India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) నియమించుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి ఈ. మురళి సూచించారు. బుధవారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల ద్వారా ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు, మరణించిన ఓటర్ల వివరాలు సులభంగా గుర్తించవచ్చన్నారు. జిల్లాలో మొత్తం 15,74,815 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

విజయనగరం జిల్లా న్యాయ సేవల అధికార సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.భబిత మంగళవారం తెలిపారు. బ్యాంక్, పబ్లిక్ హాలిడేస్ కారణంగా జనవరి 27 చివరి తేదీని జనవరి 30కి మార్చినట్లు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ప్రస్తుతం ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలలో కనీసం 50 శాతం వరకు తప్పులు ఉన్నాయని JC ఎస్.సేధు మాధవన్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సిబ్బంది శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని సరిదిద్దిన తరువాతే ఖచ్చితమైన పాస్ పుస్తకాలు రూపొందించాలని సూచించారు. రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చిన అర్జీలను వారం నుంచి 10రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.

రెవెన్యూ, రీ సర్వే సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించడంపై జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి, వారికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. తప్పులు లేని రెవెన్యూ రికార్డులు రూపొందించాలన్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కాంప్ కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాజా సంగీత కళాశాల విద్యార్థులు శాస్త్రీయ సంగీతాన్ని మనోహరంగా ఆలపించారు. జిల్లా అధికారులు, సిబ్బంది సందడిగా గడిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, SP దామోదర్, JC సేధు మాధవన్, కమాండెంట్ మహేష్, అదనపు SP సౌమ్యలత, DRO మురళి పాల్గొన్నారు.

బొండపల్లి (M) గొట్లాం సమీపాన బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం <<18950810>>జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం<<>> తెలిసిందే. అయితే ఎల్లయ్య పైల్స్‌తో బాధపడుతుండగా.. వరుసకు అల్లుడయ్యే రామునాయుడు బైకుపై VZM ఆసుపత్రికి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రాము నాయుడుకు భార్య, రెండేళ్ల పాప ఉన్నారు. ఎల్లయ్య భార్యకు దూరంగా ఒంటరిగా ఉన్నారు.

బెస్ట్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ అవార్డుకు విజయనగరం జిల్లా ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులమీదుగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఉత్తమ అవార్డును స్వీకరించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, నూతన విధానాల అమలు వంటి అంశాల్లో జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిందని అధికారులు ప్రశంసించారు.

ప్రజాస్వామ్య భారతానికి ఓటే ప్రాణాధారం. ఓటు కేవలం వేలిపై వేసే గుర్తు కాదు.. అది దేశ తలరాతను మార్చే అస్త్రం. అందుకే పత్రీ పౌరుడూ తన భాద్యతగా ఓటు వేయాలి. ఈ స్పూర్తిని చాటుతూ నేడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఓటు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తారు. కాగా విజయనగరం జిల్లాలో 18-19 ఏళ్ల వయస్సు గల వారిలో కొత్తగా 14,058 మంది పురుషులు, 11,003 మంది మహిళలు కొత్తగా ఓటు హక్కు పొందారు.

విజయనగరం జిల్లాలోని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్ శిక్షణ, పోటీ పరీక్షల కోచింగ్ అందిస్తోందని విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, IT/ITES రంగాల్లో ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు apdascac.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

గణతంత్ర దినోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించాలని SP దామోదర్ అధికారులను ఆదేశించారు. జనవరి 26న పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఏర్పాట్లను ఆయన శనివారం పర్యవేక్షించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, ప్రజలు, విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. వాహనాల పార్కింగ్, తనిఖీలు, శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.