India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేస్తూ ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలకు తోటి సిబ్బంది అండగా నిలిచారు. వారి ఒకరోజు వేతనాన్ని జమచేసి ఎస్పీ వకుల్ జిందాల్ చేతులమీదుగా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అందే సాయం కోసం వేచి చూడకుండా తోటి అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదుకోవడం అభినందనీయమని అన్నారు.
సార్వత్రిక విద్యాపీఠం 2024- 25 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్ దూర విద్యా విధానం కోర్సులలో ప్రవేశాల కోసం నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రకటించారు. దీనికి సంబంధించిన గోడపత్రికను స్థానిక కలెక్టర్ కార్యాలయ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి లక్ష్యం మేర నమోదు ప్రక్రియ జరిగేవిధంగా చర్యలు చేపట్టాలని విద్యా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఉమ్మడి విజయనగరం వాసులు ఫ్రెండ్‌షిప్‌కి ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు విడదీయలేని బంధాలెన్నో. సంతోషంలోనే కాదు ఆపదలోనూ అండగా ఉండే మిత్రులెందరో. పాఠశాల స్థాయి నుంచి ఉన్న స్నేహాలైతే లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్ పార్టీలో కన్నీరుపెట్టిన మిత్రులెందరో కదా. అలాంటి వారి కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ ప్రాణ స్నేహితుడు ఎవరు?
☞ Happy Friendship Day
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మంత్రి సంధ్యారాణిని శనివారం సాయంత్రం మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళలు, చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ కల్పించాలని సూచించారు.
జిల్లాలో కొత్తగా 39 లెప్రసీ (కుష్టు) వ్యాధి కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కరరావు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జులై 18 నుంచి 15 రోజుల పాటు కుష్ఠ వ్యాధిపై ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 16,96,837 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఇందులో 5,106 అనుమానిత కేసులు గుర్తించామన్నారు. వీరి అందరికీ కూడా పరీక్షలు నిర్వహించనున్నామన్నారు.
సాలూరు-విశాఖ రైలు బస్సు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విశాఖ-విజయనగరం మధ్య నడుస్తున్న రైలును వీలైనంత త్వరగా సాలూరు వరకు పొడిగించాలని రైల్వే డీఆర్ఎం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్ర్యానికి ముందు సాలూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయగా నష్టాల పేరిట 2000లో మూతబడింది. 2004లో రైలు సేవలు అందుబాటులోకి రాగా.. కొవిడ్ లాక్ డౌన్ కారణంగా సేవలు నిలిచిపోయాయి.
పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన బొబ్బిలి మండలం చింతాడ గ్రామంలో చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన టి.సుధీర్ (27) తన పొలానికి వెళ్లగా పాము కాటు వేసింది. పురుగు కుట్టిందనుకొని పట్టించుకోకుండా వదిలేశాడు. కాలు వాపు వచ్చి నొప్పి ఎక్కువ అవడంతో స్నేహితులతో కలిసి ఆసుపత్రికి వెళ్లాడు. పరిస్థితికి విషమించడంతో మృతిచెందాడు.
విశాఖ స్థానిక సంస్థల MLC YCP అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీ ఖరారైంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా నేతలకే అవకాశం కల్పిస్తుంటారు. కానీ, విజయనగరం జిల్లాకు చెందిన బొత్స పేరును జగన్ ప్రకటించడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. బొత్స సతీమణి ఝాన్సీ ఇటీవల విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా, నేడు బొత్సకు అవకాశం దక్కింది. దీంతో బొత్స అనుచర వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది.
ముడిచమురు హ్యాండ్లింగ్‌లో విశాఖ పోర్టు రికార్డు సాధించింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ముడిచమురు నిర్వహణలో అద్భుతమైన ఫలితాలు రాబట్టింది. పోర్టు చరిత్రలో అత్యధికంగా ముడిచమురు నిర్వహించినట్లు ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. మలేషియాకు చెందిన ఎంటీ ఈగల్ వ్యాలరీ క్రూడ్ ఆయిల్ షిప్ నుంచి 1,60,000 టన్నుల ఆయిల్‌ను హ్యాండ్లింగ్ చేసి తన రికార్డ్‌ను తనే అధిగమించినట్లు ఛైర్మన్ తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల డిమాండ్ చేశారు. ఎన్డీఏ నేతలకు చిత్తశుద్ధి ఉంటే పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాలను వెంటనే సమకూర్చాలని ఆమె ట్విటర్ ద్వారా కోరారు. ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పి బతికించారా? లేక నిధులు ఇవ్వకుండా ప్లాంట్‌ను చంపాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.