India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలను కప్పిపుచ్చుకునేందుకే తిరుపతి లడ్డూపై విష ప్రచారం చేస్తుందని అరుకు ఎంపీ డాక్టర్ గుమ్మా.తనుజారాణి అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరలించేందుకు గత ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలకు కూటమి ప్రభుత్వం దిగిందని ఆమె అన్నారు. అత్యంత పవిత్రమైన టీటీడీని భ్రష్టు పట్టించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
సెప్టెంబర్ చివరి వారంలో జరగనున్న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు జెడ్పీ హెచ్ స్కూల్ కాపుశంభం విద్యార్థినిలు ఆర్.అనూష, ఈ.జెనీలియా, పి భవాని ఎంపికైనట్లు స్కూల్ హెచ్.ఎం రాము శనివారం తెలియజేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొండవెలగాడలో జరిగిన జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో ప్రతిభను చూపి విజయం సాధించారన్నారు. పోటీలకు ఎంపికైన వారిని అభినందించారు.
ఈ నెల 24వ తేదీన పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశం మందిరంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించే ఇంటర్వ్యులకు అవంతి ఫీడ్స్, అరబిందో ఫార్మా, GMR రక్షా సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ డీఐజీగా ఎ.నాగలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె కాకినాడ నుంచి విజయనగరం బదిలీపై వచ్చారు. గతంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిజిస్ట్రార్‌గా పని చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని రిజిస్ట్రార్‌గా కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఊరట లభించింది. ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న దీనికి మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ.500 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది.
నవయుగ వైతాళికుడు, మహాకవిగా పేరు గాంచిన గురజాడ వెంకట అప్పారావు జయంతి విజయనగరంలో శనివారం జరగనుంది. 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా సర్వసిద్ధి రాయవరంలో ఆయన జన్మించారు. తండ్రి వెంకట రామదాసు విజయనగరం సంస్థానంలో పెష్కారుగా పనిచేసే సమయంలో అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నారు. తండ్రి చనిపోయిన తరువాత విజయనగరం వచ్చి ఉన్నత విద్యను పూర్తి చేశారు. 20వ శతాబ్దంలో వ్యవహారిక భాషోద్యమంలో ఆయన పోరాడారు. SHARE IT..
ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. ఈ మేరకు విజయనగరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ను శుక్రవారం తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమ్మె నోటీసు అందజేశారు. తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
విజయనగరంలో శనివారం నిర్వహించనున్న మహా కవి శ్రీ గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురజాడ స్వగృహంతో పాటు ఆయన విగ్రహం వద్ద విద్యుత్ దీపాల అలంకరణను అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో గురజాడ నివాసం విద్యుత్ అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. కలెక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.
కొత్తగా ప్రారంభమైన విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు ఛార్జీలు గుండె గుబేల్ మంటున్నాయి. శుక్రవారం నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతోంది. విజయనగరం నుంచి రాయగడ ఛైర్ కార్ ధర రూ.535, పార్వతీపురానికి రూ.490గా ధర ఉంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్ ధర అయితే దీనికి రెట్టింపు ఉంది. ఇదే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ స్లీపర్ క్లాస్ విజయనగరం నుంచి పార్వతీపురం ధర కేవలం రూ.145 మాత్రమే. వందే భారత్ ధరలు చూసి ప్రయాణీకులు హడలిపోతున్నారు.
నూతనంగా ఇటీవల ప్రారంభించిన విశాఖ – దుర్గ్ వందే భారత్ ట్రైన్ దుర్గ్ నుంచి శుక్రవారం ఉదయం 5.45 నిమిషాలకు బయలుదేరి పార్వతీపురం 11:38 నిమిషాలకు చేరుకుంది. ఈ ట్రైన్ వారంలో గురువారం మినహా మిగిలిన అన్ని రోజులు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. బొబ్బిలిలో నిలుపుదలకు స్థానిక MLA అడిగినప్పటికీ ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఈ ట్రైన్ తిరిగి విశాఖలో మధ్యాహ్నం 2:50 నిమిషాలకు దుర్గ్ బయలుదేరనుంది.
Sorry, no posts matched your criteria.