Vizianagaram

News June 24, 2024

విజయనగరం వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

విజయనగరం జిల్లా కేంద్రం రింగురోడ్డు సమీపంలోని మహరాజుపేట వద్ద నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయ భవనం అక్రమమని నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీచేశారు. వీఎంఆర్డీఏ అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంటూ.. నిర్మాణ పనులు తక్షణం నిలుపు చేయాలని, వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. కాగా సుమారు ఎకరా స్థలంలో ఇక్కడ వైసీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది.

News June 24, 2024

ప్రజల మనసును గెలుచుకున్న కలెక్టర్

image

కేవ‌లం 14 నెల‌ల కాలంలోనే ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు కలెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి. ఈ కొద్ది రోజుల్లోనే ఆమె అజాత శ‌తృవుగా, అంద‌రికీ అభిమాన‌పాత్రుల‌య్యారు. జిల్లా అభివృద్ధి ప‌ట్ల త‌ప‌న, నిరంత‌ర శ్ర‌మ, ఎటువంటి భేష‌జాలులేని ప‌నితీరుతో ఆమె అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఒక‌వైపు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అధికారయంత్రాంగాన్ని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, విధులు నిర్వహించారని అధికారులు గుర్తు చేసుకున్నారు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో మంత్రులు సంధ్యారాణి, శ్రీనివాస్

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉమ్మడి విజయనగరం నుంచి మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

విశాఖ: MA పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఏయూ

image

ఏయూ పరిధిలోని MA అంత్రపోలజీ, ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, కూచిపూడి క్లాసికల్ డాన్స్, హిస్టరీ, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, కర్ణాటక సంగీతం, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, ఏన్షియెంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్‌సై‌ట్‌లో అందుబాటులో ఉంచారు.

News June 24, 2024

సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్లిన విజయనగరం MP

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేడు ఢిల్లీలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు బయలుదేరారు. ముందుగా ఆయన తన తల్లికి పాదాభివందనం చేసి పార్లమెంటుకు వెళ్లారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు హాజరయ్యారు.

News June 24, 2024

VZM: జిల్లాలో 308 మందికి చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను సోమవారం వెల్లడించారు. MV నిబంధనలు అతిక్రమించిన 308 మందిపై రూ.58,575 ఈ-చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 18 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 35 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయన్నారు.

News June 24, 2024

విశాఖ: రైళ్ల రద్దుపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు

image

విశాఖ నుంచి బయలుదేరే ఇంటర్ సిటీ రైళ్లనే రద్దు చేయడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను యథావిధిగా నడుపుతూ వీటినే ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా రద్దు చేయకుండా కనీసం రాజమహేంద్రవరం వరకు నడపాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జన్మభూమి, రత్నాచల్ తదితర రైళ్ల ఛార్జీలకు 4 రెట్లు బస్ ఛార్జీలు ఉంటున్నాయని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.

News June 24, 2024

విజయనగరం: పురుగుమందు తాగి వ్యక్తి మృతి

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగుమందు తాగి మృతిచెందిన ఘటన కొమరాడ మండలంలో జరిగింది. అర్తాం గ్రామానికి చెందిన శంకరరావు(39) ఆదివారం మద్యం తాగి.. ఆ మత్తులో పురుగు మందును తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబ సభ్యులు గమనించి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

News June 24, 2024

నేటి నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ: కలెక్టర్ నిశాంత్ కుమార్

image

సోమవారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30కు ప్రారంభం అవుతుందన్నారు. తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా ఆయన కోరారు. ఫిర్యాదులు తెలిపేందుకు ఇది ఒక మంచి అవకాశమని అన్నారు.

News June 23, 2024

VZM: ఎస్సైపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు

image

ట్రాఫిక్ ఎస్సైపై దాడి చేసిన ఘటనలో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ బీ.వెంకటరావు అన్నారు. శనివారం రాత్రి ట్రాఫిక్ ఎస్సై లోవరాజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా మయూరి జంక్షన్ వద్ద విధులు నిర్వహిస్తుండగా గర్భాం గ్రామానికి చెందిన ఏ.నరేశ్ బైక్‌ను ఆపి పరీక్షలు నిర్వహిస్తుండగా అతను దుర్భాషలాడుతూ.. ఎస్సైపై దాడికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.