India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంకల్ప్ 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూషన్‌లో చట్టాలపై గురువారం అవగాహన కల్పించారు. వన్ స్టాప్ సెంటర్, శక్తిసాధన, సఖి నివాసం, 181 ఉమెన్ హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, లింగ సమానత్వం, పోషణ, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
నేపాల్‌లో గడిచిన 2 రోజులగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా నుంచి మొత్తం 61 మంది మానససరోవర యాత్రకు వెళ్లిన వారు ఉన్నారు. వారిని రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఖాట్మండు నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాత్రికులందరూ రాష్ట్రానికి చేరుకుంటారన్నారు. వారి బంధువులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు.
రైతులకు తగినంత యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని, పంపిణీ కూడా సక్రమంగా జరుగుతోందని కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం తెలిపారు. యూరియా సరఫరాలో సమస్యలు తగ్గాయని, డయిల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫోన్ చేసేవారి సంఖ్య కూడా తగ్గిందని చెప్పారు. అందువల్ల డయిల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని గురువారం నుంచి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
విజయనగరం మండలం రీమా పేట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీ.టీ.అగ్రహారానికి చెందిన సిమ్మ రాము(50) మృతి చెందాడు. మృతుడు బండిపై ఐస్‌లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. బుధవారం ఐస్‌లు అమ్ముకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై రూరల్ ఎస్‌ఐ వి.అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయనగరం జిల్లా నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన 61 మందీ క్షేమంగా ఉన్నారని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. వీరిని సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. యాత్రికులతో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత స్వయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారని, వారిని రప్పించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. మంత్రి లోకేశ్‌కు జిల్లాకు చెందిన యాత్రికులు 61 మంది జాబితాను పంపించామన్నారు.
విజయనగరం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి బబిత ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వచ్చేనెల 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను న్యాయవాదులు విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు, అన్ని సివిల్ దావాలు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకు, తదితర కేసులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.
విజయనగరం జిల్లాలో ప్రస్తుతం 200 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. బుధవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఐపీఎల్ కంపెనీ నుంచి కేటాయించిన 700 మెట్రిక్ టన్నులు మార్గమధ్యంలో ఉందని, ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు చేరునుందన్నారు. అదేవిధంగా రైలు మార్గం ద్వారా కాకినాడ నుంచి ఇంకొక 500 మెట్రిక్ టన్నులు 3 రోజుల్లో వస్తుందన్నారు.
మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.వెయ్యి జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. 2023లో కొత్తవలసలోని కుమ్మరివీధిలో సూర్యకాంతం ఇంట్లోకి ఎల్.కోట (M) జమ్మాదేవిపేటకు చెందిన కృష్ణ చొరబడి ఆమెను గాయపరిచి బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.
మెంటాడ మండలం గుర్ల గ్రామంలో మద్యానికి బానిసైన కుమిలి సంతోశ్ మంగళవారం రాత్రి పురుగుమందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆండ్ర ఎస్‌ఐ సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాజాం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంతకుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా పీజీ చదివి వయసు 18-35లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు. 12 బహుళజాతి కంపెనీలు జాబ్ మేళాకు హాజరవుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.