India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనకాపల్లి జిల్లాకు చెందిన అమ్మాయిని మోసగించిన కేసులో పార్వతీపురానికి చెందిన పి.సాయి మనోజ్ కుమార్‌కు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. శిక్షతో పాటు రూ.5,500 జరిమానా విధించింది. భోగాపురం సమీపంలో చదువుతున్న రోజుల్లో సాయి మనోజ్‌తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆమె కేసు పెట్టింది.
మహ శివునికి ఎంతో ప్రీతికరమైన బ్రహ్మ కమలం పుష్పాలు హిమాలయాల్లో ఏడాదికి ఒక్కసారే విరబూస్తాయి. అలాంటి ఆ బ్రహ్మ కమలాలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విరబూయడం అందరినీ ఆకర్షిస్తోంది. పట్టణంలోని వైకేయం కాలనీకి చెందిన అశపు సర్వేశ్వరరావు ఇంటి ఆవరణలో నాటిన ఈ మొక్కకు పూలు విరబూశాయి. సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషించారు. సమీపంలోని శివాలయంలో ఆ పూలను సమర్పిస్తామన్నారు.
మన్యం జిల్లాలో గిరిజనులు డోలిమోత కష్టాలు పడకుండా కంటైనర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మన్యం ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.8 లక్షలతో వైజాగ్‌లో కంటైనర్ హాస్పిటల్స్ సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో ఐదు బెడ్లతోపాటు, సెలైన్ స్టాండ్స్, అన్ని సదుపాయాలు ఉంటాయని తెలిపారు.
పార్వతీపురం-కురుపాం ప్రధాన రహదారిలోని ఖడ్గవలస కూడలిలో ఉన్న రైస్ మిల్లు వద్ద ఏనుగుల గుంపు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ప్రధాన రహదారిపై ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగుల గుంపు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప రహదారుల పైకి రావద్దని సూచించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. చోడవరంలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అధ్యక్షతన పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బొత్స మాట్లాడుతూ.. జగన్ తనను నమ్మి అభ్యర్థిగా ఖరారు చేశారన్నారు. ప్రజా ప్రతినిధులు కలిసిమెలిసి పనిచేసి గెలిపించాలని కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, విజయనగర జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎంతో చర్చించారు.
చేనేత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి శుక్రవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన ఐకాన్ మెగా ట్రేడ్ ఫెయిర్ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమ మనుగడ సాగించాలంటే ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడి ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రస్తుత కార్యవర్గం రాజీనామాలు సమర్పించడంతో..వెంటనే త్రీ మెన్ కమిటీని అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొబ్బిలికి చెందిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు కమిటీలో చోటు దక్కింది. ఎన్నికలు జరిగేంత వరకు త్రీ మెన్ కమిటీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తుంది.
VMRDA పరిధిలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా వినూత్న ప్రాజెక్టులు, ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రకృతిని పరిరక్షించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో అదనంగా 500 ఎకరాల్లో ఏరో సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
ఎస్.కోటలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాగర్ అనే ఉద్యోగి శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన తల్లిదండ్రులను చూసేందుకు బైక్‌పై శ్రీకాకుళం బయలుదేరాడు. రణస్థలం సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు అతని స్నేహితులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.