Vizianagaram

News March 18, 2026

VZM: టెన్త్ పరీక్షకు 99.76 శాతం హాజరు

image

బుధవారం జరిగిన పదో తరగతి రెండో పరీక్షకు 99.76 శాతమంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో జరిగిన టెన్త్ పరీక్షకు మొత్తం 22,890 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా.. వారిలో 22,836 మంది పరీక్షలు రాసినట్లు వెల్లడించారు. కేవలం 54 మంది మాత్రమే పరీక్షలకు గైర్హాజరు అయ్యారని తెలియజేశారు.

News March 18, 2026

VZM: దేవాలయాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

image

ఉగాది, రంజాన్ పండగలను మతసామరస్యంతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రజలకు సూచించారు. వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద విషయాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. పండగల సందర్భంగా దేవాలయాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని అధికారులకు బుధవారం ఆదేశించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 18, 2026

VZM: మామిడి రైతులకు ఉద్యాన శాఖ భరోసా

image

విజయనగరం జిల్లాలో మామిడి రైతులకు అండగా నిలుస్తూ పంట దిగుబడి పెంపునకు ఉద్యాన శాఖ చర్యలు చేపడుతోందని జిల్లా ఉద్యాన అధికారి కె.చిట్టిబాబు బుధవారం తెలిపారు. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటపై పురుగులు, తెగుళ్లు పెరిగిన నేపథ్యంలో గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులు ఫ్రూట్ కవర్లు, జిగురు అట్టలు, పండు ఈగ నివారణ పద్ధతులు వినియోగించాలని సూచించారు.

News March 18, 2026

VZM: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఉగాది వేడుకలను స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలు పాల్గొనాలని కోరారు.

News March 18, 2026

VZM: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఉగాది వేడుకలను స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలు పాల్గొనాలని కోరారు.

News March 18, 2026

గజపతినగరంలో రోజుకి 900 సిలిండర్ల సరఫరా

image

జిల్లాలోని కొన్ని మండలాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని, బుకింగ్ చేసిన 45 రోజులైనా సిలిండర్లు అందడం లేదని వచ్చిన వార్తలను జిల్లా పౌరసరఫరాల అధికారి మురళీనాధ్ బుధవారం ఖండించారు. గజపతినగరంలో రోజుకు సుమారు 900 సిలిండర్లు సరఫరా అవుతున్నాయని, OTP వచ్చిన వెంటనే డోర్ డెలివరీ జరుగుతోందన్నారు. అక్రమ మళ్లింపును అరికట్టేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

News March 18, 2026

VZM: ఎస్పీని కలిసిన ఉగాది పురస్కార గ్రహీతలు

image

ఉగాది-2026 సందర్భంగా సేవా పతకాలు పొందిన జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీ దామోదర్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని అభినందించి, ఇదే స్ఫూర్తితో బాధ్యతగా పని చేయాలని సూచించారు. కాగా జిల్లాలో మొత్తం 8 మందికి పతకాలు మంజూరయ్యాయి. వీటిలో ఒకటి ఉత్తమ సేవా పతకం, 7 సేవా పతకాలు ఉన్నాయి.

News March 18, 2026

అన్నదాత సుఖీభవ హామీ ఎక్కడ: చిన్న శ్రీను

image

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం విజయనగరంలోని ధర్మపురి కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో బొత్స సత్యనారాయణ ఆశీస్సులతో జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ వంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.

News March 18, 2026

VZM: జిల్లా వాసులకు ముఖ్య గమనిక..!

image

జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్ తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని ఆయన సూచించారు.

News March 18, 2026

VZM: ‘అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దు’

image

జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని ఆయన సూచించారు.

↑