India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయనగరం జిల్లాలో ఉద్యాన పంటల సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరి కంటే ఉద్యాన పంటల ద్వారా రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయన్నారు. జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసి, సాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

జిల్లాలో మీడియా ప్రతినిధులకు 407 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ ఎస్.రాం.సుందర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. పత్రికలు, టీవీ చానళ్లు, కేబుల్, ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియాకు చెందిన ప్రతినిధులకు కార్డులు మంజూరు చేశారు.

భోగాపురం, పూసపాటిరేగ తీరప్రాంతం మండలాలకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు ఇటీవల బంగ్లాదేశ్ నుంచి విడుదల అయిన సంగతి తెలిసిందే. మత్స్యకారులు బంగ్లాదేశ్ చెర నుంచి విడిపించడంలో కూటమి ప్రభుత్వం చేసిన కృషికి మత్స్యకార కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిశారు. ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందేలా చూడాలని పవన్ కళ్యాణ్‌ని మత్యకారులు కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమీకృత కుటుంబ సర్వేకు నగర ప్రజలు సహకరించాలని విజయనగరం నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమీకృత కుటుంబ సర్వే విషయంలో ప్రజలు అపోహలకు పోవద్దన్నారు. ప్రజలకు మరింత సంక్షేమ పథకాలు అందించేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్వే బృందానికి కుటుంబ సభ్యులు యొక్క పూర్తీ వివరాలు తెలియజేయాలని కోరారు.

రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారం, తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాల తయారీపై రాజాంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డిటీలు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు తదితర సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. రీ సర్వేలో జరిగిన తప్పులు ఉండరాదన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, అభివృద్ధి పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జేసీ ఎస్. సేధు మాధవన్ పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత, దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎస్ సమీక్షించారు. అధికార యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాలన్నారు.

లెప్రసీ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా రెవెన్యూ అధికారి ఈ. మురళి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ‘వివక్షతకు ముగింపు–గౌరవానికి పరిరక్షణ’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

బాల్య వివాహాలు చేయడం లేదా ప్రోత్సహించడం నేరమని, అటువంటి వారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తామని విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.