Vizianagaram

News February 6, 2026

ఈ నెల 7న షెడ్యూల్డ్ నాయకుల నుంచి వినతుల స్వీకరణ

image

AP షెడ్యూల్డ్ కులాల కమిషన్ మెంబర్ రావాడ సీతారాం ఈ నెల 7న విజయనగరం జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో షెడ్యూల్డ్ కుల నాయకుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం చీపురుపల్లి, రాజాం ప్రాంతాలను సందర్శించనున్నారని కలెక్టర్ కార్యాలయ వర్గాలు గురువారం వివరాలె వెల్లడించాయి.

News February 5, 2026

టీచర్‌గా మారిన విజయనగరం కలెక్టర్

image

నిరక్షరాస్యత నిర్మూలనతోనే సమాజాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం విజయనగరం మండలం దుప్పాడలో ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని ఆయన సందర్శించారు. టీచర్‌గా మారి మహిళలకు పాఠాలు బోధించారు. మహిళలు చదువుకుంటే కుటుంబం ప్రగతిపథంలో పయనిస్తుందన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి పాల్గొన్నారు.

News February 5, 2026

హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం: DRO

image

హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి ఆదేశించారు. గురువారం ఒన్ స్టాప్ సెంటర్ నిర్వహణపై తన ఛాంబర్‌లో సమీక్షించిన DRO మాట్లాడారు. మహిళల అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన ఒన్ స్టాప్ సెంటర్ ద్వారా హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. మహిళలకు వైద్య, పోలీస్, న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందిస్తున్నామని చెప్పారు.

News February 5, 2026

విజయనగరం: నిరుద్యోగులకు GOOD NEWS

image

ఈ నెల 7న విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ ఎంపికల్లో పలు ప్రైవేట్ సంస్థలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 5, 2026

రెవెన్యూ లక్ష్యాల సాధనకు ప్రత్యేక చర్యలు అవసరం: VZM కలెక్టర్

image

జిల్లాలో రెవెన్యూ వసూళ్ల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. లక్ష్యాల సాధనకు శాఖల వారీగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, లోటు ఉన్న శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు, రోజువారీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News February 5, 2026

VZM: బార్ లైసెన్సుల మంజూరుకు లాటరీ తీసిన కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో 11 బార్ లైసెన్సుల మంజూరుకు సంబంధించి కలెక్టరేట్ ఆడిటోరియంలో లాటరీ ప్రక్రియను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ లాటరీ కోసం మొత్తం 6 కౌంటర్లను ఏర్పాటు చేసి పారదర్శకంగా ప్రక్రియ చేపట్టారు. 11 బార్ లైసెన్సులకు మొత్తం 62 మంది దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తు ఫీజు కింద ప్రభుత్వం రూ.3.10 కోట్ల ఆదాయం పొందిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

News February 5, 2026

VZM: ‘భూ హక్కుదారునికే పాస్‌పుస్తకాలు ఇవ్వాలి’

image

భూముల హక్కుదారులకే పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాస్‌పుస్తకాల పంపిణీ, రీ-సర్వే, మ్యుటేషన్ ప్రక్రియలపై ఆయన సమీక్షించారు. ప్రతి నెలా 9వ తేదీలోగా పంపిణీ పూర్తి చేయాలని, ఈ-కేవైసీ అనంతరం తప్పులేని పాస్‌పుస్తకాలు ఇవ్వాలని సూచించారు.