India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

APPSC-2026 నియామక పరీక్షలు ఈనెల 9 నుంచి 11 వరకు విజయనగరంలో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి నూకరాజు శనివారం తెలిపారు. ఆటవీ, దేవదాయ శాఖలకు చెందిన పోస్ట్‌లకు JNTU, సీతం ఇంజినీరింగ్ కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 6,700 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మహిళా కానిస్టేబుల్ కె.నాగమణి కుటుంబానికి పోలీసు సిబ్బంది అండగా నిలిచారు. చేయూతగా సేకరించిన రూ.1.47లక్షల చెక్కును ఆమె భర్త జె.కృష్ణకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ దామోదర్ శనివారం అందజేశారు. విధి నిర్వహణలో ప్రమాదం, అనారోగ్యంతో మృతి చెందిన పోలీసు కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని, ఇలాంటి చర్యలు పోలీసు ఉద్యోగుల్లో ఐక్యతను పెంచుతాయని ఎస్పీ పేర్కొన్నారు.

పరిశ్రమలకు అవసరమైన భూములను వెంటనే ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఎం.ఓ.యూ చేసుకున్న కంపెనీల ప్రోగ్రెస్‌పై సమీక్షించారు. ప్రస్తుతం 10 కంపెనీలకు భూములు కేటాయించాల్సి ఉందని, అక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానం చేసి సోమవారానికి పంపాలని కలెక్టర్ ఆదేశించారు.

ఎస్.కోటలోని స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత శనివారం తెలిపారు. మార్చి 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని నెలకు రూ.45,000 వేతనంతో పాటు రూ.5వేలు ప్రయాణ భత్యం అందుతుందన్నారు. అర్హతలు, అనర్హతలు, దరఖాస్తు విధానం వివరాలను విజయనగరం జిల్లా కోర్టు కార్యాలయంలో పొందవచ్చన్నారు.

ప్రభుత్వం విజయనగరం జిల్లాలో 10 కొత్త బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందని గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త ఎస్.రూపవతి తెలిపారు. ఈ పాఠశాలలతో సుమారు 3,000 మంది విద్యార్థులకు అదనపు సీట్లు లభించనున్నాయి. ఇవి 2026-27 విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతాయన్నారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఇవి తోడ్పడతాయన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అన్ని పనులు మార్చి 31లోగా పూర్తి చేయాలని పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కృష్ణ తేజ ఆదేశించారు. శుక్రవారం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఉపాధి హామీ పనులపై కమీషనర్ సమీక్షించారు. తక్కువ పురోగతి ఉన్న గంట్యాడ, వేపాడ, గరివిడి, గజపతినగరం, జామి మండలాలు మార్చి 15లోగా పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీల్లో ఫిబ్రవరి 15 నాటికి శతశాతం పన్నులు వసూలు కావాలని పంచాయితీ రాజ్ కృష్ణ తేజ ఆదేశించారు. పట్టణంలోని ఓ హోటల్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ నెల 28లోపు లక్ష్యాలను పూర్తి చేయాలని, ఫిబ్రవరి 15లోపు శతశాతం వసూలు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Sorry, no posts matched your criteria.