11,364 మంది బాలికలు పరీక్ష రాయగా 10,076(88.67%) మంది పాసయ్యారు. 87.04% పాస్ పర్సంటైల్‌తో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఏడో స్థానంలో నిలిచింది.
బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు బాగా చదవడం లేదని పరీక్షలకు నెల రోజుల ముందు హెచ్ఎం రమణ విద్యార్థుల ముందు గుంజీలు తీసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తామని, ట్రిపుల్ ఐటి సీట్లు సాధిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 85 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
యూపీఎస్సీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సివిల్స్‌కు విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఎంపికైన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన పొటుపురెడ్డి భార్గవ్(455వ ర్యాంక్) కాగా మరొకరు రాజాం మండలం సారధి గ్రామానికి చెందిన వావిలపల్లి భార్గవ్(830వ ర్యాంక్) ఉన్నారు. భార్గవ్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణలో ఉండగా, భార్గవ స్టేట్ టాక్స్ అధికారిగా ఉన్నారు.
ఈ నెల 30న పాలిసెట్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని DRO శ్రీనివాస మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో పరీక్ష నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 8,083 మంది అభ్యర్థులు 23 కేంద్రాల్లో హాజరు కానున్నారని తెలిపారు. విజయనగరంలో 9 కేంద్రాలు, బొబ్బిలిలో 6 కేంద్రాలు, గజపతినగరంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.