Vizianagaram

News March 23, 2026

VZM: కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ‘PGRS’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారన్నారు. భూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ కూడా నిర్వహించనున్నామని, కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని సూచించారు.

News March 22, 2026

VZM: సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ నియామకం

image

విజయనగరం జిల్లాలో సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్‌ను నియమించినట్లు జిల్లా గనులు భూగర్భ శాఖాధికారి సూర్య చంద్రరావు ఆదివారం తెలిపారు. ఈనెల 23 నుంచి జూన్ 16 వరకు ఇసుక, రాయి, మట్టి, గ్రానైట్ వంటి ఖనిజాలు తీసుకునే వారి నుంచి ఈ సంస్థ నిర్ణీత సీనరేజ్ ఛార్జీలను వసూలు చేయనుంది. లీజుదారులు, ప్రజలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహకరించాలని కోరారు.

News March 22, 2026

VZM: విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు

image

విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. పరీక్షల అనంతరం ఖాళీ సమయంలో కొంతమంది విద్యార్థులు చెరువులు, కాల్వలు వంటి జలవనరుల వద్దకు వెళ్లే అవకాశముండడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలకు ముందుగానే హెచ్చరికలు ఇవ్వాలని ఆయన కోరారు.

News March 22, 2026

VZM: రాములోరి కళ్యాణానికి భక్తులకు ఆహ్వానం

image

మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రామతీర్ధం శ్రీ సీతారామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ఉత్తరాంధ్ర భక్తులు తరలిరావాలని ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు శనివారం కోరారు. కళ్యాణంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.1500 టికెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఆలయం వద్ద టికెట్లు లభ్యమవుతాయని, పాల్గొనే వారికి శేషవస్త్రాలు, తలంబ్రాలు, ప్రసాదం అందిస్తామన్నారు.

News March 21, 2026

VZM: ‘క్రమశిక్షణ, సేవాభావంతో ఉన్నత శిఖరాలు సాధ్యం’

image

మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం, పుణ్యగిరి ఆలయాల్లో భక్తుల క్యూలైన్ నిర్వహణలో సహకరించిన ఎన్‌సీసీ విద్యార్థులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తన కార్యాలయంలో శనివారం అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, భవిష్యత్తుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎన్‌సీసీ ద్వారా సేవాభావం పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

News March 20, 2026

గ్యాస్ పొదుపుగా వాడుకోవాలి: VZM కలెక్టర్

image

జిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, డిమాండ్‌కు సరిపడా సరఫరా జరుగుతోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన VC అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరానికి మించి గ్యాస్ బుకింగ్ చేయకుండా, పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్-సప్లై అంతరాన్ని తగ్గించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు.

News March 20, 2026

గోదావరిలో విజయనగరం విద్యార్థి గల్లంతు

image

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలో దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.

News March 20, 2026

విజయనగరంలో ఈనెల 24న మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు

image

విజ్జి స్టేడియంలో ఈనెల 24న ఉదయం 8 గంటలకు మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వర రావు శుక్రవారం తెలిపారు. 35 ఏళ్లు, 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గలవారు SAAP వెబ్‌సైట్‌లో ఆధార్‌తో రిజిస్టర్ కావాలని, అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు.

↑