India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజలు చికెన్, కోడిగుడ్లను నిర్భయంగా తినొచ్చని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. బర్డ్‌ఫ్లూ వ్యాధి, చికెన్, కోడిగుడ్ల వినియోగంపై తమ ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి గానీ, ఆ లక్షణాలు గల వ్యాధిగ్రస్తులు గానీ లేరని పశు వైద్యాధికారులు దృవీకరించారని చెప్పారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26 నుంచి జరిగే శివరాత్రి జాతర ఉత్సవాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐ గణేశ్‌తో కలిసి రామతీర్థంలో ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేశారు. ఏర్పాట్లపై ఆలయ ఈఓ శ్రీనివాసరావుతో చర్చించారు.
ఈ నెల 26 న మహాశివరాత్రి రోజున జిల్లాలో ఎక్కడా మాంసం విక్రయాలు జరపకుండా నిషేధం విధించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్య వేదిక అధ్యక్షుడు మద్దిల సోంబాబు డిమాండ్ చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజారోగ్య శాఖాధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. హిందూ పవిత్ర పర్వదినాల్లో కూడా మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టమాటా ధరలు పతనమై నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆ శాఖ సహాయ డైరెక్టర్ బి.రవికిరణ్ ఆదేశాలతో సాలూరు నుంచి 80 టన్నుల టమాటాలను నగరంలోని రైతు బజార్లకు తెప్పించి అమ్మకాలు చేపట్టారు. రింగురోడ్డు, ఆర్‌అండ్‌బి రైతు బజార్లలో రూ.12కు రైతుల ద్వారా టమాటా అమ్మకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
గంట్యాడ మండలం గింజేరు జంక్షన్ వద్ద రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఆనంద్(55) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు విజయనగరం నుంచి ఎస్.కోట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆనంద్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్రాసుపత్రికి 108లో తరలించారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకే తమ మద్దతు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఏ విధంగా జనసేన అండగా నిలుస్తుందో.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒకే మాటపై నిలబడాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రఘువర్మకు ప్రథమ ప్రాధాన్యత ఓట్లు పడేలా చూడాలన్నారు.
రైతుల సమక్షంలోనే రీ సర్వే ప్రక్రియను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. భోగాపురం మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న రావాడ గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. గ్రౌండ్ ట్రూతింగ్‌ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
జిల్లాలో ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయని జేసీ సేతు మాధవన్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6,265 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్- 2 పరీక్షలు జరుగుతాయన్నారు. నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
విజయనగరం సబ్ జైలును అదనపు సివిల్ న్యాయమూర్తి టీవీ రాజేష్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది గాని తోటి ఖైదీలు కానీ ఎటువంటి వివక్షత చూపించరాదని సూచించారు. ఖైదీల పట్ల వివక్షత చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం లీగల్ ఎయిడ్ కేంద్రాన్ని సందర్శించారు.
నెల్లిమర్ల మండలం చనుమల్లు పేట గ్రామానికి చెందిన చనుమల్లు అబద్ధం అనే రైతు మ్యుటేషన్ కోసం రెవెన్యూ అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని, శుక్రవారం నెల్లిమర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద<<15539536>> ఆత్మహత్యాయత్నం<<>> చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై కలెక్టర్ అంబేడ్కర్ శనివారం స్పందించారు. విజయనగరం RDOను విచారణా అధికారిగా నియమించి సంఘటన పై సమగ్రంగా విచారణ జరిపి నివేదికను అందించాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.