India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టు వద్ద 105 మీటర్ల నీటిమట్టానికి గాను 103.95 మీటర్లలో నీటిమట్టం ఉంది. ప్రస్తుతం ఒడిశా నుంచి 1000 క్యూసెక్కులు నీరు రాగా అధికారులు ఒక గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు.
వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేసి అందజేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల కార్యాచరణను జిల్లా, మండల, గ్రామ స్థాయిలో తయారుచేయాలన్నారు. గ్రామస్థాయిలో కమిటీ గ్రామ ప్రణాళికను తయారుచేసి అమలుచేయాలని తెలిపారు.
ఆదివాసీ దినోత్సవంను ఆగష్టు 9న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అద్దంపట్టే విధంగా వేడుకలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని మోదీకి లఘుచిత్రం ఉన్న చేనేత వస్త్రాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బహూకరించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానిని నేరుగా కలిసి బహుమతిని అందజేసినట్లుగా ఎంపీ తెలిపారు. ఓ చేనేత కుటుంబం నేసిన వస్త్రాన్ని ప్రధానికి అందించడంతో ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలతో ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం సమావేశం నిర్వహించారు. బొబ్బిలి, చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో నమోదైన అట్రాసిటీ కేసులపై ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల్లో చట్ట ప్రకారం వ్యవహరించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యే విధంగా డీఎస్పీలు పర్యవేక్షించాలని సూచించారు.
ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిర్వహించిన మూడు రోజుల అవగాహన సదస్సు బుధవారంతో ముగిశాయి. పరిశ్రమల స్థాపనకు రాయతీ రుణాలు ఎలా పొందాలో జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ వంశీ మోహన్ అవగాహన కల్పించారు. లోన్లు ఎలా పొందాలో కెనరా బ్యాంకు ప్రతినిధి ప్రభాకర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గోవిందరావు పాల్గొన్నారు.
పోక్సో కేసులో నిందితునిగా ఉన్న భవిరెడ్డి రవితేజకు 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.6,000/- జరిమానా విధించినట్లు రామభద్రపురం ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ తెలిపారు. రొంపల్లి గ్రామంలో 2021 అక్టోబర్ నెలలో ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో రవితేజ నిందితునిగా ఉన్నాడన్నారు. నేరం రుజువు కావడంతో యువకుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి నాగమణి తీర్పు వెల్లడించినట్లు ఎస్సై తెలిపారు.
జిల్లాలో గనులు, మైనింగ్ ద్వారా 2023-24 ఏడాదికి రూ. 125 కోట్ల ఆదాయం జిల్లా నుంచి ప్రభుత్వానికి సమకూరింది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆ లక్ష్యాన్ని మరింత పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.135 కోట్ల ఆదాయాన్ని సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఇటీవల జరిగిన సదస్సులో సీఎం చంద్రబాబుకు వివరించారు.
పట్టణంలోని స్థానిక మహారాజా కళాశాలలో ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి అరుణ తెలిపారు. సంగీత మొబైల్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, రిలయన్స్ జియో ఫైబర్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ లిమిటెడ్ తదితర సంస్థల్లో కొలువుల భర్తీకి ఎంపికలుంటాయని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని.. నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏపీలో రెండవ అతిపెద్ద జగనన్న లేఅవుట్ విజయనగరం గుంకలాం లే అవుట్. సాక్షాత్తు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ లేఔట్‌కు శంకుస్థాపన చేశారు. సుమారు 12 వేల గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వం మారడం, కూటమి ప్రభుత్వం రావడంతో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇక్కడ ఇళ్ల నిర్మాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక్కడ ఇళ్ల నిర్మాణా బిల్లులు విడుదల అవుతాయో, లేదోనన్న సందిగ్ధత నెలకొంది.
Sorry, no posts matched your criteria.